రేపు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్రచారం షెడ్యూల్‌

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ఎన్నికల ప్రచార సభల మే 10 వ తేదీ షెడ్యూల్‌ను పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి త‌ల‌శిల ర‌ఘురాం విడుద‌ల చేశారు. శుక్ర‌వారం  ఉదయం 10 గంటలకు  గుంటూరు పార్లమెంట్ పరిధిలోని  మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్ లో  జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని నగరి  నియోజకవర్గం లో పుత్తూరు లో కార్వేటినగరం రోడ్ కాపు వీధి సర్కిల్ లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కడప  పార్లమెంట్ పరిధిలో  కడప నగరంలోని మద్రాస్ రోడ్ శ్రీ పొట్టి శ్రీరాములు సర్కిల్ లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. 

Back to Top