అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు

వైయ‌స్ఆర్‌సీపీ నేత,  ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి

సీఎం వైయ‌స్ జగన్‌తో పాటు ఆర్జీవీని చంపాలని యత్నించారు

కాపు నాయకుడు వంగవీటి రంగాని చంద్రబాబు చంపించాడు

రోజురోజుకి పవన్ కల్యాణ్ దిగజారి మాట్లాడుతున్నారు

చిరంజీవి, పవన్ వలన కాపులందరూ ఇబ్బందులు పడ్డారు

చిరంజీవి దెబ్బతో కాపులు ఆస్తులు కోల్పోయి రోడ్డున పడ్డారు

  హైదరాబాద్ : అధికారం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతకైనా తెగిస్తారని, అలాంటి వ్యక్తి ఈ సమాజానికి ప్రమాదకారి అని వైయ‌స్ఆర్‌సీపీ నేత,  ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకి తెలియకుండా ఏపీలో హత్యలు జరగవంటూ సంచలన ఆరోపణలు చేశారు. మెగా బ్రదర్స్‌ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌పైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం పోసాని కృష్ణ‌మోహ‌న్‌ మీడియాతో మాట్లాడారు.

 

మీ అమ్మను తిడితే లోకేశ్‌ చొక్కా పట్టుకున్నావా..?:

– నిన్న పవన్‌ కల్యాణ్‌ గారికి చాలా కోసం వచ్చింది.. బాధ వచ్చింది. 

– ఆయన భార్యలని పెళ్లాలు అని అంటున్నారట.. పెళ్లాన్ని పెళ్లాం అనడానికి వీళ్లేదట. 

– పవన్‌ కల్యాణ్‌..! పెళ్ళాం.. అని ఎందుకు అనకూడదు? అనొచ్చు. పోసాని పెళ్లాం అనొచ్చు..చిరంజీవి పెళ్లాం..చంద్రబాబు పెళ్లాం, లోకేశ్‌ పెళ్లాం అని అనొచ్చు. 

– నువ్వు పెళ్లాం అన్నందుకే ఇంత ఉక్రోషం, కోపాన్ని వ్యక్తం చేశావు. మరి మీ అమ్మగారిని నీ పక్కనే ఉన్న లోకేశ్‌ అమ్మనాబూతులు తిడితే ఏం చేశావ్‌? 

– కనీసం నారా లోకేశ్‌ను చొక్కా పట్టుకున్నావా?

– ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మా అమ్మని అమ్మనాబూతులు తిట్టించాడని పవన్‌ కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ మొత్తం చెప్పాడు. 

– మరి నారా లోకేశ్‌ను ఎందుకు ఏం మాట్లాడలేదు? మరి నారా లోకేశ్‌ను ఏమైనా అనే దమ్ముందా? 

– వాళ్ల అమ్మగారిని ముఖం చూసే దమ్ముందా నీకు? ఆమె పేరు ఎత్తాలంటేనే భయపడిపోతావెందుకు? 

– ముఖ్యమంత్రి గారు అంత చీప్ అయిపోయా? పెళ్లాం అనే పదం ఆంధ్రదేశంలో 75 శాతానికి పైగా వాడతారు. 

– పెళ్లాం అంటే ఆక్షేపణీయమా? జగన్ గారిని తిట్టాలంటే ఏదో కారణం వెతుక్కోవడం తప్ప.

– నిన్ను అవమానించడానికి సీఎం గారు నీలా అంత దిగజారి లేరు.

 

*నీకు నాలుగో పెళ్లాం లేదా? అయిదో పెళ్లాం కూడా వెయిటింగ్‌ లిస్ట్‌:*

– జగన్‌ గారు ఏమన్నారు, నీకు నలుగురు పెళ్లాలు అన్నాడు. 

– నీకు ముగ్గురు పెళ్లాలేనా? నాలుగో పెళ్లాం లేదా? అయిదో పెళ్ళాం కూడా వెయిటింగ్‌ లిస్టులో ఉంది కదా.. 

