కూట‌మి కొత్త కొత్త మోసాల‌తో వ‌స్తోంది..జాగ్ర‌త్త‌

మాచర్ల ఎన్నికల భేరీలో సీఎం వైయ‌స్‌ జగన్‌

ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోతుంది

ఈ ఎన్నికల్లో వైయ‌స్ జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. 

చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు

మీ బిడ్డ వైయ‌స్ జ‌గ‌న్‌ తన పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు

పౌరసేవలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు

ఇలాంటి సంక్షేమాన్ని గతంలో చూశారా?:  వైయ‌స్ జ‌గ‌న్‌

నొక్కితే 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు..మీరంతా సిద్ధమేనా? 

మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

పల్నాడు :  కూట‌మి కొత్త కొత్త మోసాల‌తో వ‌స్తోంది..ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపునిచ్చారు. మాట మీద నిలబడ్డ చరిత్ర చంద్రబాబుకి లేదని, మొన్నటి మేనిఫెస్టో చూస్తే బాబు చేయబోయే మోసం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని అన్నారు. ఏపీలో 59 నెలల పాలనలో జరిగిన విప్లవాత్మక మార్పులను గమనించాలని ఏపీ ప్రజలను కోరారు.  సోమవారం మధ్యాహ్నాం పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన ఎన్నికల ప్రచార భేరీలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..

 మాచర్ల సిద్ధమేనా.?

మధ్యాహ్నం 2  గంటలు కావస్తోంది. ఎండ తీక్షణంగా ఉంది. అయినా కూడా ఎండను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వులు కనిపిస్తున్నాయి. ప్రేమ ఆప్యాయతలే కనిపిస్తున్నాయి. మీ ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు నా ప్రతి అక్కకూ, నా ప్రతి చెల్లెమ్మకూ, నా ప్రతి అవ్వకూ,ప్రతి తాతకూ, నా ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ ముందుగా మీ జగన్... మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. 

ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు.
వారం రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతున్న ఎన్నికలు కానేకావు. ఈ ఎన్నికలు రాబోయే మీ ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీ జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడమే.
పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఏమవుతుంది? మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుంది. లేచి మళ్లీ లకలక లకలక అంటూ మీ రక్తం త్రాగేందుకు మీ ఇంటింటి గడప తొక్కుతుంది.

చంద్రబాబు మోసాల మేనిఫెస్టో.
కచ్చితంగా ఆలోచన చేయమని కోరుతున్నాను. బాబు చరిత్ర చూస్తే ఏరోజూ మాట మీద నిలబడ్డ చరిత్ర లేదు. బాబు మొన్న ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే సాధ్యంకాని హామీలతో ఆయన చెప్పిన హామీలను చూస్తే ఆయన చేయబోయే మోసం కళ్లకుకట్టినట్టుగా కన్పిస్తుంది. నేను ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఈ 59నెలలుగా మీ బిడ్డ పరిపాలనను మీరు చూశారు.

నా అక్కచెల్లెమ్మల బాగు కోసం.
ఈ 59 నెలలకాలంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో చూడనివిధంగా మీ బిడ్డ ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు.. మళ్లీ చెబుతున్నా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు మీబిడ్డ నా అక్కచెల్లెమ్మల కొరకు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలని, నా అక్కచెల్లెమ్మలకు మంచి చేసేందుకు ఏకంగా 130 సార్లు బటన్లు నొక్కాడు.

130 సార్లు మీ బిడ్డ బటన్లు నొక్కి వివిధ పథకాల ద్వారా నా అక్కచెల్లెమ్మల ఖాతాలకే నేరుగా వారి చేతికే ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా.. బటన్ నొక్కడం నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకే, వారి చేతికే ఆ సొమ్మంతా అందడం. గతంలో ఎప్పుడూ జరగనివిధంగా జరుగుతోంది. నేను అడుగుతున్నాను. మీఅందరితో కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. గతంలో ఎవరైనా ఎప్పుడైనా కూడా చూశారా? ఈ మాదిరిగా బటన్లు నొక్కడం.. ఈ మాదిరిగా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వెళ్లిపోయే కార్యక్రమంగానీ, పథకాలు గానీ గతంలో ఎప్పుడైనా చూశారా?. 

