వైయ‌స్ జగన్ సాబ్ కె సాత్ నూర్ భాషా కా హాత్

  పోస్టర్ ను విడుదల చేసిన నూర్ భాషా సంఘీయులు

తాడేపల్లి:  సీఎం వైయస్ జగన్ అధికారం లోకి వచ్చాక మాకు గుర్తింపు వచ్చింద‌ని  మైనారిటీ సెల్ రాష్ట్ర‌ అధికార ప్రతినిధి దస్తగిరి  పేర్కొన్నారు. రాజకీయ పరంగా కూడా బీసీ,మైనారిటీ లకు 50శాతం అవకాశాలు వచ్చాయ‌న్నారు. బుధ‌వారం వైయ‌స్  జగన్ సాబ్ కె సాత్ నూర్ భాషా కా హాత్.. పోస్టర్ ను  నూర్ భాషా సంఘీయులు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ద‌స్త‌గిరి మాట్లాడుతూ..  నూర్ భాషా సంఘీయులకు వైయస్ జగన్ ఎంతో ప్రయోజనం కలిగించారు. గతంలో నూర్ భాషా సంఘీయులను కించపరిచేవిదంగా సంభోదించేవారు. ఇకపై నూర్ భాషా సంఘీయులను ఆ విధంగా పిలవకూడదని పేర్కొంటూ ఆర్డర్స్ ఇచ్చారు. మాకు జగన్ గారు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా ఎన్నికలలో జగన్ గారి విజయాన్ని కాంక్షిస్తూ రాష్ర్ట వ్యాప్తంగా పర్యటించనున్నాం.మా సంఘీయులంతా కలసి వైయస్సార్సిపికు మధ్దతుగా విజయం కోసం కృషి చేయనున్నాం. దానిలో భాగంగానే జగన్ సాబ్ కా సాత్ నూర్ భాషా కా హాత్ ప్రచారాన్ని చేపట్టాం. స్వతంత్రo వచ్చిన తరుతాత ఏ పార్టీ మమ్మల్ని గుర్తించ లేదు.. వైయస్ జగన్ అధికారం లోకి వచ్చాక మాకు గుర్తింపు వచ్చింది.రాజకీయ పరంగా కూడా బీసీ,మైనారిటీ లకు 50శాతం అవకాశాలు వచ్చాయి. మా సంఘీయులకు స్థానిక సంస్థలు లో జగన్ ఇచ్చినంతగా  ప్రోత్సాహకాలు ఎవ్వరూ ఇవ్వలేదు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు  వైయస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఇచ్చారు.  చంద్రబాబు బిసిలను మోసం చేశారు.కించపరిచారు.బిసిలను ఓటుబ్యాంక్ గానే వినియోగించుకునేవారు. మైనార్టీలు అంతా కలిసి జగన్ ను గెలిపించుకొవలసిన బాధ్యత ఉందని ద‌స్త‌గిరి అన్నారు.

Back to Top