– నీకు, నీ నీఘా వర్గాలు చెప్తుంటాయి కదా..అలానే నాకూ సినిమా ఇండస్ట్రీలో నిఘా వర్గాలు చెప్పాయి. 

– పంజాబ్‌ అమ్మాయి..మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి.. మొదట లవ్‌ అన్నావు. ఆ తర్వాత వాడుకుని వదిలేశావు. కడుపు చేశావు.  దీన్ని ఏమంటారు..పెళ్లాం అంటారా లేదా గొళ్లెం అంటారా? 

– ఏపీలో వాలంటీర్లలో ఆడపడుచులు వేలాది మంది ఉన్నారు. అందులో అన్ని కులాలు, మతాలున్నారు.

– వీళ్లు, ఇంటింటికీ వచ్చి పింఛన్లిస్తూ దేవతల్లా పనిచేస్తుంటే వాళ్లు వ్యభిచారం, ట్రాఫికింగ్‌ చేస్తున్నారు అని ఎందుకు వెధవ పలుకులు పలికావు? 

– అది వారి వ్యక్తిగతం కాదా? పెళ్లాం అంటేనే సీఎం లెవెల్‌కి వెళ్లావే..ఇంత మంది ఆడపడచులను ఎంత చీప్ గా మాట్లాడావు?

– నువ్వు మాట్లాడింది చీపా లేక పెళ్లాం అంటే చీపా? 

– ప్యాకేజీ పుచ్చుకుని ఎంత వీలైతే అంత బాగా తిట్టేసేయ్‌ అని బాబు నీకు ఆదేశాలు ఇచ్చాడా? 

 

*చంద్రబాబు గారూ.. దయచేసి జగన్‌ గారి హత్యకు కుట్రలు పన్నకండి:*

– ఒక మంచి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్‌కి దొరికాడు. 

– చంద్రబాబు నాయుడు గారూ.. మీరు పదవి లేకుండా ఉండలేరని నాకు తెలుసు. 

– దయచేసి జగన్‌మోహన్‌రెడ్డి గారిని చంపకండి. ఆయన హత్యకు కుట్రలు పన్నకండి. ఇది, చంద్రబాబుకు నా రిక్వెస్ట్‌. 

– నువ్వు చంపుతావని, హత్యా రాజకీయాలు చేస్తావని, ఇప్పటికీ నా సిక్త్‌ సెన్స్‌ హెచ్చరిస్తోంది. బాబుకు మనిషిని చంపడమంటే గడ్డిపూచతో సమానం.

– రాంగోపాల్‌వర్మను మర్డర్‌ చేయడానికి ప్లాన్‌ చేశారు. ఈ విషయం, ఇప్పటివరకూ నేను రాంగోపాల్‌ వర్మకు కూడా చెప్పలేదు. 

– చంద్రబాబు గారు దీనిలో మీరున్నా మీ పేరు నేను చెప్పను. 

– ఒక మంచి ముఖ్యమంత్రికి మద్దతుగా మాట్లాడితే చంపేస్తారా? 

– వర్మను మర్డర్‌ చేయడానికి ముందు ప్లాన్‌ చేసుకుని ఆ తర్వాత ఆగారు. 

– ప్రముఖ జర్నలిస్టు ఐ.వెంకట్రావు కుమారుడు అనిల్‌ దీనిలో ముఖ్యుడు.

– నా తల్లి సాక్షిగా చెప్తున్నా..నీ పేరే చెప్పారు. మన కమ్మ వాళ్లే చెప్పారు. 

– అనిల్‌ ప్లాన్‌ చేస్తే.. రాజేశ్‌ కిలారుకు చెప్పాడు. దీనికి,నారా లోకేశ్‌ కూడా ఒకే అన్నాడు. 

– చంద్రబాబు వద్దకు వచ్చాక, దానికి నో అన్నాడు. అతను పిచ్చోడు.. అతన్ని చంపితే మనకొచ్చేదేముంది..వదిలేయండి అన్నాడు. 

– చంద్రబాబూ...! ఎప్పుడూ ఎవ్వరినీ చంపకు. అతని తీరు చూస్తే నాకూ భయమేస్తోంది. 

