ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి ఆస్తి ఎవరు లాక్కోగలరు? 

 రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంపై చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లకు ఏం తెలుసు?

మా భూమి మాది కాకపోతే మరెవరిది, రామోజీ..?!

అన్నం తినేవాళ్ళు ఎవరూ ఇలాంటి మాటలు మాట్లాడరు, రాయరు

ఎన్నికల్లో లబ్ధిపొందడం కోసమే, ఇలాంటి తప్పుడు కూతలు-రాతలు.

భూవివాదాల్లో, దళారులు, లిటిగెంట్లకు ఆస్కారం లేకుండా ఉండేందుకే ఈ చట్టం

ప్రస్తుతం ఈ చట్టం కోర్టు పరిధిలో ఉంది... రాష్ట్రంలో అమల్లో లేదు.  

వక్రబుద్ధి, క్రిమినల్‌ మైండ్‌తో ఉన్నవారే, ఈ చట్టాన్ని వెపన్‌గా వాడుకుంటున్నారు.! 

ఎన్నికల తర్వాత ఈ దుష్ప్రచారం చేసే కూటమి నేతలెవరూ ప్రజలకు కనిపించరు!

మంత్రి బొత్స సత్యనారాయణ

విశాఖ‌: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి ఆస్తి ఎవరు లాక్కోగలర‌ని  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్ర‌తిప‌క్షాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్స్‌పై త‌ప్పుడుప్ర‌చారం చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. శ‌నివారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ మీడియాతో  మాట్లాడారు.

మా భూమి మాది కాకపోతే మరెవరిది, రామోజీ..?:
– ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు,  పచ్చ మీడియాకు ఎందుకు కడుపు మంటో అర్ధం కావడం లేదు.
– ఏకంగా మీ భూమి మీది కాదు అంటూ రాతలు రాస్తున్నారు. అసలేంటీ రాతలు? నా భూమి నాది కాకపోతే మరెవరది? 
– మరొక పేపర్లో, నేల చట్టంలో..నింగీ..గాలి అంటూ రాతలు రాశాడు.
– ఈ రాతలు పోలింగ్‌ జరిగే వరకే. ఆ మర్నాడు వాళ్లు ఈ వార్తలు రాస్తే అడగండి. అప్పుడు వీళ్లకు, సామాజిక బాధ్యత ఏమీ ఉండదు. 
– ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఏదో ఒక విధంగా ప్రజలను మభ్యపెట్టి తమ ఫ్రెండ్స్‌గా ఉన్న కూటమికి లాభం చేకూర్చాలనే.
– ప్రజలేమన్నా అమాయకులనుకుంటున్నారా? మీ మాట ఎవరు నమ్ముతారు? 
– మీరు చేసే ప్రచారం, వాస్తవాలకు ఇంత దూరంగా ఉంటే, ఇక ప్రజలు నమ్ముతారనుకోవడం మీ భ్రమే.
– ఏ కోణంలో మీ భూమి మీది కాదో వాళ్లు సమాధానం చెప్పాలి.
– మీ అనుమానాలేంటి అడగండి.. నేను సమాధానం చెప్తాను. ప్రజలకు కూడా మీ రాతలపై క్లారిటీ కావాలి కదా?
– మీరు చేస్తున్న మాయ, మోసం, మీ కడుపు మంట ప్రజలకు తెలియాలి. 
– రామోజీరావు, రాధాకృష్ణల బాధ కూడా ప్రజలకు తెలియాలి కదా? అడగండి..నేను సమాధానం చెప్తా.

దళారులు, లిటిగెంట్లకు ఆస్కారం లేకుండా పూర్తి హక్కులు కల్పించే చట్టం:
– ప్రభుత్వం ఒక బాధ్యత గలది. ఏదైతే లోపభూయిష్టమైన విధానాలున్నాయో వాటి ద్వారా ప్రజలు నష్టపోకూడదని, సామాన్యుడికి మేలు జరగాలని ఆలోచిస్తుంది.
– అవినీతికి తావులేకుండా, దళారులు, లిటిగెంట్లకు ఎక్కడా అవకాశం లేకుండా ఉండాలని మేం ఈ చట్టం తెస్తున్నాం.
– ఈ వ్యవస్థలో మార్పులు చేర్పులు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. 
– అందులో భాగంగానే ఇది జరుగుతోంది. ప్రస్తుతం కోర్టుల్లో ఉంది. పబ్లిక్‌ హియరింగ్‌ రావాలి. అప్పుడు కానీ చట్టంగా మారదు.
– ఈ లోపు మీటింగులు పెట్టి..., ఒకరు జోగిపోయి.., ఒకరు ఊగిపోయి మాట్లాడుతున్నారు.
– ఏకంగా ఈనాడు వారైతే మీ భూమే మీది కాదని రాసేస్తారు. ఏం ఖర్మ వచ్చింది వీళ్లకు?
– మళ్లీ మళ్లీ రాష్ట్ర ప్రజలకు చెప్తున్నాం. పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున చెప్తున్నాం. ఏదైతే దళారులు, అవినీతిపరులు, లిటిగెంట్లు చేసే దగాను అరికట్టడానికే ఈ విధానం.
– భారతదేశం యావత్తు దీనిలో లోపాలను సవరించి చట్టాలను తేవాలని నిర్ణయించింది.
– అందులో భాగంగా మా ప్రభుత్వం కూడా దానిలో ఉన్న అన్నిటినీ అధ్యయనం చేస్తోంది.
– దానికింకా బోలెడంత ప్రాసెస్‌ ఉంది. పబ్లిక్‌ హియరింగ్, సర్వే పూర్తి కాకుండా చట్టంగా మారదు.
– ఏ గ్రామమైతే పబ్లిక్‌ హియరింగ్, సర్వే పూరైన గ్రామాలే ఈ చట్ట పరిధిలోకి వస్తాయి.
– ప్రస్తుతం అయితే అది కూడా కోర్టులో ఉంది.

