ముస్లింల‌కు 4 శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తాం

నెల్లూరు ప్ర‌చార స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

ఆరునూరైనా ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే

ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు

రాబోయే ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయిస్తాయి

బాబు మోసాలకు ఓడించేందుకు మీరంతా సిద్ధమా

59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నంబర్‌వన్‌గా నిలిచాం

చంద్రబాబు హయాంలో రూ.32 వేల కోట్లు పెట్టబడులు వస్తే.. 

మీ బిడ్డ వైయ‌స్ జగన్‌ హయాంలో రూ.లక్ష కోట్లు పెట్టుబడులు వచ్చాయి

 నెల్లూరు: నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. ఓ వైపు ఎన్డీఏలో కొనసాగుతూ మరో వైపు మైనార్టీలపై దొంగప్రేమ కురిపిస్తున్నాడు అంటూ చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. మైనార్టీలకు ఎప్పటికీ అండగా ఉంటా..  తాము 4 శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 

వెనుకబాటుకు గురైన వారి రిజర్వేషన్లు తొలగించడం కరెక్టేనా?. ఆరునూరైనా ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ముస్లింలకు మత ప్రాతిపదికన 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదు. వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్లు ఇవి. మళ్లీ ముస్లింల కోసం చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడు. చంద్రబాబు ఓ ముదిరిపోయిన తొండ. ఇది కాదా ఊసరవెల్లి రాజకీయం, ముస్లిం రిజర్వేషన్లకు చంద్రబాబు కట్టుబడి ఉన్నారా?  అంటూ సీఎం వైయ‌స్ జగన్‌ నిలదీశారు.  శ‌నివారం నెల్లూరు సిటీ గాంధీ విగ్రహం సెంటర్‌లో ఏర్పాటు చేసిన‌ బహిరంగ సభలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడారు.

ఈ సందర్భంగా  సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే...

నెల్లూరు సిద్ధమా?. 
చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతల మధ్య ఇవాళ ఈ మీటింగ్‌కి ఇక్కడకు వచ్చిన నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, నా ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, నా ప్రతి సోదరుడికీ, స్నేహితుడికీ మీ అందరి ఆప్యాయతలకు మీ అందరి ప్రేమానురాగాలకు ముందుగా మీ జగన్, మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. 

ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ అభివృద్ధికి కొనసాగింపు.
మరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతున్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే మీ ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీరు జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడమే. చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమే అన్నది ప్రతిఒక్కరినీ గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. చంద్రబాబు మోసాలను ఓడించడానికి, పేదలను గెలిపించడానికి.. విలువలకు విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా..  సిద్ధమేనా?.
 
పేదలకు తన 14 ఏళ్ల పాలనలో ఒక్క మంచీ చేయని బాబు.
చంద్రబాబు నాయుడు తాను మూడుసార్లు సీఎం అంటాడు, 14 ఏళ్లు సీఎంగా చేశానంటాడు. తాను సీఎంగా ఉన్న ఆ 14 ఏళ్లల్లో.. మీ జగన్ ఈ 59 నెలలపాలనలో మాదిరిగా ఇన్ని స్కీములు అమలు చేసిందీ లేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా తాను పాలించానంటాడు, 3 సార్లు సీఎం అంటాడు మరి నేను అడుగుతున్నాను.. 14 ఏళ్లు సీఎంగా చేశావు కదయ్యా చంద్రబాబు.. మరి చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా, ఏ బీదకైనా కూడా గుర్తుకువచ్చే ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా అని మీ బిడ్డ అడుగుతున్నాడు. 

14 ఏళ్లు ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా కూడా గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని మీ బిడ్డ అడుగుతున్నాడు. మరి బాబు పేరు చెబితే ఏ పేదకు కూడా గుర్తుండే ఒక్కటంటే ఒక్క స్కీమూ లేదు, ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచీ లేదు. కాబట్టే తాను మీ బిడ్డ మీ జగన్‌లా లంచాలు, వివక్ష లేకుండా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా బటన్ నొక్కి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు మీ బిడ్డ చేసినట్టుగా డీబీటీ తాను కూడా చేశానని చెప్పలేకపోతున్నాడు.