– రాంగోపాల్‌ వర్మ స్థానంలో నేను కావచ్చు. అయినా నేను లెక్కచేయను. 

– మీరు ఓడిపోతే మనిషికి లక్ష రూపాయలు ఇచ్చి మళ్లీ గెలవండి. 

– అంతేకానీ..ప్రజల మనిషి జగన్‌మోహన్‌రెడ్డి గారిని మాత్రం చంపకండి.

– నేను తల్లి సాక్షిగా చెప్తున్నా.. నన్ను చంపినా నేను బాధపడను. 

– కానీ జగన్‌ గారిని చంపొద్దు..ఈయన్ని మీరు చంపారంటే ఐదు కోట్ల మందిని చంపినట్టే...

– ఎందుకంటే, వాళ్ల జీవితాలు, భవిష్యత్తు నాశనం అవుతుంది. 

– రాంగోపాల్‌ వర్మను చంపకుండా వదిలేసినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు.

– అదే సమయంలో ముఖ్యమంత్రి గారిపై ఎటాక్‌ జరిగింది. 

– ఒక ముఖ్యమంత్రి గారిపైనే హత్యాయత్నం చేశారంటే ఇక ఆర్జీవీ, నాలాంటి వాళ్లెంత? 

– పెళ్లాం అన్నందుకే అతను అలా స్పందిస్తున్నాడంటే ఇంకేం చేస్తారో? 

– జగన్‌గారి పట్ల దేవుడున్నాడు కాబట్టి బతికాడు కానీ.. కంటికో, కణతకో తగిలినా స్పాట్‌ డెడ్‌ అయ్యేవారు. 

– మీ మనవడు దేవాన్ష్‌ సాక్షిగా జగన్‌ గారిని ఏమీ చేయవద్దు. 

– నాలాంటి వారిని చంపైనా మీ కొర్కె తీర్చుకోండి కానీ ఆయన్ను చంపొద్దు.

 

*కేసీఆర్, చంద్రబాబులను తిట్టి.. ఆ తర్వాత వారి కాళ్లు పట్టుకున్నాడు:*

– హైదరాబాద్‌లో ఒక మీటింగుకు వెళ్లి కేసీఆర్‌ గురించి భయంకరంగా కామెంట్స్‌ చేశారు.

– ఇది కేసీఆర్‌కు చేరింది. ఆయన అన్న మాటలు గుర్తు చేసుకో పవన్ కల్యాణ్.

– చిటికెలేస్తే తునకులై పోతావ్‌ అని కేసీఆర్‌ వార్నింగ్  ఇస్తే.. పవన్‌ ఎగిరి దూకి పారిపోయాడు. 

– ఆ తర్వాత ఏం చేయాలో అర్ధం కాక..కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకున్నాడు.

– కేసీఆర్‌కి దండం పెట్టి సారీ చెప్పాడు. బయట ప్రెస్‌మీట్‌ పెట్టి కేసీఆర్‌ గొప్ప మేధావి, ఉద్యమకారుడు అన్నాడు.

– ఒక అరగంట పాటు కేసీఆర్‌ గారిని పొగిడి పారిపోయి ఏపీకి వచ్చాడు.

– ఏపీలో కాపు కులస్థులు ఎక్కువ కాబట్టే తాను ఏమన్నా చెల్లిపోతుందని చంద్రబాబుపై తిట్లు మొదలు పెట్టాడు.

– చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడా? వెన్నుపోటు దారుడు సీఎం అవుతాడా? అతనికి జనాలు ఓటేస్తారా అన్నాడు.

– ఆయన కొడుకు లోకేశ్‌ గురించి.. పందిలా తినేసి..అవినీతి డబ్బు సంపాదించావు. పైనున్న మీ తాత ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుంది అన్నాడు.

– మిమ్మల్ని తిట్టాడు అని చంద్రబాబుకు చెబితే ఒక నిమిషం ఆలోచించాడు. మరో ఐదు నిమిషాల్లో పవన్‌ కల్యాణ్‌ వచ్చి చంద్రబాబు కాళ్ల మీద పడ్డాడు.