*పవన్‌ కల్యాణ్‌ పెద్ద మేధావా?: *
– పవన్‌ కల్యాణ్‌కు ఏం తెలుసని మాట్లాడుతున్నాడు..? ఆయనేమన్నా పెద్ద మేధావా? 
– ఎవడైనా రిజిస్ట్రేషన్లలో జిరాక్స్‌ కాపీలు ఇస్తారా? అన్నం తినే వాడు మాట్లాడే మాటలేనా అవి?
– జిరాక్స్‌ కాపీలు ఇస్తే ప్రజలు అమాయకులనుకుంటున్నారా? ఒప్పుకుంటారా? 
– ప్రభుత్వం తరఫున జిరాక్స్‌ కాపీలు ఇస్తున్నారని ప్రచారం చేయడం, తప్పు అని చాలా సార్లు చెప్పాను.
– పవన్‌ కల్యాణ్‌ మాటలకు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావడం లేదు.
– ఆయనొక రాజకీయ నాయకుడు..ఆయన ఆరోపణలకు మా ఖర్మకి మేం సమాధానం చెప్పాలా? 
– తెలిసీ తెలియని అంశాలను ఏవరో రాసిస్తే ఊగిపోయి చదివేస్తే సరిపోతుందా?
– ఆయన భాష కూడా మారింది. రాజకీయాల్లో ఉన్నవాళ్లు అలాంటి భాష ఎవరైనా మాట్లాడాతారా?
– ఏమీ తెలియని పవన్‌ కల్యాణ్‌ మాట్లాడితే మనందరం వినాలా?
– అతని భాషను ప్రజాస్వామ్యంలో ఎవరైనా అంగీకరిస్తారా?
– ఇప్పుడు ఆ యాక్ట్‌ ఫోర్స్‌లో లేదు. 
– అసలు ఒక్క సీటు కూడా లేని పవన్‌ కల్యాణ్‌ ప్రతిపక్షం ఏంటి?
– ఆయనకొచ్చిన ఒక్క సీటు వ్యక్తి కూడా నీదగ్గర ఉండనని వెళ్లిపోయాడు.
– ఈనాడు, ఆంధ్రజ్యోతి వారికి ఎంత ఉక్రోషం ఉందో వారి రాతలను బట్టి అర్ధం అవుతుంది.
– మేం కాల్చిన గుడ్డ మీ నెత్తిన వేశాం..మీ చెప్పాల్సింది చెప్పుకోండి అన్నట్లుంది వారి వ్యవహారం.
– ఏదో ఒక తప్పుడు రాతలు రాసేస్తాం..ఆ తర్వాత మేం దాని గురించి ప్రశ్నించం అని అనుకుంటున్నారు. 
– ప్రజలారా మీరే ఆ పత్రికల తీరును ఆలోచన చేయండి. మీరే డిసైడ్‌ చేయండి.
– ఆ పత్రికల ద్వంద వైఖరి, బుద్ధిని గమనించండి.

వక్రబుద్ధి, క్రిమినల్‌ మైండ్‌తో ప్రతిపక్షాలు:
– ఏ గ్రామమైతే సర్వే పూర్తి చేసుకుంటుందో ఆ గ్రామమే దీని పరిధిలోకి వస్తుంది.
– తర్వాత ఏదైనా అభ్యంతరాలుంటే జిల్లా జడ్జి స్థాయిలో అప్పిలేట్‌ అథారిటీ దృష్టికి తీసుకురావచ్చు.
– కోర్టుకు కూడా ఎప్పుడైనా వెళ్లొచ్చు. దానికేమీ ఇబ్బంది లేదు.
– ప్రత్యర్థులు వారి వక్రబుద్ధి, క్రిమినల్‌ మైండ్‌తో దీన్ని వెపన్‌గా వాడుకోవాలని చూస్తున్నారు. 
– క్రిమినల్‌ మైండ్‌ ఉన్నవాళ్లు కాబట్టే, ఇలాంటి సున్నితమైన సమస్యపై అపోహలు సృష్టిస్తున్నారు.
– జగన్‌ గారి ఫోటోను పట్టాదారు పాసుపుస్తకంపై వేశారంటున్నారు. మరి ఎన్టీఆర్‌ బొమ్మను మరుగుదొడ్లపై వేశారు కదా. దానికేం చెప్తారు?

