చంద్ర‌బాబుపై ఈసీకి వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు

అమ‌రావ‌తి: ఎన్నికల నియమావళికి విరుధ్దంగా ప్రవర్తిస్తున్నచంద్రబాబు,ఈనాడులపై ఫిర్యాదు చేసిన వైయ‌స్ఆర్‌సీపీ . పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు,గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్ నారాయణమూర్తి,లీగల్ సెల్ నేత శ్రీనివాసరెడ్డిలు ఎన్నికల సంఘానికి తగిన ఆధారాలను అందించారు.

చంద్రబాబు ఈనెల 07 వతేదీన పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్,మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలపై వ్యక్తిగత,అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుద్దం.కాబట్టి చంద్రబాబుపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈనాడు దినపత్రికలో  వైయ‌స్ జగన్ గారికి వ్యతిరేకంగా వ్యక్తిగత ప్రతిష్టను హననం చేసేవిధంగా వార్తా కధనాలు రాస్తున్నారు.వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా టిడిపికి అనుకూలంగా ప్రజలను ఓటర్లను ప్రబావితం చేసేవిధంగా న్యూస్ ఐటమ్స్ ప్రచురిస్తున్నారు.వీటిని పెయిడ్ ఆర్టికల్స్ గా పరిగణించాలని కోరారు
.
ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ చంద్రబాబు మతిభ్రమించి జగన్ గారిపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని విమర్శించారు.చంద్రబాబును పిచ్చాసుపత్రిలో చేర్పించాలని కోరారు.చంద్రబాబు  దిగజారి  కొన్ని  కామెంట్స్  చేస్తున్నారు. పాపాల  పెద్దిరెడ్డి  అంటూ  చంద్రబాబు మాట్లాడుతున్నారు.చంద్రబాబు ప్రజలకు  ఏమి  చేశారో  చెప్పకుండా  తిట్ల  దండకం  మొదలు  పెడుతున్నారు. చంద్రబాబు  భాష  ఆంబోతు  భాష  లాఉంది. చీకటి  రాజకీయం  చేస్తూ  చంద్రబాబు  దుష్ప్రచారం  చేయిస్తున్నారు.రాత్రి హోమంత్రి తానేటి వనితపై దాడికి ప్రయత్నించారు.నేడు మాచర్లలో ఎంఎల్ఏ సతీమణి రమాపై,ఎచ్చర్లలో జడ్ పి టి సి హేమమాలిని రెడ్డిని దుర్భాషలాడారు.విజయవాడలో బొండా ఉమా నేతృత్వంలో దళిత మహిళలపై దాడి జరిగింది.మహిళలపై దాడులు చేయడానికి చంద్రబాబుకి సిగ్గుండాలి.ఇలాంటి వాటికి స్వస్తిపలకపోతే ప్రజలే తగిన బుధ్ది చెబుతారు.
 

Back to Top