– ఆతర్వాత, అదే నోటితో మీరు నడిచే గ్రంథాలయం అంటూ చంద్రబాబును, లోకేశ్‌ను కూడా పొగిడేశాడు.

– చంద్రబాబు..., పొత్తుల పేరుతో, పవన్‌ కల్యాణ్‌ ని తీసుకొచ్చి కార్యకర్తలా తన కాళ్ల దగ్గర పెట్టుకున్నాడు.

– అందుకే పవన్‌ కల్యాణ్‌ ఒక కార్యకర్తలా తిడుతుంటాడు..ఇతన్ని కూడా కార్యకర్తలు అలానే తిడతారు. 

 

*నేను అన్ ఫిట్.. బాబుకే ఓట్లేయండి అని పవన్ చెబుతున్నాడు.:*

– ముందుగా, కాపులన్నీ ఓట్లు నాకేస్తే నేను సీఎం అవుతునానని మోసం చేశాడు.

– రెండో సారి నేనే సీఎం అని చెప్పి మభ్యపెట్టాడు.

– ఇక మూడో సారి మన ఓట్లన్నీ గుత్తగా నారా చంద్రబాబునాయుడుకు వేయాలి అన్నాడు. 

– అదేంటి మీరు సీఎం కావాలి అనుకుంటే..ఆయన మాత్రం నాకు సీఎం అయ్యేంత సీన్‌ లేదు అన్నాడు.

– ఇప్పుడు 2047 వరకూ విజన్‌ ఉన్న గొప్ప నాయకుడు చంద్రబాబు అని చెప్తున్నాడు. 

– కాపుల్లో ఎవరూ సీఎంగా పనికిరారు..నేను అన్‌ఫిట్‌..కాబట్టి బాబుకే ఓటేయండి అంటున్నాడు.

– వ్యాన్లు ఎక్కి నువ్వు ఏం మాట్లాడుతున్నావ్‌ పవన్‌ కల్యాణ్‌? 

– నువ్వు సీఎం అవుదామని వచ్చి కార్యకర్తలా మారి చంద్రబాబు కాళ్లు పట్టుకుని బాబును గెలిపించాలని తిరుగుతున్నావు.

– కాపులందరినీ తీసుకెళ్లి చంద్రబాబుకు తాకట్టు పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. 

– ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కాపు జాతి వీళ్ల వల్ల ఇప్పటికే ఆత్మగౌరవం పోగొట్టుకున్నారు.

– పవన్‌ కల్యాణ్, ఆయన అన్న చిరంజీవి పుణ్యమా అని కాపులను ఎంత దింపాలో అంత దింపేశారు.

– చిరంజీవి పెద్ద లెవెల్లో ప్రజారాజ్యం పెట్టాడు. చాలా మంది కాపులు మనోడు వచ్చాడని ఆస్తులు అమ్ముకుని కష్టపడ్డారు.

– ఆ ఎన్నికల్లో చిరంజీవి నీటి బుడగ, టికెట్లు అమ్మేసుకుంటున్నాడని చంద్రబాబు అన్నాడు.

– వాళ్లు కాపులు..రౌడీలు, గూండాలు. వాళ్లకి ఓటేస్తే మన కమ్మ కులస్థులు బతకరు అని మెసేజ్‌లు పెట్టాడు.

– ఇంత ఘోరంగా కాపుల గురించి మాట్లాడుతున్నాడని నేను చిరంజీవితో పాటు ప్రపంచం అంతటికీ చెప్పా. 

– పవన్‌ కల్యాణ్‌ కూడా విన్నాడు..కానీ అప్పుడు రెండు చెవుల్లో సీసం పోసుకున్నాడు.

– అంత కుల రాజకీయం చేసినా 18 ఎమ్మెల్యే సీట్లే వచ్చాయి. 

– కాపులు, చిరంజీవి అసెంబ్లీకి వెళ్లి సమస్యలు పరిష్కరిస్తాడు అనుకున్నారు. 