59 నెలల కాలంలో 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు.
గతంలో ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ఉద్యోగాలు ఉంటే మనం వచ్చేదాకా దశాబ్ధాలుగా ఈ 59 నెలలకాలంలో ఏకంగా మరో 2 లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు మీబిడ్డ అధికారంలోకి వచ్చినతర్వాతే ఈరోజు నా తమ్ముళ్లు, నా చెల్లెమ్మలు ఈరోజు ఏ గ్రామసచివాలయానికి వెళ్లినా ఏకంగా లక్షా 31 వేలమంది చిరునవ్వుతో ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తారు.

మొట్టమొదటిసారిగా హాస్పిటళ్లలో కూడా ఈరోజు మొన్నటిదాకా ఉద్యోగాలు ఉండి కూడా రిక్రూట్ చేయని పరిస్థితి నుంచి అందరినీ రిక్రూట్ చేస్తూ.. ఈరోజు ఏకంగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్‌లో సిబ్బంది కొరతే లేని పరిస్థితిలోకి తీసుకునిపోయాం. ఏకంగా మొత్తం  2 లక్షల 31 వేలు ఉద్యోగాల భర్తీ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా జరిగింది కేవలం ఈ 59 నెలలకాలంలోనే అని చెప్పడానికి గర్వపడుతున్నాను.

చంద్రబాబు అబద్దాలకు రెక్కలు కడతారు.
ఆలోచన చేయమని అడుగుతున్నాను. గతంలో మీఅందరికీ గుర్తుండి ఉంటుంది. ఎన్నికలు వచ్చేసరికి రంగురంగుల కాగితాలతో మేనిఫెస్టో అని చెబుతారు. ఎన్నికలు వచ్చేసరికే మన ఆశలతో ఆడుకుంటారు, అబద్ధాలకు రెక్కలు కడతారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే రోజులు చూశాం.

కానీ మొట్టమొదటిసారిగా ఆ పరిస్థితులను మార్పించి ఈరోజు ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్‌గా, ఒక మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక మేనిఫెస్టోను ఒక ఖురాన్‌గా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలను మేనిఫెస్టోలో చెప్పినవి నెరవేర్చి మళ్లీ ఆ మేనిఫెస్టో తీసుకునివచ్చి ప్రతి ఇంట్లోనూ ఇచ్చి అక్కా మీరే టిక్ పెట్టండి అని చెప్పి మళ్లీ ప్రజల ఆశీస్సులు కోరుతున్న పాలన ఎప్పుడైనా జరిగిందీ అంటే అది ఈ 59 నెలలకాలంలోనే మీ బిడ్డ హయాంలోనే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

మీ బిడ్డ హయాంలోనే పథకాల విప్లవం.
అందరూ ఆలోచన చేయమని కోరుతూ.. ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను. మీరే ఆలోచన చేయండి ఇవి ఎప్పుడైనా గతంలో ఉన్నాయా? ఎవరైనా చేశారా? ఎవరైనా చూశారా? అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతున్నాను. ఒక్క విద్యారంగంలోనే ఎన్ని విప్లవాలు సృష్టించామో ఒక్కసారి చూడండని అడుగుతున్నాను. పేదపిల్లలు వారి కుటుంబాల కోసం ఎంతగా తపిస్తున్నామో చూడండని తెలియజేస్తున్నా. నాడు-నేడుతో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడనివిధంగా బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్లు, మొట్టమొదటిసారిగా ఈరోజు గవర్నమెంట్ బడుళ్లో ఈరోజు ఇంగ్లీష్ మీడియం, 6వ తరగతి నుంచే మొట్టమొదటిసారిగా ఈరోజు క్లాస్ రూముల్లో డిజిటల్ బోధన, 8వ తరగతి పిల్లాడికి వచ్చేసరికే ఆ పిల్లాడి చేతిలో మొట్టమొదటిసారిగా ఈరోజు ట్యాబ్‌లు కనిపిస్తున్నాయి. ఈరోజు గవర్నమెంట్ బడుల్లో పేద పిల్లలకోసం ఇంగ్లీష్ మీడియం అమలుతో మొదలుపెడితే... 3వ తరగతి నుంచే  టోఫెల్ క్లాసులు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు నుంచి  ఈరోజు ఐబీ దాకా ప్రయాణం కొనసాగుతోంది. పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ కనిపిస్తున్నాయి. బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు, పక్క పేజీ ఇంగ్లీష్ ఈమాదిరిగా మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ కనిపిస్తున్నాయి. బడిలో చేరే సమయానికే పిల్లలకు విద్యాకానుక, బడులల్లో ఈరోజు ఓ గోరుముద్ద, పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ గతంలో ఎప్పుడూ చూడనివిధంగా ఓ అమ్మఒడి అనే ఓ గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతోంది.

