అభివృద్ధి, సంక్షేమంలో జగన్‌ విజన్‌

సీఎం వైయ‌స్ జగన్‌ పాలనపై సీనియర్‌ జర్నలిస్ట్‌ రేణుక పోతినేని పుస్తకం

‘జగన్‌ విజన్‌.. ట్రాన్స్‌ఫార్మింగ్‌ ది ఫ్యూచర్‌ ఆఫ్‌ ఏపీ’ శీర్షికతో పుస్తకం

సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ట్రెండింగ్‌

సీఎం వైయ‌స్ జగన్‌ పాలనను ప్రశంసిస్తున్న ఒకప్పటి చంద్రబాబు అభిమాని

టీడీపీ దుష్ప్రచారంతో వాస్తవాలు మరుగున పడుతున్నాయని ఆవేదన

అమరావతి: సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన టీడీపీ అభిమానులనూ ఆకట్టుకుంటోంది. గతంలో తెలుగుదేశం పార్టీకి, చంద్ర­బాబుకు అభిమాని అయిన సీనియర్‌ జర్నలిస్ట్‌ రేణుక పోతినేని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ దార్శనిక పాలనపై ప్రత్యేకంగా ఓ పుస్తకం రూపొందించారు. ‘జగన్‌ విజన్‌.. ట్రాన్స్‌ఫార్మింగ్‌ ది ఫ్యూచర్‌ ఆఫ్‌ ఏపీ’ శీర్షికతో ఆమె రచించిన ఈ పుస్తకం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ట్రెండ్‌ అవుతోంది. సీఎం జగన్‌ నాయకత్వంలో ఏపీలో కనిపిస్తున్న అద్వితీయ మార్పులను ఎలు­గెత్తి చాటుతూ, మాజీ సీఎం చంద్రబాబు హయాంలోని అవినీతి కోణాలను ఈ పుస్తకం తూర్పారపట్టింది. 

ఏపీలో అభివృద్ధి, ఉద్యోగా­లు, సామాజిక న్యాయం, పారిశ్రామిక ప్రగతి, వ్యవ­సాయం, విద్య, ఆక్వా రంగం అభివృద్ధి, వైద్యం, సంక్షేమం, భూ సంస్కరణలు, ఇళ్ల నిర్మాణం, మేనిఫెస్టో విశ్వసనీయత, సీఎం జగన్‌ స్కీములు, చంద్రబాబు స్కాములను వివరిస్తూ, అప్పటి.. ఇప్పటి అప్పులపై ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా సమగ్ర వివరాలు అందించిన ఈ పుస్తకం అందరినీ ఆకట్టుకుంటోంది.

సీఎం జగన్‌ సమగ్ర పాలనా స్వరూపాన్ని ఆవిష్కరించింది. ఒకప్పుడు చంద్రబాబు అభిమాని అయిన రేణుక పోతినేని.. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న విప్లవాత్మక అభివృద్ధి, జీవన ప్రమాణాలను పెంచుతున్న ప్రజా సంక్షేమ పథకాలను చూసి ఈ పుస్తకాన్ని రూపొందించడమే కాకుండా, సీఎం జగన్‌ పాలనను సామాజిక మాధ్యమాల్లో ప్రశంసిస్తున్నారు.

చరిత్ర ఎరుగని దుర్మార్గపు దాడి..
ఏపీ అభివృద్ధి, సంక్షేమంపై గత ఐదేళ్లుగా ప్రధాన మీడియాల్లో పదేపదే తప్పుడు ప్రచారం జరుగుతున్నట్టు రేణుక తన పుస్తకంలో అభిప్రాయపడ్డారు. ‘నిజం రెండు అడుగులు వేసేలోపు.. అబద్ధం వెయ్యి అడుగులు వేస్తుంది’ అనే నినాదాన్ని టీడీపీ, దాని అనుబంధ మీడియా సంస్థలు నమ్ముకున్నాయయి’ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మీడియా మేనేజ్‌­మెంట్‌ స్కిల్స్‌తో ప్రధాన, సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ విపరీతంగా పెరిగిపోయాయన్నారు.

తెలుగు­దేశం పార్టీ, న్యూట్రల్‌ ముసుగులో ఉన్న రెండు పత్రికలు, ఐదారు మీడియా సంస్థల అసత్య ప్రచార దాడిలో ఎన్నో వాస్తవాలు మరుగున పడిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీ తరఫున 1.50 లక్షల వాట్సాప్‌ గ్రూప్‌లు, 100కు పైగా పెయిడ్‌ మీమర్స్, వెయ్యికి పైగా ఫేస్‌బుక్‌ పేజీలను నడిపిస్తూ నిత్యం ప్రజా పాలనపై చరిత్రలో ఎన్నడూ లేనంతగా దుర్మార్గపు దాడికి పాల్పడ్డారని అభిప్రాయపడ్డారు.

ఐదేళ్లలో ఏపీ సాధించిన అభివృద్ధి, సంక్షేమం వివ­రాలు  ప్రజలకు గణాంకాలతో సహా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె చెప్పారు. సీఎం జగన్‌ తీసుకునే నిర్ణయాల వెనుక ఏపీ భవిష్యత్తు ఎంత ఉజ్వలంగా మారు­తుందో, ఎంతటి గొప్ప మార్పులు కనిపిస్తాయో ప్రతి ఒక్కరూ అవగతం చేసుకోవడానికే కచ్చితమైన సమాచారంతో ‘జగన్‌ విజన్‌’ పుస్తకాన్ని తీసుకొచ్చినట్టు’ తన ‘ఎక్స్‌’ ఖాతాలో పేర్కొన్నారు. ఆమె చెప్పిన అక్షర సత్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.  

Back to Top