కూట‌మి నేత‌ల‌పై ఎన్నికల కమీషన్ కు వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు

అమ‌రావ‌తి: ఎన్నికల నియమావళికి విరుధ్దంగా ప్రవర్తిస్తున్నతెలుగుదేశం పార్టీ, చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, కర్నూలు టిడిపి ఎంపి అభ్యర్ది నాగరాజులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు చేసింది. వైయ‌స్ఆర్‌సీపీ ఎంఎల్ ఏ మల్లాది విష్ణు, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి, లీగల్ సెల్ నేత శ్రీనివాసరెడ్డిలు ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కు ఫిర్యాదు చేశారు.ఇందుకు తగిన ఆధారాలను అందించారు.

1.తెలుగుదేశం పార్టీ ఐవిఆర్ కాల్స్ ద్వారా అమలులోలేని ల్యాండ్ టైటిల్ యాక్ట్ కు సంబంధించి వైయస్ జగన్ గారిపై దుష్ప్రచారం చేస్తోంది.ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుధ్దం కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆధారాలను అందచేశారు.

2.టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు ఈనెల 28 వతేదీన కోడుమూరు,మంత్రాలయం లలో జరిగిన ప్రచారంలో ముఖ్యమంత్రి జగన్ గారిని ఉద్దేశ్యించి వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇది ఎంసిసికి విరుధ్దం.కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

3. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఈనెల 28 వతేదీన జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది ఎన్నికల నియమావళికి విరుధ్దం కాబట్టి పవన్ కల్యాణ్ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Back to Top