పెద్ద చదువులకు సైతం ఊతమిస్తూ..
 పెద్ద చదువులు సైతం.. పెద్ద చదువులు సైతం నా అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఆ పెద్ద చదువులకు సైతం అండగా ఉంటూ ఆ అక్కచెల్లెమ్మల చేతుల్లో ఈరోజు విద్యాదీవెన, వసతిదీవెన అందిస్తున్నాం. నేను అడుగుతున్నా ఇప్పుడు నేను విద్యారంగంలో చెప్పినటువంటివి గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు, ఆలోచన చేయమని కోరుతున్నాడు.  

అక్కచెల్లెమ్మల సాధికారతపై చిత్తశుద్ధితో..
చరిత్రలో ఏ ప్రభుత్వమూ చూపనంతగా నా అక్కచెల్లెమ్మల సాధికారత మీద చిత్తశుద్ధిని చూపించింది కేవలం మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా గర్వంగా చెబుతున్నాను. నా అక్కచెల్లెమ్మల వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడాలని నా అక్కచెల్లెమ్మల కోసం గతంలో ఎప్పుడూ జరగనివిధంగా ఓ ఆసరా, గతంలో ఎప్పుడూ చూడనివిధంగా ఓ సున్నావడ్డీ, గతంలో ఎప్పుడూ జరగనివిధంగా ఓ చేయూత, ఓ కాపునేస్తం, ఓ ఈబీసీనేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట గతంలో ఎప్పుడూ జరగనివిధంగా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు అందులో కడుతున్న 22 లక్షల ఇళ్లు గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. పెద్ద వయస్సులో అవ్వాతాతలు ఇబ్బంది పడకూడదు అని ఆ అవ్వాతాతల కోసం ఆలోచన చేసిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా? అని అడుగుతున్నాను.

మొట్టమొదటిసారిగా ఆ అవ్వాతాతల గురించి ఆలోచన చేసి ఆ అవ్వాతాతల కష్టం గురించి ఆలోచన చేసి.. వారి మీద ప్రేమ చూపిస్తూ నా అవ్వాతాతల ఇంటికే రూ.3 వేల పెన్షన్ కానుక, ఇంటివద్దకే పౌర సేవలు, ఇంటివద్దకే పథకాలు, ఇంటివద్దకే రేషన్ ఇవన్నీ గతంలో జరిగాయా అని మీ బిడ్డ అడుగుతున్నాడు. 

అన్నం పెట్టే రైతన్నలకు ఏ ప్రభుత్వమూ కూడా గతంలో చేయని విధంగా రైతన్నకు పెట్టుబడి సహాయంగా ఓ రైతుభరోసా, రైతన్నలకు ఉచితంగా పంటబీమా, సీజన్ ముగిసేలోగానే రైతన్న చేతిలో ఇన్‌పుట్ సబ్సిడీ, పగటిపూటనే రైతన్నలకు 9 గంటలపాటు ఉచిత విద్యుత్, రైతనన్ను చేయి పట్టుకుని నడిపించే గ్రామస్థాయిలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ.
నేను అడుగుతున్నాను ఇంతలా రైతన్నల గురించి పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతున్నాడు మీబిడ్డ. స్వయం ఉపాధికి చరిత్రలో ఏ ప్రభుత్వమూ కూడా ఎప్పుడూ గతంలో అందించనంతగా తోడుగా ఉంటూ ఓ వాహనమిత్ర, నేతన్నలకు ఓ నేతన్ననేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, ఓ తోడు, ఓ చేదోడుతో చిరువ్యాపారులకు శ్రమజీవులకు అండగా నిలుస్తూ, లాయర్లను కూడా వదిలిపెట్టకుండా లాయర్లకు కూడా లానేస్తం ఇలా స్వయం ఉపాధికి తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా? చూశారా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.

