ప‌వ‌న్‌..పార్ట్ టైమ్ పొలిటీషియన్..ఫుల్ టైమ్ సినిమాలు 

వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు  

తాడేప‌ల్లి:  టిడిపి కూటమి గెలిచే అవకాశం  లేదనే ప్రస్టేషన్ కు గురై చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మండిప‌డ్డారు. ప్రజాకోర్టులో వీళ్ళు మాట్లాడే ప్రతి మాటకు మూల్యం చెల్లించుకోక తప్పద‌ని హెచ్చ‌రించారు.

రావెల కిషోర్‌బాబు మీడియాతో ఏమ‌న్నారంటే..

  •  పవన్ కల్యాణ్ జగన్ కు పొలిటికల్ హాలిడే ఇచ్చేద్దామంటూ అర్దం పర్దం లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారు.
  • ఎన్నికల తర్వాత పవన్ పొలిటికల్ హాలిడే తీసుకుంటాడు.మరి విదేశాలకు విహారయాత్రలకు వెళ్తాడో,సినిమాలకు కేటాయిస్తాడో చూడాలి.
  • పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడు.ఆయనో పార్ట్ టైమ్ పొలిటీషియన్.పూర్తి టైమ్ సినిమాలు.
  • రాజకీయవేత్త అంటే ప్రజాక్షేమం కోసం పాటుపడేవాడు.పవన్ ను ఎప్పుడూ అలా కనిపించడు. చూస్తే అలా వచ్చి ఇలా వెళ్లి సినిమాలు చూసుకుంటాడు.
  • సినిమాలలో నటన పనిచేస్తుంది కాని రాజకీయాలలో నీ నటన పనిచేయదు.
  • ఎంతో మంది అప్ కమింగ్ రాజకీయనేతల జీవితాలను పవన్ కల్యాణ్  నాశనం చేశారు.
  • పేద బడుగు వర్గాలకు అండగా నిలబడేందుకు నిరంతరం పాటుపడే వ్యక్తి జగన్.
  • ల్యాండ్ టైటిలింగ్ చట్టం విషయంలో పచ్చమీడియా విషప్రచారం చేస్తోంది.
  • ప్రజలలో అపోహలు సృష్టిస్తోంది. అసలు లేని చట్టాన్ని గురించి ప్రజలలో అయోమయం కలిగిస్తున్నారు.
  •  ఇది కేంద్రంలో ఉన్న బిజేపి ప్రభుత్వం ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది.
  • చట్టంలో ఉన్న లోపాలను సరిచేసి భూఅసలైన హక్కుదారుల హక్కులను కాపాడటం దీని ఉద్దేశ్యం.
  • పచ్చమీడియా దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మేస్దితిలో లేరు.
  • అబద్దాన్ని పదే పదే చెప్పి నిజం అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.అయినా ప్రజలు ఎవరూ కూడా దీనిని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు
     
Back to Top