చంద్ర‌బాబు, ఈనాడుపై ఈసీకి వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు

అమ‌రావ‌తి: ఎన్నికల నియమావళికి విరుధ్దంగా వ్యవహరిస్తున్నతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు,ఈనాడు దినపత్రికలపై ఫిర్యాదు చేసిన వైయ‌స్ఆర్‌సీపీ.  ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ గ్రీవెన్స్ సెల్ రాష్ర్ట అధ్యక్షుడు నారాయణమూర్తి, లీగల్ సెల్ నేత శ్రీనివాసరెడ్డిలు ఇందుకు సంబంధించిన ఆధారాలను ఎన్నికల సంఘానికి అందచేశారు.

1. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో బాగంగా ఈనెల 5 వతేదీన తంబళ్లపల్లి,ధర్మవరంలలో ఎన్నికల ప్రచారసభలలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుధ్దం కాబట్టి చంద్రబాబుపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

2. ఈనాడు దినపత్రిక లో వైయస్సార్ సిపిఅభ్యర్దులపై ,వైయస్ జగన్ పై వ్యతిరేకత కలిగించేలా న్యూస్ ఆర్టికల్స్ ప్రచురిస్తున్నారు.వెబ్ న్యూస్ లో సైతం తెలుగుదేశంకు అనుకూలంగా కూడా ఐటమ్స్ ప్రచురిస్తున్నారు. వాటిని పెయిడ్ ఆర్టికల్స్ గా పరిగణించాలని కోరారు.

3.పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో 12 మంది స్వతంత్ర అభ్యర్దులు తెెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

మీడియాతో  ఎమ్మెల్యే మల్లాది విష్ణు కామెంట్స్

ముఖ్యమంత్రి వైయస్ జగన్ ని కించపరచటమే చంద్రబాబు లక్ష్యం చేసుకొన్నారు. పచ్చి అబద్దాలతో ప్రభుత్వం పై చంద్రబాబు బురదచల్లుతున్నాడు. ఫేక్ సర్వేతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు.
పులివెందులలో నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ వ్యవహరిస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఈసీ ఆదేశాలను సైతం చంద్రబాబు ధిక్కరించారు. సభ్యసమాజం తలదించుకునే భాషను చంద్రబాబు వాడుతున్నాడు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రాష్ట్ర ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. చంద్రబాబు దగాకోరు మాటలు వినేవాళ్ళు,నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. జగన్ మోహన్ రెడ్డి కాలి గోటికి కూడా చంద్రబాబు పనికిరాడు. వ్యవసాయం దండగన్న ఘనుడు చంద్రబాబు. వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిన వ్యక్తీ సీఎం వైఎస్ జగన్.

Back to Top