– ఈ 18తో సరిపెట్టుకుందాం.. భవిష్యత్తులో అవి పెరుగతాయిలే అనుకున్నారు. 

– అప్పట్లో చిరంజీవి నా వద్ద ఉన్న ఎమ్మెల్యేలు కోడిపిల్లలు కాదు...పులి పిల్లలు అన్నాడు. 

– ఆ పులి పిల్లల్ని తీసుకెళ్లి కాంగ్రెస్‌కు అమ్మేసుకున్నాడు. పార్టీని కూడా కాంగ్రెస్‌లో కలిపేశాడు.

– ఇలా అమ్మేసుకున్నందుకు ఒక రాజ్యసభ సీటు, కేంద్రంలో మంత్రి పదవి తెచ్చుకున్నాడు.

– కాపుల మనోభావాలను కూడా పట్టించుకోకుండా అమ్మేసుకోవడం దారుణమని చాలా మంది బాధపడ్డారు.

– ఈ కుటుంబాన్ని నమ్మి, పొలాలు, ఇళ్లు, డబ్బు..చివరికి ఆత్మగౌరవాన్ని కూడా పోగొట్టుకున్నారు.

– అలాంటి కాపు సోదరులను మళ్లీ మోసం చేయడానికి ఈ పవన్‌ కల్యాణ్‌ వచ్చాడు.

– ఇదీ జగన్‌ గారికి, చిరంజీవి,పవన్‌ కల్యాణ్‌లకు ఉన్న తేడా.

– జగన్‌ గారు వన్‌ మేన్‌ ఆర్మీ. రాష్ట్రమంతా తిరిగి ప్రజల్లోకి వెళ్లారు. 

– చంద్రబాబు, 2014లో  అబద్దాలు చెప్పి,  650 హామీలిచ్చి 1 శాతం ఓట్ల తేడాతో గెలిచాడు.

– అప్పుడు ఓడిపోయామని జగన్‌గారు, ఏమైనా కాంగ్రెస్‌కు అమ్మేసుకున్నాడా? 

– మళ్లీ అదే పార్టీని పాదయాత్ర చేసి పునర్నిర్మాణం చేసుకున్నాడు.

– ప్రతి ఒక్కరి కష్టాలు తెలుసుకున్నాడు..అధికారంలోకి వచ్చాక ఆ పేదలకు న్యాయం చేశాడు. 

– నవరత్నాలను మేనిఫెస్టోలో పెడితే ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలతో ఆయన్ను ముఖ్యమంత్రిని చేసుకున్నారు. 

 

*జగన్ గారి వద్ద రాజకీయ పాఠాలు నేర్చుకో:*

– మిస్టర్‌ పవన్‌ కల్యాణ్‌.. డెడికేషన్‌ అంటే జగన్‌మోహన్‌రెడ్డిది. 

– పెద్ద పెద్ద వారిని ఎదుర్కొన్నాడు. వెళ్లి ఆయన వద్ద పాఠాలు నేర్చుకో... 

– మొన్న చంద్రబాబు కూడా మాట్లాడుతున్నాడు. జగన్‌ గారిని బచ్చా అంటున్నాడు.

– అయినా జగన్‌ గారు తొణకడం లేదు. చంద్రబాబునాయుడు గారు నన్ను ఇలా అంటున్నారు అంటూ నింపాదిగా ప్రజలకు చెప్పారు.

– పవన్‌ కల్యాణ్‌లా గెంతులేసి, కొట్టేస్తా..తిట్టేస్తా అనడం లేదు.

– జగన్‌ గారు చేసింది ఒక మంచి రాజకీయ నాయకుడి ప్రవర్తన. 

– దాన్ని జగన్‌ గారి వద్ద చూసి నేర్చుకో. ఎలాగూ నువ్వు నేర్చుకోడానికి చంద్రబాబు వద్ద ఏమీ లేదు. 

– చంద్రబాబుకు తెలిసిందల్లా ఒక్కటే. ఎలా రాంగ్‌ రూట్‌లో సీఎం అవ్వాలి..ఎలా డబ్బు సంపాదించాలి..ఎలా వెన్నుపోడవాలి అనేది మాత్రమే తెలుసు.

