రాష్ట్ర భవిష్యత్తు ప్ర‌యాణానికి ప్రజా సంకల్ప యాత్రే మూలం

వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌నేత, మండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా సంకల్ప యాత్ర ఆరేళ్ల పండుగ 

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర, ప్రజల భవిష్యత్తు ప్రయాణాన్ని రచించుకునేందుకు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మూలమైందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో ఆరేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్‌కట్‌ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ సీనియర్‌ నేత, శాసనమండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ 341 రోజుల పాటు పాదయాత్రలో నిర్విరామంగా నడిచి, సుమారు 2 కోట్ల మంది ప్రజానీకాన్ని కలిశారని చెప్పారు. పాదయాత్ర చేసేటప్పుడు ఎవరు ఆయనతో అడుగులు వేసినా, సమస్యలు చెప్పేందుకు ఎవరైనా వచ్చినా సరే 341 రోజులు ఎక్కడా విసుగు, విరామం లేకుండా వారిని కలిసి, వారి కన్నీళ్లు తుడిచి, కష్టాలు విని, భరోసా ఇచ్చారని గుర్తుచేశారు. 2 కోట్ల మంది ప్రజానీకాన్ని చిరునవ్వుతో కలిశారని చెప్పారు. 

పాదయాత్రలో జనం బాధలు విని, భవిష్యత్తు కార్యాచరణను రూపుదిద్ది, అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలోని ప్రతి అక్షరాన్ని సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేశారన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలు చెప్పిన ప్రతి విషయాన్ని మేనిఫెస్టో ద్వారా అందిస్తాను.. మేనిఫెస్టో అంటే పార్టీ ప్రజలకిచ్చే విశ్వాసం, భరోసా అని, పార్టీ ప్రణాళికను అమలు చేసి చూపిస్తానని మాటిచ్చి.. నాలుగున్నరేళ్ల పాలనలో అమలు చేసి చూపించారన్నారు. 

ప్రజలకు అందుబాటులో ఉన్నదే పార్టీ ప్రణాళిక కానీ, ప్రజల నుంచి దూరంగా పడేసేది మేనిఫెస్టో కాదు అనేది సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన అన్నారు. మేనిఫెస్టోలో ఎవరైనా పేజీలు లెక్కేసుకుంటారని, కానీ వైయస్‌ జగన్‌ మాత్రం పాదయాత్రలో 2 కోట్ల మంది ప్రజల నుంచి స్వీకరించిన 700 పేజీల సమాచారాన్ని క్రోడీకరించి రెండు పేజీల్లో ఎన్నికల మేనిఫెస్టోలో రూపొందించారన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలను అమలు చేస్తూ ముందుకుసాగుతున్నారని చెప్పారు.  

మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి పనిచేస్తున్నారని తెలిపారు. నిజానికి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపనతో వైయస్ జగన్ పనిచేస్తున్నారన్నారు. కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నా, విభజన నేపథ్యంలో ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారన్నారు. సామాజిక సాధికారత సాధించినప్పుడే బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత పెరుగుతుందని వైయ‌స్‌ జగన్ భావించారన్నారు. 

సచివాలయాల ద్వారా ఇంటి వద్దకే పరిపాలనను తీసుకువచ్చారన్నారు. రైతాంగానికి అనేక ప్రయోజనాలు కలిగే విధంగా పధకాలు అమలు చేస్తున్నారు.పేదలకు విద్య,ఆరోగ్యం అందించేందుకు సీఎం వైయ‌స్‌ జగన్ అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. జగనన్న సురక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్యసేవలను అందుబాటులోకి తెచ్చారన్నారు. 40 ఇయర్స్ ఇండ‌స్ట్రీ చంద్రబాబు కంటే తొలిసారి సీఎం అయిన వైయ‌స్‌ జగన్ దార్శినికత చూపుతూ రాష్ట్రానికి అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారన్నారు. మహాత్మాగాంధీ మాటలను నిజం చేస్తున్న వ్యక్తి సీఎం వైయ‌స్‌ జగన్ అన్నారు.

శాసనమండలి సభ్యుడు రుహుల్లా మాట్లాడుతూ.. ప్రజాసంకల్పయాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. నేను విన్నాను.. నేను ఉన్నాను అని ప్రజలకు భరోసా ఇచ్చి అధికారంలోకి రాగానే నవరత్నాల పథ‌కాలు అమలు చేస్తూ ప్రజల హృదయాలలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ నిలిచిపోయారన్నారు. ముఖ్యంగా మైనారిటీలకు నలుగురుకి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారన్నారు. చంద్రబాబు మైనారిటీలను మోసం చేశారన్నారు. రానున్న ఎన్నికలలో 175 స్దానాలు గెలుచుకునేలా మనం అందరం పనిచేయాలని కోరారు.

ఈ సందర్భంగా  వైయస్ జగన్ తో పాటు ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న 9 మందిని శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎస్సీ కమిషన్ సభ్యుడు కాలే పుల్లారావు, పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Back to Top