పేదవాడు అప్పులపాలు కాకూడదని...
పేదవాడు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు, వైద్యం కోసం ఆ పేదవాడు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు అని మొట్టమొదటిసారిగా విస్తరించిన రూ.25 లక్షలదాకా ఉచిత ఆరోగ్యశ్రీ, పేదవాడికి ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా చేయి పట్టుకుని నడిపించే ఓ ఆరోగ్యఆసరా, ఈరోజు గ్రామంలోనే కనిపించే ఓ విలేజ్ క్లినిక్, గ్రామానికే ఈరోజు ఓ ఫ్యామిలీ డాక్టర్ కనిపిస్తున్నాడు.  ఇంటికే వచ్చే ఆరోగ్య సురక్ష...ఇంతగా పేదవాడి వైద్యం గురించి ఆలోచిన చేసిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా? అని మీ బిడ్డ అడుతున్నాడు. ఆలోచన చేయమని అడుగుతున్నాడు.

మీ కళ్లెదుట కనిపిస్తున్న విప్లవాలు.
వీటి అన్నింటితోపాటు ఏ గ్రామానికి ఎవరు వెళ్లినా కూడా ఆ గ్రామంలో అక్కడే 600 రకాల సేవలు అందిస్తున్న ఓ గ్రామ సచివాలయం, అదే గ్రామ సచివాలయంలో 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు, ఆ సచివాలయం నుంచి నాలుగు అడుగులు వేస్తే అదే గ్రామంలో అక్కడే ఓ ఆర్బీకే వ్యవస్థ కనిపిస్తుంది.
రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ, మరో నాలుగు అడుగులు అదే గ్రామంలో ముందుకు వెళ్తే ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం అండగా ఉంది అని చెబుతూ,  ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. అదే గ్రామంలోనే మరో నాలుగు అడుగులు ముందుకేస్తే నాడు-నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రతి తల్లికి, ప్రతి పిల్లాడికి వాళ్ల మేనమామే ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పి తెలియజేస్తూ కనిపిస్తుంది.

గ్రామానికే ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో డిజిటల్ లైబ్రరీలు, గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, అక్కచెల్లెమ్మల చేతిలో ఉన్న ఫోన్లోనే ఓ దిశ యాప్.. ఇటువంటివి అనేకం ఇప్పుడు మన కళ్లెదుటే కనిపిస్తున్న విప్లవాలు మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చూశారా అని మీ బిడ్డ అడుగుతున్నాడు.  

ఆలోచన చేయమని కోరుతున్నాను. ఎప్పుడూ జరగని విప్లవాలు. ఎప్పుడూ చూడని విప్లవాలు కేవలం ఈ 59 నెలలకాలంలో మీబిడ్డ చేసి చూపించాడు.

బాబు పేరు చెబితే ఒక్క మంచి స్కీమూ గుర్తుకు రాదు.
మరోవంక 14 ఏళ్లు ముఖ్యమంత్రి అంటాడు చంద్రబాబు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు చంద్రబాబు. ఇన్ని వేలమంది ఇక్కడ ఉన్నారు మీ అందరి సమక్షంలోనే నేను అడుగుతున్నాను. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఇలాంటి చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా? అని మీబిడ్డ అడుగుతున్నాడు. 14 ఏళ్లు ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు. మరి ఈ పెద్దమనిషి చంద్రబాబు పేరుచెబితే ఈ పేదకైనా గానీ గుర్తుకొస్తుందా ఆయన హయాంలో ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా పేదవాడి కోసం చేసింది గుర్తుకొస్తుందా? అని మీబిడ్డ అడుగుతున్నాడు. గుర్తుకొస్తుందా అక్కా? గుర్తుకొస్తుందా అన్నా? చెల్లెమ్మా గుర్తుకొస్తుందా?.