మీ బిడ్డ గతంలో ఎప్పుడూ చూడనట్టుగా, జరగనట్టుగా ఏకంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఇస్తే.. ఆ మాదిరిగా నేనూ ఇచ్చాను అని చెప్పి ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడు చెప్పలేకపోతున్నాడు. గతంలో ఎప్పుడూ చూడనివిధంగా మీ బిడ్డ ఏకంగా 99 శాతం మేనిఫెస్టో వాగ్ధానాలు మీ బిడ్డ అమలు చేస్తే తానూ మీ బిడ్డలా అమలు చేశానని ఈ పెద్దమనిషి చంద్రబాబు చెప్పలేకపోతున్నాడు. ఇవన్నీ చెప్పలేక చివరికి చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడంటే.. జగన్ పాలనలో అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు అని విష ప్రచారం చేస్తున్నాడు. 

చరిత్రలో ఎప్పుడూ చూడని కొత్త అభివృద్ధి.
నేను అడుగుతున్నాను.. ఆ అబద్ధాల చంద్రబాబుకు ఆ విషం చెప్పే ఆయన తోక పత్రికలకు, ఆ టీవీలకు కళ్లు తెరిపించేలా మనం నెల్లూరు నుంచే సమాధానం చెబుదామా? అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి ఎవరు చేశారని సిద్ధమేనా?. మీ బిడ్డ ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడూ చూడనివిధంగా కొత్తగా మరో 17 కొత్త మెడికల్ కాలేజీలు కడుతోంది.. మరి ఇది కాదా అభివృద్ధి అని మీ బిడ్డ అడుగుతున్నాడు. చంద్రబాబు నాయుడును అడుగుతున్నాడు.. నువ్వు ఎప్పుడైనా ఇలాంటివి కనీసం ఆలోచన అయినా చేశావా చంద్రబాబూ అని మీబిడ్డ అడుగుతున్నాడు. మీ బిడ్డ ప్రభుత్వం చరిత్రలో కూడా ఎప్పుడూ చూడనివిధంగా ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం కొత్తగా మరో 4  సీపోర్టులు కడుతోంది, కొత్తగా మరో 10 ఫిషింగ్ హార్బర్లు కడుతోంది, కొత్తగా మరో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడుతోంది..కళ్లెదుటే ఈ కట్టడాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. 

ఇదే నెల్లూరు జిల్లాలోనే రామాయపట్నం పోర్టు దాదాపు పూర్తి కావస్తోంది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ దాదాపు పూర్తైంది. ఇదంతా కళ్లెదుటే కనిపిస్తున్నా అభివృద్ధి కాదా అని మీబిడ్డ ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడును అడుగుతున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడ్ని అడుగుతున్నాను.. నువ్వెప్పుడైనా ఇలాంటి ఆలోచన చేశావా ఓ చంద్రబాబూ అని మీ బిడ్డ అడుగుతున్నాడు. చరిత్రలో ఎప్పుడూ చూడనివిధంగా, ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగనివిధంగా మన గవర్నమెంట్ బడుల్లో ఈరోజు నాడు-నేడుతో గవర్నమెంట్ బడులు బాగుపడుతున్నాయ్, గవర్నమెంట్ బడుల్లో ఈరోజు ఇంగ్లీష్ మీడియం మొదలు టోఫెల్ క్లాసులు, ఐబీ దాకా ప్రయాణంతో అంతర్జాతీయ విద్య వరకు కూడా ఈరోజు పిల్లల చదువుల్లో ఓ విప్లవాలు కనపడుతున్నాయి.  మీబిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఎవరైనా ఊహించారా? నాడు-నేడుతో మొదలు 8వ తరగతి నుంచే గవర్నమెంట్ బడిలో చదువుతున్న పిల్లల చేతుల్లో ట్యాబులు వస్తాయని ఎవరైనా ఊహించారా? 6వ తరగతి నుంచే గవర్నమెంట్ బడుల్లో ఏకంగా డిజిటల్ బోర్డులు వస్తాయని, డిజిటల్ బోధన గవర్నమెంట్ స్కూళ్లల్లోనే అందుబాటులోకి వస్తుందని, పేద పిల్లలకు బైజూస్ కంటెంట్ అందుబాటులోకి వస్తుందని, 3వ తరగతి నుంచే ఆ పేద పిల్లలకు సబ్జెక్ట్ టీచర్ క్లాసులు వస్తాయని, టోఫెల్ కూడా పిరియడ్లు వస్తాయని ఎవరైనా ఊహించారా అని అడుగుతున్నాను. 
ఈ రోజు గవర్నమెంట్ బడుల్లో చదువుతున్న పిల్లలు ఈరోజు వాళ్ల పిల్లలు ఆ టెక్స్ట్ బుక్కులన్నీ బైలింగువల్ టెక్స్ట్ బుక్కులు.. అంటే ఒక పేజీ తెలుగు, మరో పేజీ ఇంగ్లీష్ తో ఈరోజు ఆ పిల్లల చేతుల్లో టెక్స్ట్ బుక్స్ కనిపిస్తున్నాయి. ఆ పేద పిల్లలకు ఇంతగా అండగా ఉండే ప్రభుత్వం వస్తుందని ఎవరైనా ఊహించారా? అని అడుగుతున్నాను. ఓ చంద్రబాబూ.. నువ్వు ఏనాడైనా చేశావా ఈ అభివృద్ధి అని అడుగుతున్నాను. ఈ క్వాలిటీ చదువులు కాదా అభివృద్ధి అని మీ బిడ్డ అడుగుతున్నాడు. ఇది కాదా సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అంటే అని చెప్పి మీ బిడ్డ అడుగుతున్నాడు. 

