టీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది 

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

వెంకటరెడ్డి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం 

ఓటమి భయంతో టీడీడీపీ హింసాత్మక చర్యలకు పాల్పడుతూ నీచంగా, ఉన్మాదంతో ప్రవర్తిస్తోంది.

మనుషుల ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడటం లేదు.

ఎన్నికల ప్రచారంలో ఉండగా టీడీపీ గూండాలు వెంకటరెడ్డిని బైక్ తో వచ్చి వేగంగా డీ కొట్టి ప్రాణాలు తీశారు.

ప్రాణాలు తియ్యాలన్న ఉద్దేశంతో ఈ రకంగా దాడులకు దిగుతున్నారు.

వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు సంయమనంతో ఉన్నారు.

సిఎంపై జరిగిన దాడి మర్చిపోక ముందే తాడేపల్లిలో హత్యకు పాల్పడ్డారు 

మా మౌనాన్ని చేతకాని తనంగా తీసుకోవద్దనీ టీడీపీ నేతలకు చెప్తున్నాం. ఇలాంటివి జరగకూడదని వైయ‌స్ఆర్‌సీపీ కోరుకుంటోంది.

మేము దణ్ణం పెట్టీ చెప్తున్నాం హత్యలు, దాడులకు దూరంగా ఉండాలి.

మీ దాడులకు మా రియక్షన్ వేరేలా ఉంటే టీడీపీ నేతలు తట్టుకోలేరు.

టీడీపీ పీడ 2024 ఎన్నికలతో విరగడ కాబోతోంది.

రానున్న 20 రోజులు అందరూ అప్రమత్తంగా ఉండాలి. 

టిడిపి మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉంది  : స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

తాడేప‌ల్లి:  టీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసిందని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. వెంకటరెడ్డి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామ‌ని హామీ ఇచ్చారు.  టీడీపీ నాయకులు దాడిలో చనిపోయిన మేకా వెంకటరెడ్డి మృతదేహనికి వైయ‌స్ఆర్‌సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి  సజ్జల రామకృష్ణ రెడ్డి, రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, రుహుల్లా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజి మంత్రి రావెల కిషోర్ బాబు, అప్కో ఛైర్మన్ గంజి చిరంజీవి నివాళులు అర్పించారు.  తాడేపల్లిలోని వెంకటరెడ్డి నివాసగృహానికి సజ్జల తో పాటు అందరూ తరలివెళ్లారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. వెంకటరెడ్డిని తిరిగి తీసుకురాలేమని, ఇలా జరగడం దారుణం అని అయితే కుటుంబసభ్యులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

      అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ నీచమైన రాజకీయాలకోసం ఉన్మాదంతో ప్రవర్తిస్తోందని అన్నారు. ఎన్నికలలో టెర్రరైజ్ చేయాలని చూస్తోందని అన్నారు. ఇక్కడ పోటీ చేస్తున్న లోకేష్ ఓడిపోతాడని స్పష్టంగా తెేలిపోవడంతో ఓటర్లను, వైయ‌స్ఆర్‌సీపీ  నాయకులను,సానుభూతిపరులను భయభ్రాంతులను చేసే ఉద్దేశ్యంతో కావాలని దాడులకు తెగబడుతోందని అన్నారు. ఇటీవల పదేపదే దాడులకు పాల్పడుతోంది. 

విజయవాడలో సీఎం వైయ‌స్ జగన్ గారిపై హత్యాయత్నం చేశారు. అది మరచిపోకముందే మా పార్టీ ప్రచారంలో ఉన్న వెంకటరెడ్డిని రెచ్చగొట్టేవిధంగా వ్యవహరించి తెలుగుదేశం గూండాలు బైక్ తో గుద్ది దారుణంగా చంపేశారన్నారు. ఇది అనుకోకుండా జరిగిందనడానిికి వీల్లేదని ఖచ్చితంగా దురుధ్దేశ్యంతోనే చేశారని అన్నారు. దీనిని పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి చోటు ఉండకూడదు. మా పార్టీ బలమైన పార్టీ అయినప్పటికి తాము నిన్నటినుంచి చాలా సంయమనంతో ఉన్నామనేది అందరూ అర్ధం చేసుకోవాలన్నారు. 

నిగ్రహంతో ఉండటమనేది చేతకానితనంగా అర్దం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నామన్నారు. నిజంగా తమ పార్టీ వాళ్ళు కన్నెర్ర చేస్తే టిడిపి నేతలుగాని,కార్యకర్తలు గాని రోడ్లపై తిరగలేరన్నారు. ఇది పధ్దతి కాదన్నారు. కేవలం రాష్ర్టంలో తిరిగి వైయ‌స్ఆర్‌సీపీ గెలవబోతోందనే భయంతో వాళ్ళు చేస్తున్న కుట్రలకు ఊతం ఇచ్చేవిధంగా తాము వ్యవహిరంచకూడదనే సంయమనంతో ఉన్నామని వివరించారు.ఇది ఖచ్చితంగా హత్య అని 302 కింద కేసు రిజిష్టర్ చేసి నిందితులను కఠినంగా శిక్షించేవిధంగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరుతున్నామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటివాటికి ఎవరు పాల్పడాలన్నా భయపడేవిధంగా శిక్షించాలని కోరారు.

       వెంకటరెడ్డిగారిని తిరిగి వెనకకు తీసుకురాలేమని అలాంటి మంచి నేతను కోల్పోయినందుకు విచారం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని తెలియచేశారు. పిల్లల భవిష్యత్తు విషయంలో కూడా తగిన భరోసా ఇస్తున్నామని తెలియచేశారు. తెలుగుదేశం పార్టీ వారే హత్యలకు,దౌర్జన్యాలకు,దాడులకు పాల్పడి తిరిగి వారే బాధితులం అన్నట్లు ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. నిజానికి వైయ‌స్ఆర్‌సీపీ వారే బాధితులుగా ఉంటున్నారని అన్నారు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారనే విషయం టిడిపి గుర్తుంచుకోవాలన్నారు. వీటన్నింటికి ఓటమి పాలు కాబోతున్నామనే నిసృహ ఇలాంటి పనులను టిడిపి చేత చేయిస్తోందని తెలియచేశారు.

2024 ఎన్నికలతో టిడిపి దుకాణం బంద్ అయి పీడ వదలబోతోందని అన్నారు. అందుకే శవాలపై పేలాలు ఏరుకునే విధంగా టిడిపి వ్యవహరిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రిగారిపై దాడి చేసి తిరిగి డ్రామా అంటూ హేళన చేస్తూ మాట్లాడతున్నారని అన్నారు. సీఎం గారిపై రాయితో దాడి చేసి ముఖ్యమంత్రిగారే చేయించుకున్నారని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.హాయిగా బతుకుతున్న మనుషులను శవాలుగా మారుస్తున్నవారు టిడిపి వాళ్లని, వారే తిరిగి ఈసి,గవర్నర్ ల వద్దకు ఫిర్యాదు చేస్తున్నారని  మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తెలిపారు. 

Back to Top