– చంద్రబాబు జనంలో నుంచి పుట్టిన నాయకుడు కాదు. వాళ్ల మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు.

– ఆయన మళ్లీ జనంలోకి వెళ్లడు..జనాన్ని నమ్మడు.

– జగన్‌ గారికి, చంద్రబాబుకు ఒకటే తేడా..చంద్రబాబు ఓటర్లను ఎలా బురిడీ కొట్టించాలా, ఎలా కొనుగోలు చేయాలా అని అనుకుంటాడు.. జగన్‌ గారు ప్రజలను నమ్ముకుంటాడు. ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ప్రజలంటే ఆయనకు ప్రేమ. ఇదే వారిద్దరి మధ్య తేడా.

 

*రంగాను చంపిందెవరో, ముద్రగడను అవమానించిందెవరో తెలియదా పవన్?:*

– చంద్రబాబు విజయవాడలో వంగవీటి మోహనరంగాని చంపిస్తే..ముద్రగడ పద్మనాభం హైదరాబాద్‌లో ఉండి ఏడ్చాడు.

– వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయాడు.

– వాళ్లు కాపుల పట్ల నిబద్ధత చూపించే వారు. వంగవీటి రంగాను అన్యాయంగా చంపేశాడు అని వాళ్లు ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు.  అతను లీడర్‌ అంటే..

– ముద్రగడ కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగి..చిన్న పిల్లలతో కూడా ఆయన కుటుంబాన్ని తిట్టించాడు.

– ఇవన్నీ పవన్‌ కల్యాణ్‌కు తెలుసు కదా..ఒక్క సారన్నా ఖబడ్దార్‌ బాబూ అని అన్నావా? 

– నా పెళ్లాన్ని పెళ్లాం అంటారా? నన్ను గిచ్చుతున్నారు...గుచ్చుతున్నారు ఈ మాటలు తప్ప నీకు కాపుల పట్ల నిబద్ధత ఏదీ? 

– అసలు నువ్వు కాపులను ఎప్పుడు ప్రేమించావు గనుక? 

– రంగా గారి శిష్యుడిని. అతని కోసం ఇప్పటికీ ప్రజలు ఏడుస్తున్నారంటే నిజంగా కాపు కులం పట్ల డెడికేషన్‌ అది.

– నీకు డెడికేషన్ లేదు. నీకు డబ్బు, పదవి, అధికారం కావాలి. మీ అన్నయ్య కూడా అంతే.

– లేదంటే వంగవీటి రంగాను ఎవరు చంపారో నీకు తెలియదా? 

– ముద్రగడ పద్మనాభం గారిని ఎవరు అవమానించింది అనేది తెలియదా? 

– ఎన్టీఆర్‌ వెన్నుపోటుతో చంపింది ఎవరో తెలియదా? 

– కాపులు గూండాలు, రౌడీలు అన్నది ఎవరో తెలియదా? 

– అయినా మీ చెవుల్లో సీసం పోసుకుంటారు.

– మనం పెద్ద పెద్ద హీరోలం కదా.. జగన్ గారు సినిమా హీరో కూడా కాదు కదా అని పవన్‌ కల్యాణ్‌కు కోపం. 

– జగన్‌ వద్ద ఏమీ మంత్రాలు లేవు..ఆయన నిద్ర లేచినప్పటి నుంచీ నిద్ర పోయేవరకూ ప్రజల గురించే ఆలోచిస్తారు.

– చిరంజీవి కానీ, పవన్‌ కల్యాణ్‌ కానీ అలా ప్రజల కోసం అలా ఆలోచించగలరా? 

– ఎవరో రాసిచ్చిన డైలాగులతో ఇవాళ బాగా తిట్టాం కదా..క్లాప్స్‌ కొట్టారు కదా అనుకునా మీరా ప్రజలకు మేలు చేసేది?.. అంటూ పోసాని కృష్ణ మురళీ ఫైర్ చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై ఫైర్ అయ్యారు.  

Back to Top