చరిత్రలో ఎన్నడూ చూడనివిధంగా.. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పాడు మీ బిడ్డ. ఈరోజు 15వేల గ్రామ సచివాలయాలు ప్రతి మారుమూల గ్రామంలో కూడా కనిపిస్తున్నాయి.  ఏకంగా 11వేల విలేజ్, వార్డు క్లినిక్స్ కనిపిస్తున్నాయి. ఏకంగా 11 వేల ఆర్బీకేలు ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి.  ఏకంగా 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్‌గా రాష్ట్రంలో 2 లక్షల 60 వేల మంది వాలంటీర్లు గ్రామస్థాయిలో కూడా వీళ్లంతా కనిపిస్తున్నారు. ఇంటివద్దకే పౌర సేవలు, ఇంటివద్దకే పథకాలు, ఇంటివద్దకే పెన్షన్, ఇంటివద్దకే రేషన్.. ఎక్కడా వివక్ష లేకుండా, ఎక్కడా లంచాలు లేకుండా ఈరోజు ప్రతి ఇంటికీ సేవలు అందుతున్నాయి. నేను అడుగుతున్నా ఇది కాదా అభివృద్ధి అంటే అని ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడును అడుగుతున్నాను. మరి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని చెప్తున్నావు. నువ్వు ఏరోజైనా ఇలాంటి అభివృద్ధి, ఇలాంటి ఆలోచనలు చేశావా చంద్రబాబు అని మీ బిడ్డ అడుగుతున్నాడు. 

ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ...
ఎప్పుడూ కూడా చూడనివిధంగా, ఎప్పుడూ జరగనివిధంగా ఎక్కడనుంచో పైప్ లైన్ వేసి రక్షిత మంచినీటి సదుపాయం కల్పించి ఉద్దానం సమస్యను శాశ్వతంగా పరిష్కరించిందని మన ప్రభుత్వం. ఇది అభివృద్ధి కాదా చంద్రబాబూ అని అడుగుతున్నాను. దశాబ్ధాలుగా ఎవ్వరూ పట్టించుకోలేని ఆ సమస్యలను ఈరోజు పరిష్కారం చేసిందెవరు? ఈరోజు వారికి అండగా నిలబడిందెవరు? ఇది కాదా అభివృద్ధి అని అడుగుతున్నాడు మీ బిడ్డ. చంద్రబాబు దిక్కుమాలిన బుర్రకు ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా తట్టిందా అని మీ బిడ్డ అడుగుతున్నాడు. ఈరోజున గ్రామానికే ఫైబర్ గ్రిడ్, ట్రైబల్ ప్రాంతాలకు సైతం సెల్ టవర్లు, ఇప్పటికే 3వేల గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు.. ఇవన్నీ మన కళ్లెదుటే కనిపిస్తున్నాయ్. మరి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఈ చంద్రబాబుకు ఇది కనిపించడం లేదా? ఇది అభివృద్ధి కాదా? అని మీబిడ్డ అడుగుతున్నాడు. 

