దాడులకు భయపడేది లేదు 

దేవుడు ఇంకా ఏదో పెద్ద స్క్రిప్ట్‌ ఏదో రాశాడు: సీఎం వైయ‌స్‌ జగన్‌

విశాఖ‌లో వైయ‌స్ఆర్‌సీపీ సోష‌ల్ మీడియా వింగ్‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ముఖాముఖి

175కి 175 రావాలి. 25కి 25 లోక్‌సభ సీట్లు గెలవబోతున్నాం

సోష‌ల్ మీడియా ప్ర‌తినిధుల‌పై దాడులు జ‌రిగితే నేరుగా త‌న‌కు తెలిసేలా ఓ వేదిక‌ను రూపొందించాలి:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

విశాఖపట్నం: సోషల్‌ మీడియాలో టీడీపీ, దాని మిత్రపక్షాలు దిగజారి ప్రవర్తిస్తున్నాయని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాపై కూడా దాడి చేశారు, దాడుల‌కు భయపడేది లేదు. దేవుడు ఇంకా ఏదో పెద్ద స్క్రిప్ట్‌ ఏదో రాశాడు. పైన దేవుడు, ప్ర‌జ‌లంతా నాకు తోడుగా ఉన్నార‌ని వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు. మంగళవారం మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ఆనందపురంలో రెండు వేల మందితో కూడిన వైయ‌స్ఆర్‌సీపీ సోషల్‌ మీడియా వింగ్‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ముఖాముఖి నిర్వహించారు.
 
 సీఏం మాట్లాడుతూ ఏమన్నారంటే.....:

జగనన్న మీకు ఎప్పుడూ అండగా, తోడుగా ఉంటాడు.
మీ అందరితో కూడా ఒకే ఒక విషయం చెప్పదల్చుకున్నాను. చాలా మంది మాట్లాడగలిగారు. ఇంకా చాలా మంది మాట్లాడలేని పరిస్థితి. కానీ మీ అందరితో ఒకటే చెబుతున్నాను. మీ అందరికీ కూడా తోడుగా, మీ జగనన్న ఎప్పుడూ మీకు అండగా ఉంటాడని మాత్రం ఈ సందర్భంగా చెబుతున్నాను. 

దేవుడు పెద్ద స్క్రిప్టే రాశాడు.
ఇంకొక విషయం కూడా చెబుతున్నాను. ఈ దెబ్బ ఇక్కడ (నుదురుపైన) తగిలింది అంటే అది ఇక్కడా(కంటి మీద) తగల్లేదు. ఇక్కడా (కణత మీద) తగల్లేదు అంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్టేదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడు అని దాని అర్థం. కాబట్టి భయం లేదు. 

పైన దేవుడు – కింద మీరు అండగా ఉండగా మీ అన్నకు భయంలేదు.
మనం గెలిచేది 175కు 175 సీట్లే అని 25కు 25 ఎంపీ సీట్లే.  ఒక్క సీటు కూడా ఎక్కడా తగ్గేందుకు వీల్లేదు. మీ భుజస్కందాల మీద ఫోన్ అనే ఈ ఆయుధం మీ చేతుల్లో ఉందనేది గుర్తుపెట్టుకోమని అందరితో కోరుతున్నాను. అటు వైపున 100 ఈనాడులు వచ్చినా, 100  ఆంధ్రజ్యోతులు వచ్చినా, 100  టీవీ5లు వచ్చినా, 100 మంది చంద్రబాబులు, 100 మంది దత్తపుత్రులు వచ్చినా, జాతీయ పార్టీలు పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ మద్దతు పలికినా, కుట్రలు పన్నినా కుతంత్రాలు పన్నినా, అబద్ధాలు చెప్పినా, మోసాలు చేసినా మీ అందరికీ ఒకటే చెబుతున్నాను మీ జగన్ కు  భయం లేదు. మీ అన్నకు.  మీ తమ్ముడుకి భయం లేదు. కారణం పైన దేవుడు ఉన్నాడు. కింద మీరంతా మీ అన్నకు అండగా ఉన్నారు. 

మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు ఇక్కడ ఉన్న వాళ్లకు, ఇక్కడికి రాలేకపోయిన చాలా మంది ఆత్మీయులకు, దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉండి కూడా వారి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు చూపిస్తున్న నా అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు అందరికీ కూడా మీ జగన్ మరొక్కసారి మనసారా చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఇటువైపున తిరుగుతా వచ్చినంత మేర సెల్ఫీ తీసుకుంటాను అంటూ... సీఎం శ్రీ వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.

Back to Top