కొల్లు రవీంద్ర సిగ్గు శ‌రం లేకుండా అబద్ధాలు చెబుతాడు

 టీడీపీ నేత కొల్లు రవీంద్రపై పేర్ని నాని ఫైర్

మ‌చిలీప‌ట్నం:  టీడీపీ నేత కొల్లు ర‌వీంద్ర‌పై వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పేర్నినాని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కొల్లు ర‌వీంద్ర సిగ్గు శ‌రం లేకుండా అబ‌ద్దాలు చెబుతాడ‌ని నాని విమ‌ర్శించారు. గురువారం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు.

పేర్ని నాని ఏమ‌న్నారంటే..

  • కొల్లు రవీంద్ర శవాల మీద పేలాలు ఏరుకునే రకం
  • నిజాన్ని దాచిపెట్టి అబద్ధాలు మాట్లాడుతున్నాడు 
  • తాను చేయని పనులను కూడా చేశామని చెప్పుకోవడం సిగ్గులేనితనానికి నిదర్శనం
  • ప్రస్తుతం ఎన్నికల కోడ్‌లో ఉన్నాం 
  • అధికారులతో సమీక్షలు చేసి మాట్లాడి తాగునీటి సమస్యను పరిష్కరించే అవకాశం లేదు
  • కృష్ణా నదిలో , శ్రీశైలం ప్రాజెక్ట్‌లో నీరులేకపోవడం, పులిచింతల నుండి నీటిని వాడుకుంటున్నాం
  • ప్రస్తుతం 4.5 టీఎంసీ తాగు నీటిని కృష్ణ, గుంటూరు, ప్రకాశం వాడుకోవాలి
  • సెప్టెంబర్, ఆగస్టు ప్రాంతాలలో గోదావరి, కృష్ణా నదులలో వరద వచ్చే అవకాశం ఉంది
  • అప్పటివరకు ఈ 4.5 టీఎంసీ నీటినే జాగ్రత్తగా వాడుకోవాలి
  • గతంలో ఎప్పుడూ ఇలా ఇబ్బంది రాలేదు
  • తరకటూరు , పంపుల చెరువు లోతు 12 అడుగులు.... 5.2 మీటర్లు స్టోరేజ్ ను పెడతారు
  • నీరిచ్చిన ప్రతి రోజూ 100 గ్రామాలకు గాను 7 సెంటి మీటర్లు లోతు నీటి సాంద్రత తగ్గుతుంది
  • పొలిటికల్ నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు
  • అధికారులు ఎవ్వరూ ఇప్పటి వరకు వేసవిలో నీరు ఇస్తామని చెప్పే పరిస్థితి లేదు
  • ముందు చూపు లేనిది ఎవరికి.. కొల్లు రవీంద్ర ఏమైనా పనొడా 
  • కొల్లు రవీంద్రకు ఛాలెంజ్ చేస్తున్నా 
  • ప్రస్తుతం 9 అడుగుల నీరు నిల్వ వుంది చూసుకో
  • టీడీపీ సమయంలో రోజూ నీరిచ్చామని దగాకోరు మాటలు మాట్లాడుతున్నాడు
  • 2018 లో మురికి నీరుకు జనం అల్లాడిపోయారు
  • కొల్లు రవీంద్రా...అప్పుడు మేము ధర్నా చేశాం
  • అప్పుడు తమరు పచ్చరంగు నీరు సప్లై చేస్తున్నందుకు ధ్వజమెత్తిన పేర్ని అంటూ విలేకరులు మీ సొంత పత్రికలలో రాశారు
  • కొల్లు రవీంద్ర ముందు చూపు గురించి మాకు తెలియదా
  • పేర్ని నాని వచ్చిన తరవాత ఎవరైనా బోర్లు వేశారా ... నీటి కోసం ఇబ్బంది పడ్డారా
  • కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడు 
Back to Top