నాడు-నేడుతో గవర్నమెంట్ బడులు బాగుపడ్డాయి, నాడు-నేడుతో గవర్నమెంట్ హాస్పిటళ్లు బాగుపడ్డాయి.. మొట్టమొదటిసారిగా 54వేల పోస్టులు గవర్నమెంట్ హాస్పిటళ్లలో అన్నింట్లోనూ కూడా రిక్రూట్‌మెంట్ చేశాం. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఈరోజు డబ్ల్యూహెచ్‌వో జీఎంపీ మందులు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ విస్తరణ జరిగింది, ఆరోగ్య ఆసరా ముందుకొచ్చింది. గ్రామంలోనే ప్రివెంటివ్ కేర్‌లో ఎప్పుడూ చూడని అడుగులుపడ్డాయి.  గ్రామానికే విలేజ్ క్లినిక్ వచ్చింది. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ వచ్చాడు. ఇంటింటికీ ఆరోగ్య సురక్ష వెళ్లింది. ఇవన్నీ మన కళ్లెదుటే కనిపిస్తూ ప్రతి పేదవాడికి తోడుగా ఉంటూ ప్రతి పేదవాడిని ఆదుకుంటూ అడుగులు వేస్తున్న ఈ అభివృద్ధి నీకు కన్పించడంలేదా చంద్రబాబూ అని మీ బిడ్డ అడుగుతున్నాడు. ఇది కాదా క్వాలిటీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ అంటే అని చెప్పి మీ బిడ్డ అడుగుతున్నాడు. 

పక్కనే వెలిగొండ ప్రాజెక్ట్ కనిపిస్తుంది. వెలిగొండ నీళ్లు రాక, శ్రీశైలం నీళ్లు రాక ప్రకాశం జిల్లా అంతా కూడా ఫ్లోరైడ్ బాధితులతో అతలాకుతలం అవుతున్న పరిస్థితులు. మరి ఏ ఒక్కరైనా కూడా వారి గురించి పట్టించుకున్న పుణ్యాన్ని కట్టుకున్నారా అని అడుగుతున్నాను. ఈరోజు వెలిగొండ ప్రాజెక్టులోని రెండు టన్నెళ్లను ఇప్పటికే పూర్తి చేశాం. ఈ వర్షాకాలంలో వెలిగొండ నీళ్లను ప్రకాశం జిల్లాకు తీసుకొనిపోతున్నాం.. ఇది కాదా అభివృద్ధి అని మీబిడ్డ అడుగుతున్నాడు.

అంతేకాకుండా నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీలు పూర్తి చేసింది, జాతికి అంకితం చేసింది మీబిడ్డ కాదా అని ఇదే సందర్భంగా అడుగుతున్నాడు. పక్కనే కనిపిస్తోంది.. చిత్రావతి రిజర్వాయర్. ఆ పక్కనే కనిపిస్తోంది గండికోట రిజర్వాయర్, ఈ పక్కనే కనిపిస్తోంది పులిచింతల రిజర్వాయర్.. వీటిలో ఆర్‌అండ్ఆర్ పూర్తి చేయక ఈ ప్రాజెక్టుల్లో నీళ్లు కూడా పూర్తిగా నింపలేని అధ్వానమైన పరిస్థితిలో రాష్ట్రం నడుస్తోన్న కూడా ఏ ఒక్కరోజూ కూడా పట్టించుకోకపోతే ఈరోజు ఈ ప్రాజెక్టుల్లో అంతా కూడా ఆర్‌అండ్‌ఆర్ పూర్తి చేసి.. ఇవాళ ఈ డ్యాముల్లో పూర్తి సామర్థ్యంతో నీళ్లు నింపుతున్నామంటే ఇది కాదా అభివృద్ధి అని మీబిడ్డ అడుగుతున్నాడు.

ఎయిర్ పోర్టుల విస్తరణా మీ బిడ్డ హయాంలోనే...
ఎయిర్‌పోర్టుల విస్తరణ మీబిడ్డ హయాంలోనే జరుగుతోంది. ఎయిర్‌పోర్టుల విస్తరణకు డబ్బులు ఇచ్చింది మీబిడ్డే. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పరుగులుపెట్టిస్తోంది మీబిడ్డే. ఈరోజు చంద్రబాబు నయా నాయుడు హయాంలో ఎప్పుడూ పరుగెత్తనివిధంగా ఈరోజు మీబిడ్డ హయాంలో ఈరోజు మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్ ..వీటి పరుగులు కూడా ఈరోజు కనిపిస్తున్నాయి.. ఉరుకులు పరుగులుగా పనులు జరుగుతూ కనిపిస్తున్నాయి. ఇది కేవలం ఈ 59 నెలల కాలంలో మీబిడ్డ హయాంలో కాదా అని అడుగుతున్నాను.  