బాబు అధికారం వచ్చేదాకా అబద్దాలు- వచ్చాక మోసాలు. 
అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు.. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో 2014లో ఇచ్చిన ఈ ఫాంప్లెట్ చూశారా. ఇచ్చిన ఈ ఫాంప్లెట్ చూస్తే మీకే అర్థమవుతుంది. (టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ) గుర్తుందా అక్కా ఈ ఫాంప్లెట్? అన్నా గుర్తుందా ఈ ఫాంఫ్లెట్? తమ్ముడూ గుర్తుందా ఈ ఫాంప్లెట్? చెల్లెమ్మా గుర్తుందా ఈ ఫాంప్లెట్? గుర్తుందా అన్నా ఈ ఫాంప్లెట్? గుర్తుందా 2014లో ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ ఈ ఫాంప్లెట్ మీద సంతకం పెట్టి కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫొటోలతో మీ ప్రతి ఇంటికీ ఈ ఫాంప్లెట్ పంపించాడు. ముఖ్యమైన హామీలు అని మీ ప్రతి ఇంటికీ పంపించడమే కాకుండా అప్పట్లో ఈటీవీలోనూ, వాళ్ల టీవీ5లోనూ, వాళ్ల ఏబీఎన్‌లోనూ అడ్వర్టైజ్ మెంట్లతో అప్పట్లో చంద్రబాబు ఊదరగొట్టాడు. 
ఇవాళ నేను అడుగుతున్నాను.. ఈ ముఖ్యమైన హామీలు అంటూ చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికలకుమునుపు మీ ప్రతి ఇంటికీ పంపించిన ఈ ఫాంప్లెట్‌లో.. ఆయన 2014 నుంచి 2019 దాకా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. మరి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇందులో చెప్పినవి ఒక్కటైనా జరిగిందా? అడుగుతున్నాడు మీబిడ్డ. మీరే చెప్పండి ఇందులో జరిగాయా? లేదా? అని అడుగుతున్నాడు. 

చంద్రబాబు విఫల హామీలు.
రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. రూ.87,612 కోట్లు రైతుల రుణాలకు సంబంధించిన మాఫీ జరిగిందా? అని మీబిడ్డ అడుగుతున్నాడు. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు. అక్కా జరిగిందా? అన్నా జరిగిందా? తమ్ముడు జరిగిందా? ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25వేలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు చంద్రబాబు. నేను అడుగుతున్నాను. రూ.25వేలు మాట దేవుడెరుగు.. మీ ఏ ఒక్కరి అకౌంట్లో అయినా ఒక్క రూపాయి అయినా వేశాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. అక్కా వేశాడా? పెద్దమ్మ వేశాడా? చెల్లి వేశాడా అమ్మా? వేశాడా అన్నా? వేశాడా అక్కా? వేశాడా అవ్వా? వేశాడా అన్నా? తమ్ముడు వేశాడా?

ఇంటింటికి ఓ ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగభృతి అన్నాడు. నెల నెలా అన్నాడు. మరి ఐదేళ్లు అంటే 60 నెలలు నెలకు రూ.2వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు ఇచ్చాడా?. తమ్ముడూ ఇచ్చాడా? అన్నా ఇచ్చాడా? .
అర్హులందరికీ మూడు సెంట్ల స్ధలం. కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. నేను అడుగుతున్నా.. 3 సెంట్ల కథ దేవుడెరుగు ఏ ఒక్కరికైనా ఒక్క సెంటు అయినా ఇచ్చాడా ? అని మీబిడ్డ అడుగుతున్నాడు. ఇచ్చాడా అక్కా? ఇచ్చాడా అన్నా? ఇచ్చాడా తమ్ముడూ?
రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు, జరిగిందా? విమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు జరిగిందా? సింగపూర్ కి మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీని నిర్మిస్తానన్నాడు, జరిగిందా? మాచర్లలో ఏమైనా కనిపిస్తుందా?. అని  నేను అడుగుతున్నాను. 2014లో ముఖ్యమైన హామీలంటూ మీ ప్రతి ఇంటికి చంద్రబాబు స్వయానా సంతకం పెట్టి పంపించాడు. ఇదే ఫాంప్లెట్, ఇందులో చెప్పినవి ఆయన సంతకం పెట్టి స్వయంగా 2014లో మీ ఇంటికి పంపించి 2014 నుంచి 2019 దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేసిన తర్వాత ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా? అని మీబిడ్డ అడుగుతున్నాడు. ఒక్కటన్నా జరిగిందా? మరి ఇలాంటి వాళ్లను నమ్ముతారా?

