చంద్రబాబు ఎగ్గొట్టిన డీఏలను వైయ‌స్‌ జగన్  చెల్లించారు

వైయ‌స్ఆర్‌సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరు గౌతం రెడ్డి 

తాడేప‌ల్లి: ఉద్యోగులను మభ్య పుచ్చేందుకు మేకతోలు కప్పుకుని చంద్రబాబు ఉద్యోగులకు లేఖలు రాస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరు గౌతం రెడ్డి మండిప‌డ్డారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..తను అధికారంలో ఉండగా ఉద్యోగులను వేధించుకుతిన్న చంద్రబాబు ఉద్యోగులకు లేఖలు రాయడం హాస్యాస్పదం.వైయస్ జగన్ ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వం.వైయస్ జగన్ అదికారంలోకి రాగానే ఉద్యోగులకు 27 శాతం ఇంటీరియం రిలీఫ్ ఇచ్చిన విషయం మరిచిపోయావా అంటూ నిల‌దీశారు. నీవు మరిచిపోయినా తీసుకున్న ఉద్యోగులు మరిచిపోరు.
17,918 కోట్ల రూపాయలు ఇందుకోసం ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. వేతన సవరణకు సంబంధించి 11,707 కోట్ల రూపాయలు అధనపు వ్యయాన్నిమోసి 12 వ పిఆర్టిసికి అమలు చేశారు. చంద్రబాబు ఎగ్గొట్టిన డిఏలను జగన్ గారు ఇచ్చారా లేదా చెప్పండి అని ప్ర‌శ్నించారు. పారిశుధ్యకార్మికులు,చిన్న ఉద్యోగులకు నవరత్నాల అమలుకు నిర్ణయించారు. ఉద్యోగుల ఆత్మస్దైర్యాన్ని పెంచారు.వారు అడగకుండానే ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచింది జగన్ గారే. మీరు మనస్సులో మాట అనే పుస్తకంలో ఉద్యోగులంతా అవినీతి పరులేనని రాశారా లేదా. 
1998లో డిఎస్సి రాసిన వారందరికి జగన్ గారు ఇటీవల ఉద్యోగాలు ఇచ్చారు. కోవిడ్ సందర్భంగా పూర్తి జీతాలను ఉద్యోగులకు అందించారా లేదా. కపట నాటకధారి చంద్రబాబు లేఖలను నమ్మద్దని కోరుతున్నాను. గ్రామ,వార్డు సచివాలయాలను ఏర్పాటుచేయడం ద్వారా లక్షలాదిఉద్యోగాలు నూతనంగా కల్పించి ఉద్యోగులలో పనిభారాన్ని తగ్గించారు. ఉద్యోగులలో దళారీ విధానాన్ని తొలగించి అవుట్ సోర్సింగ్ కార్పోరేషన్ ఏర్పాటుచేశారు. ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. మెరుగైన పెన్సన్ విధానం ప్రవేశపెట్టి జీపిఎస్ విధానం తెచ్చారు. ఇంటి స్దలాల విషయంలో ఉద్యోగులకుమేలు కలిగించే నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు హయాంలో కార్మికులను రోడ్డున పడేశార‌ని గౌతం రెడ్డి పేర్కొన్నారు.

Back to Top