ఎంఎస్ఎంఈలకు ఏనాడైనా మా మాదిరిగా నువ్వు సపోర్ట్ చేశావా అని మీ బిడ్డ అడుగుతున్నాడు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా నెంబర్ వన్ స్టేటస్ వచ్చింది ఎప్పుడూ అంటే మీబిడ్డ హయాంలో కాదా అని అడుగుతున్నాను. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి ఎప్పుడూ రాని పారిశ్రామికవేత్తలు ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారంటే ఇది కాదా అభివృద్ధి అని మీ బిడ్డ అడుగుతున్నాడు. 
 ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు అన్నీ కలిపితే కేవలం రూ.32 వేలు కోట్లు అయితే ఇదే మన ఐదేళ్ల పాలనలో వచ్చిన పెట్టుబడులు ఏకంగా రూ.లక్ష కోట్లు పైగానే కనిపిస్తుంటే ఇది కాదా అభివృద్ధి అని మీ బిడ్డ అడుగుతున్నాడు. ఒకవైపున ఇవన్నీ చేస్తూ మరోవైపున పేదల బ్రతుకులు మార్చే కార్యక్రమం, ఇంటింటి అభివృద్ధి మార్చే కార్యక్రమం చేస్తూ మీబిడ్డ తీసుకొచ్చిన స్కీములు, మీ బిడ్డ నొక్కిన బటన్లు ఎన్నో తెలుసా? ఏకంగా 130 సార్లు బటన్ మీ బిడ్డ నొక్కాడు. వివిధ పథకాల ద్వారా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా మీబిడ్డ బటన్ నొక్కుతున్నాడు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా వెళ్తున్నాయి. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. మీబిడ్డ బటన్ నొక్కుతున్నాడు నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే, నా అక్కచెల్లెమ్మల చేతికే ఇలా డబ్బులిస్తున్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగిందా అని మీ బిడ్డ అడుగుతున్నాడు.  

ఎప్పుడైనా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు మళ్లీ చెప్తున్నా.. ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్కచెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇస్తూ.. ఈరోజు మీబిడ్డ అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్నాడు. ఈ మాదిరిగా జరిగిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని మీ బిడ్డ అడుగుతున్నాడు.  ఇలాంటి అభివృద్ధి చేసిన మరో రాష్ట్రాన్ని నువ్వు ఎక్కడైనా చూపించగలవా చంద్రబాబూ అని అడుగుతున్నానుడు మీబిడ్డ. అందరూ ఆలోచన చేయమని అడుగుతున్నాను. అందరూ ఆలోచన చేయండి. ఒక మనిషి 14 ఏళ్లు సీఎంగా చేసిన తర్వాత కూడా 75 ఏళ్ల వయస్సులో ఒంటరిగా తాను ఈ మంచి చేశాను అని చూపించి ఎన్నికలకు వెళ్లలేకపోతున్నాడంటే, పొత్తులతో నిలబడే ప్రయత్నం చేస్తున్నాడంటే అసాధ్యమైన వాగ్ధానాలు, మోసాలను నమ్ముకుని రాజకీయాలను నడుపుతున్నాడంటే ఇంతకన్నా దౌర్భాగ్యుడు మానవచరిత్రలో ఎవడైనా ఉంటాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.  

పేదల బ్రతుకులను మార్చే దిశగా అడుగులు
మరోవంక మీ బిడ్డ ప్రభుత్వం..మనస్సు ఉన్న మీ ప్రభుత్వం ఏనాడైనా కూడా ఏం చెప్పింది? ఏం చేసింది? అని అంటే కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, వర్గం చూడలేదు, చివరికి వారు ఏపార్టీకి ఓటు వేశారనేది కూడా చూడలేదు, రాజకీయాలు కూడా చూడకుండా ఒక కుటుంబం పేదరికాన్ని మాత్రమే మీ బిడ్డ చూశాడు. వీరి బ్రతుకులను శాశ్వతంగా మార్చేందుకు మీ బిడ్డ అడుగులు వేశాడు. కానీ చంద్రబాబు రాజకీయం మాత్రం ఊసరవెళ్లి రాజకీయం. 