బాబు కొత్త మేనిఫెస్టో.. కొత్త మోసాలు.
ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చాడా? అదీ అమ్మేశాడు. మరి నేను అడుగుతున్నాను. మళ్లీ ఇప్పుడు ఇదే ముగ్గరు, ఇదే చంద్రబాబు ఏమంటున్నాడు? మళ్లీ కొత్త మేనిఫెస్టో అంట, మళ్లీ కొత్త మోసాలు అంట.. ఏమంటున్నాడు సూపర్ సిక్స్ అంట నమ్ముతారా? సూపర్ సెవెన్ అంట నమ్ముతారా?. ఇంటింటికీ కేజీ బంగారమట నమ్ముతారా? ఇంటింటికీ బెంజి కార్ కొనిస్తారట నమ్ముతారా? నమ్ముతారా అక్కా? నమ్ముతారా అన్నా? నమ్ముతారా తమ్ముడు? నమ్ముతారా అన్నా? అక్కా నమ్ముతారా? ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇలాంటి అబద్దాలు, ఇలాంటి మోసాలతో, ఇలాంటి వ్యక్తులతో యుద్ధం చేస్తున్నాం.    

లంచాలు, వివక్ష లేని పాలన కావాలంటే ఫ్యానుకే ఓటు.
అందుకే నేను మళ్లీ చెబుతున్నాను. వాలంటీర్లు మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలాన్నా ? పథకాలన్నీ కొనసాగాలన్నా? లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా ? మన పిల్లలు, వారి చదువులు, బడులు బాగుపడాలన్నా? మన హాస్పిటళ్లు, మన వ్యవసాయం మెరుగుపడాలన్నా ? ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. 175 కి 175 ఎమ్మెల్యేలు, 25 కి 25 ఎంపీ స్ధానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.

మన గుర్తు ఇక్కడో, అక్కడో, ఎక్కడో ఎవరికైనా తెలియని వాళ్లున్నా, మర్చిపోయిన వాళ్లు ఎవరైనా ఉన్నా మన గుర్తు అన్నా, మన గుర్తు తమ్ముడూ, మన గుర్తు అక్కా, మన గుర్తు అన్నా, మన గుర్తు తమ్ముడూ, పెద్దమ్మ మన గుర్తు, ఆకుపచ్చ చీర కట్టుకుని కళ్లజోడు పెట్టుకున్న పెద్దమ్మా మన గుర్తు ఫ్యాను. ఇక్కడ అక్కా ఎక్క చీర కట్టుకున్న అక్క మన గుర్తు ఫ్యాను, పసుపు చీర కట్టుకున్న అక్కా మన గుర్తు ఫ్యాను, ఇక్కడ అన్నా మన గుర్తు, అక్కా మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడుండాలి. ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయడే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్, సింక్ లోనే ఉండాలి. ఈ విషయాలన్నీ ప్రతిఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతూ.. మన పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్ధులపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచాల్సిందిగా సవినయంగా రెండు చేతులు జోడించి  పేరుపేరునా ప్రార్థిస్తున్నాను.  

ఇంత ఎండలో కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చెరగని చిరునవ్వులతోనే ఇంతటి ఆప్యాయతలు పంచిపెడుతున్న నా ప్రతి అక్కకూ, నా ప్రతి చెల్లెమ్మకూ, నా ప్రతి అవ్వకూ, నా ప్రతి తాతకూ, నా ప్రతి సోదరుడికీ, నా ప్రతి స్నేహితుడికీ మీ జగన్, మీ బిడ్డ రెండు చేతులు జోడించి మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాడు అని ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు.

Back to Top