ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై త‌ప్పుడు ప్ర‌చారం 

టీడీపీ, ఎల్లోమీడియాపై వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు

అమ‌రావ‌తి:     ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధంచి ప్రజలను తప్పుదోవ పట్టించేవిధంగా వివిధ దినపత్రికలలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రకటనలపై ఎన్నికల కమీషన్ కు వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు చేసింది. వైయ‌స్ఆర్‌సీపీ  గ్రీవెన్స్ సైల్ ఛైర్మన్ నారాయణమూర్తి, లీగల్ సెల్ నేత శ్రీనివాసరెడ్డిలు ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదుతో పాటు ఆధారాలను అందచేశారు.

    గతంలో కూడా తెలుగుదేేశం పార్టీ  ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజలను  భయాంధోళనలకు గురిచేస్తూ ఐవిఆర్ ఎస్ కాల్స్ ద్వారా ప్రజలకు తప్పుడు సమాచారం అందిస్తున్న విషయంపై, చంద్రబాబు,లోకేష్ ఇదే యాక్ట్ కు సంబంధించి చేసిన దుష్ప్రచారం పై ఈసికి ఫిర్యాదు చేశారు.దానిపై మీరు సిఐడి విచారణకు ఆదేశాలు ఇచ్చారు. అది దర్యాప్తు దశలో ఉండగానే తిరిగి ఈరోజు వార్తాపత్రికలలో పెద్దఎత్తున ప్రకటనలు ఇచ్చారు.వాటికి సంబంధించి కనీసం ఈసి అనుమతులు ఉన్నట్లు ఆ ప్రకటనలలో ఎక్కడా పేర్కొనలేదు.   కావున ఎన్నికల కమీషన్ తక్షణమే స్పందించి తెలుగుదేశం పార్టీపైన, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై తగిన చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు విజ్ఞప్తి చేశారు.

Back to Top