చంద్రబాబుది ఊసరవెళ్లి రాజకీయం.
 చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండ. ఒకపక్క 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేస్తున్న పార్టీతో ఈయన జత కడతాడు. ఒకపక్క 4 శాతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని శపథం చేస్తున్న బీజేపీతో ఈయన జతకడతాడు. మరోపక్క మైనార్టీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు దొంగ ప్రేమ నటిస్తూ డ్రామాలు మొదలుపెట్టాడు. ఒకవైపు మైనార్టీలపై దొంగ ప్రేమ నటిస్తూనే మరోవైపున ఎన్డీఏలోనే కొనసాగుతానంటాడు. నేను అడుగుతున్నాను.. ఇంతకన్నా ఊసరవెళ్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా? అని అడుగుతున్నాను.

రిజర్వేషన్లపై ధైర్యంగా చెపుతున్నా- నువ్వు చెప్పగలవా బాబూ
నేను ఈరోజు ధైర్యంగా చెబుతున్నాను. ఆరు నూరైనా గానీ నూరు ఆరైనా కూడా 4 శాతం రిజర్వేషన్లు మైనార్టీలకు ఉండి తీరాల్సిందేనని మీబిడ్డ ఈరోజు తలెత్తుకుని చెప్తున్నాడు. ఇదీ మీ జగన్ మాట, ఇదీ మీ వైఎస్సార్ బిడ్డ మాట. దీనికోసం ఎందాకైనా కూడా పోరాడుతా. మరి బాబు మరి చంద్రబాబు ఇలా మోడీ సభలో చెప్పగలడా? మరి ఎన్డీఏ నుంచి బయటకు రాగలడా? మరి ఎందుకీ ఈ దొంగ ప్రేమ. ఒకవైపు ఎన్డీఏలోనే కొనసాగుతూ.. మరోవైపు వాళ్ల 4 శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నా కూడా.. వాళ్లతోనే జతకట్టి ఎందుకు ఎన్డీఏలో ఉన్నావు అని మీ బిడ్డ అడుగుతున్నాడు.  

ఇక్కడే నేను కొన్ని విషయాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు 4 శాతం రిజర్వేషన్లు మైనార్టీ సోదరులకు ఏదైతే ఇచ్చామో అది కేవలం మతప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కావు. ముస్లింలలో కూడా ఉన్నతవర్గాలకు రిజర్వేషన్లు వర్తించడం లేదు. పటాన్‌లకు వర్తించడం లేదు, సయ్యద్‌లకు వర్తించడం లేదు, మొగల్‌లకు కూడా వర్తించడం లేదు. ఇవి కేవలం వెనుకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చినవి.

రాజ్యాంగానికి లోబడి ఇచ్చిన రిజర్వేషన్లు.
ఇక్కడే కొన్ని విషయాలు రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మైనార్టీ సోదరులకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కావు. ముస్లింలలో కూడా రిజర్వేషన్లు వర్తించడం లేదు. పఠాన్లకు, సయ్యద్ లకు, మొఘల్ లకు కూడా వర్తించడం లేదు. ఇవి కేవలం వెనుకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చిన రిజర్వేషన్లు. ఇవాళ నేను ఇదే బీజీపీని, రిజర్వేషన్లు వ్యతిరేకించే వారిని అడుగుతున్నాను. ఒక్క ముస్లింలలో మాత్రమే కాదు, అన్నిమతాల్లో కూడా బీసీలు, ఓసీలు ఉన్నారు.  ఇవి రాజ్యాంగానికి లోబడి వెనుకబాటు ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు. మరి ఇలాంటి వెనుకబాటుకి గురైన వారికి ఇచ్చిన రిజర్వేషన్లు మీద రాజకీయం చేస్తూ.. వారి జీవితాలతో చెలగాటం ఆడటం ధర్మమేనా? ఇది కరెక్టేనా? అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.