రిజిస్ట్రేషన్ పేపర్లు ఎవరి ఇంట్లో వారివి ఉంటాయి, సందేహం ఎందుకు?
– బొమ్మ ఉంటే మాకు వచ్చేట్లయితే, ఎన్టీఆర్‌ బొమ్మ ఉన్న మరుగుదొడ్డి వాళ్లకు వెళ్లిపోతుందా?
– అసలు మీ ఇంట్లో కాగితాలు..మా ఇంట్లో ఎవరు పెట్టుకుంటారు?
– రిజిస్ట్రేషన్‌ కాగితం నీ ఇంట్లో ఉంటుంది కానీ..మరెవరింట్లోనే ఎందుకుంటుంది? 
– ఎవరో ఏదో చెప్తేస్తే, కడుపులో మంట ఉన్న వాళ్లు రాతలు రాస్తుంటే వాటిని నమ్మాల్సిన అవసరం లేదు.
– రాజకీయ కోణంలో, క్రిమినల్‌ మైండ్‌తో, దుర్భిద్ధితో చేస్తున్న దుష్ప్రచారం ఇది.
– వీళ్లు రాసే రాతలు, చేసే ప్రచారం తప్పు అని చెప్పే బాధ్యత మాపై ఉంది.
– దీనిలో జిల్లా అప్పిలేట్‌ విచారించిన తర్వాత కింది కోర్టుల పరిధి ఉండదు. అందుకు కొంతమంది న్యాయవాదులు ఆందోళన చెందుతున్నారు.
– కేవలం లిటిగేషన్‌ తగ్గించడానికే కింది కోర్టుల పరిధి తీసేశాం.
– ఒక జిల్లా జడ్జి స్థాయి అధికారి నిర్ణయం తీసుకున్నాక మళ్లీ కింది కోర్టులకు ఎలా వెళ్తాం?
– సామాన్య ప్రజలు కోర్టులు చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం.
– ఎప్పుడో బ్రిటీష్‌ కాలంలో సర్వే జరగబట్టి రికార్డులు సరిగ్గా లేక కోర్టు వివిధాలు, లిటిగేషన్లు వస్తున్నాయి. 
– ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా దశల వారీగా ప్రతి గ్రామాన్ని సర్వే చేస్తోంది.
– మొదటి దశ అయిపోయింది. రెండో దశ కొనసాగుతోంది. తర్వాత అర్బన్‌లో కూడా సర్వే చేస్తాం. 

దేశంలో 73 శాతం భూ వివాద కేసులే...:
– కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ 68 నుంచి 73 శాతం కేసులు భూవివాదాలే.
– సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఈ చట్టం రైతు ప్రయోజనాల కోసమే తెచ్చానని చాలా సార్లు చెప్పారు.
–  తొలుత గ్రామాల్లో భూసేకరణ జరగాలి. ఆ సందర్భంలో ఏదైనా వివాదాలు వస్తే కింది స్థాయి ఎమ్మార్వో ఆఫీసులో ఇద్దరినీ కూర్చోబెట్టి పరిష్కరిస్తారు.
– ఒక వేళ అక్కడ ఇద్దరూ ఒప్పుకోకపోతే ఆ భూమి హక్కులు ఎవరికీ ఇవ్వరు.
– ఆ తర్వాత జిల్లా జడ్జి స్థాయిలో సమస్య పరిష్కారానికి వెళ్లొచ్చు.
– ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లొచ్చు. అప్పీలింగ్‌ అథారిటీ రెండేళ్ల వరకూ ఉంటుంది. 
– ఈ రకంగా రాతలు రాయడం అనేది చాలా పెద్ద క్రైం. 
– ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ ఇదో పెద్ద క్రైం.
– ఈ ప్రజాస్వామ్యంలో ఎవడి ఆస్తి ఎవడు తీసుకుంటాడు? 

వాళ్ళ మేనిఫెస్టో ఒక చిత్తు కాగితంతో సమానం:
– కూటమిలో ముగ్గురున్నారు. ఒకరు కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్లు. ఒకరు రాష్ట్రంలో అధికారం చేసినవాళ్లు..మరొకరు ఎక్కడా ఏదీ లేని వాళ్లు.
– వాళ్లలో ఒకరు ఒప్పుకోకుండా, ఇద్దరు ఒప్పుకుంటే ఇక ప్రజలకు క్లారిటీ ఏముంటుంది? 
– వాళ్ళ మేనిఫెస్టో ఒక చిత్తు కాగితంతో సమానం. దానిలో పెట్టిన వాటి గురించి ఎందుకు ఆలోచించాలి?
– వాళ్లకున్న అత్మాభిమానం ఏంటి? మాకున్న అహంకారం ఏంటో చెప్పండి.
– 8 సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచామని అనడం చాలా తప్పు. చంద్రబాబు చేసిన నిర్వాకం వల్ల ఒక సారి ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఏర్పడింది.
– ఎన్నికలు అయిన తర్వాత పాత్రికేయులకు చెప్పిన విధంగా వారికి స్థలాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా.

Back to Top