ప్రతి మైనార్టీ సోదరుడికి, అక్కచెల్లెమ్మకు భరోసా ఇస్తున్నా..
నేను ఇవాళ ప్రతి మైనార్టీ సోదరుడికి, ప్రతి మైనార్టీ అక్కచెల్లెమ్మకి భరోసా ఇస్తూ చెబుతున్నాను. 4శాతం రిజర్వేషన్లు విషయం అయినా, ఎన్ఆర్సీ అయినా, సీఏఏ అయినా ఇంకా ఏ మైనార్టీ అంశమైనా మైనార్టీ మనోభావాలకు, వారి ఇజ్జత్ ఔర్ ఇమామ్ లకు అండగా నిలబడుతూ, వారి బిడ్డ జగన్ వారికి మద్ధతిస్తూ.. ఎప్పటికీ అండగా ఉంటాడు.
మైనార్టీల పట్ల ప్రేమ చూపుతూ ఒక్క డీబీటీ స్కీంలే కాదు.. ఇళ్ల నిర్మాణం, షాదీ తోఫావంటివి మాత్రమే కాదు, ఉర్ధూని రెండో అధికార భాషగా ప్రకటించడం మొదలు.. నలుగురు మైనార్టీలను ఎమ్మెల్సీలుగా, నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడమే కాకుండా.. ఐదేళ్లు  నా మైనార్టీ సోదరుడ్ని ఒకరిని డిప్యూటీ సీఎంగాను, నా మైనార్టీ సోదరిని శాసనమండలి వైస్ చైర్మన్ గానూ, మైనార్టీ సబ్ ప్లాన్ బిల్లు తేవడం ఇలా ప్రతి సందర్భంలోనూ వారికి సముచిత స్ధానం ఇచ్చి, వారిని పక్కనే పెట్టుకున్న ప్రభుత్వమని గర్వంగా చెబుతున్నాను. 

మొట్టమొదటిసారిగా మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్లే మాత్రమే కాదు.. 175 అసెంబ్లీ స్ధానాలుంటే అందులో 7 స్ధానాలు మైనార్టీలకు ఇవ్వడం ద్వారా.. ఈరోజు వారికి 4 శాతం రాజకీయ రిజర్వేషన్లు కూడా ఇచ్చినట్టయింది. అలా ఇచ్చిన పార్టీ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెబుతున్నాను.  

అట్టడుగు వర్గాలకు భరోసానిస్తూ...
ఈ విషయాలన్నీ కేవలం ఒకే ఒక్క విషయం చెప్పడానికి  తెలియజేస్తున్నాను. మీ బిడ్డ కులం చూడ లేదు, మతం చూడలేదు. రాజకీయాలు చూడలేదు. ఏ పార్టీకి ఓటేశారని కూడా చూడలేదు. మీ బిడ్డ పేదవాడిని పేదవాడిగానే చూశాడు. మీ బిడ్డ ఆలోచనలు ఎప్పుడూ కూడా ఇవాల పేదవాడుగా ఉన్నవాడు... రేపు పొద్దున్న పెరిగి పెద్దవాడు కావాలి. మరో 15 సంవత్సరాలలో పెద్ద పెద్ద ఉద్యోగాలలో కనిపించాలి, పేదరికం పోవాలి అని మీ బిడ్డ తపన, తాపత్రం పడ్డాడు. అందుకే మీ బిడ్డ ప్రతి అడుగులోనూ నా ఎస్సీలు, ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని, నా పేదవర్గాలు అని అంటాడు. ఎందుకో కారణం తెలుసా? ఆ నిరుపేద వర్గాలు ముఖ్యమంత్రి స్ధానంలో వ్యక్తి భరోసా ఇవ్వాలి. ఎప్పుడైతే ఆ భరోసా ఇస్తాడో అప్పుడు గ్రామం నుంచి రాష్ట్రం వరకు ఆ ఆత్మగౌరవం పెరుగుతుంది.. కాబట్టి ముఖ్యమంత్రి అనేవాడు నిలబడాలి.

మంచి చేశానని గర్వంగా మీ బిడ్డ చెప్పగలుగుతున్నాడు.
ఈ రోజు మీ బిడ్డ ప్రతి పేదవాడికి మంచి చేశామని, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించామని గర్వంగా చెబుతున్నాడు.  ఇదొక్కటే కాదు ఇంకో విషయం కూడా సగర్వంగా చెబుతాను. మీ బిడ్డ చేసిన మంచే చూపిస్తున్నాడు. మీ బిడ్డ నలుగురిలో నిలబడగలుగుతున్నాడు. కళ్లల్లో కళ్లు పెట్టి చూడగలుగుతున్నాడు.  మీ బిడ్డ వల్ల మీ కుటుంబంలో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడండి అని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాడు. పిలుపునివ్వగలుగుతున్నాడు. 

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేదలకు గుర్తుండే విధంగా ఒక్కటంటే ఒక్క మంచీ కనిపించదు. పేదలకు గుర్తుండే విధంగా చేసిన ఒక్కటంటే ఒ    క్క స్కీమూ కనిపించదు. చంద్రబాబు మేనిఫెస్టో ఓ మాయలు, ఓ మోసాలు. ఎన్నికలప్పుడు మాత్రం చంద్రబాబుకునాయుడుకి ప్రజలు గుర్తుకువస్తారు. మేనిఫెస్టో గుర్తుకు వస్తుంది. మాయలు గుర్తుకువస్తాయి. అబద్దాలు, మోసాలు గుర్తుకు వస్తాయి. ఒక్కసారి అధికారం వచ్చిన తర్వాత మాత్రం ఆయనలో ఉన్నచంద్రముఖి నిద్రలేస్తుంది. 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి పేదలకు గుర్తుండిపోయేలా తాను చేసిన ఒక్క మంచీ చెప్పలేకపోతున్నాడు. గుర్తుండిపోయేలా ఒక్క స్కీమూ చెప్పలేకపోతున్నాడంటే ఆయన ఎన్నిసార్లుపేదలను మోసం చేశాడన్నదానికి నిదర్శనం ఇది కాదా ?

చంద్రబాబు విఫల హామీలు.
ఇదే చంద్రబాబు మేనిఫెస్టో మాయలు, మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీకు చూపిస్తాను. 2014లో (టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ) ఇదే చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి.. ఇదే కూటమిలో.. ఇదే ముగ్గురు ఈ పాంప్లెట్ ను ప్రతి ఇంటికీ పంపించారు. 2014లో ముఖ్యమైన హామీలంటూ మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా.. ఈ పాంప్లెట్ ను ఆయన సంతకం, ఈ ముగ్గురి ఫోటోలతో మీ ప్రతి ఇంటికీ పంపించాడు. ఆ తర్వాత ప్రజలు నమ్మారు. ప్రజలు నమ్మి ఈయన్ను ఎన్నుకున్నారు. 2014 నుంచి 2019 వరకు ఈయన ముఖ్యమంత్రిగా చేశారు. 2014లో ఈయన సంతకం పెట్టి మేనిఫెస్టో అంటూ సంతకం పెట్టి ప్రతి పేద ఇంటికీ ఇది పంపించి... ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశారా అని మీరు ఆలోచించమని కోరుతున్నాను.
ఇందులో చెప్పినవి... రైతు రుణమాఫీపై ఈ పెద్ద మనిషి మొదటి సంతకం చేస్తానన్నాడు. నేను అడుగుతున్నాను. 

రూ.87,612 కోట్ల రుణాల మాఫీ అన్నాడు. రైతన్నలకు..జరిగిందా? రెండో హామీ పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తా అని చెప్పాడు. రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేసాడా అని అడుగుతున్నాను.
మూడో హామీ ఆడబిడ్డ పుడితే మహలక్ష్మి పథకం అనిరూ. 25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తానన్నాడు. రూ.25వేలు కథ దేవుడెరుగు కనీసం ఒక్క రూపాయి అయినా మీ బ్యాంకు ఖాతాల్లో వేశాడా అని అడుగుతున్నాను. 

ఇంటింటికీ ఉద్యోగం అన్నాడు.. ఉద్యోగం ఇవ్వలేకపోతే రూ.2వేలు నిరుద్యోగభృతి ప్రతి నెలా అన్నాడు. ఐదు సంవత్సరాలు అంటే 60 నెలలు, నెలకు రూ.2 వేలు అంటే ప్రతి ఇంటికీ రూ.1,20,000. ఇచ్చాడా అని అడుగుతున్నాను. 
అర్హులైన వాళ్లందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు, నేను అడుగుతున్నాను... ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కదా..మీలో ఏ ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని అడుగుతున్నాను.
 
రూ. 10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్లూమ్ రుణాల మాఫీ అన్నాడు జరిగిందా..? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తానన్నాడు చేశాడా? సింగపూర్ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు జరిగిందా? ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తా అన్నాడు జరిగిందా?...మన నెల్లూరులో కనిపిస్తోందా? 

మరి ఈ సారి మిమ్నల్ని అందరినీ ఒకటే అడుగుతున్నాను. ఏకంగా చంద్రబాబు సంతకం పెట్టి 2014లో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా? 

మళ్లీ ఇప్పుడు ఇదే ముగ్గురు కూటమిగా ఏర్పడ్డారు. కూటమిగా ఏర్పడి మళ్లీ మేనిఫెస్టోల డ్రామా.సూపర్ సిక్స్ అంటున్నారు, నమ్ముతారా? అక్కా నమ్ముతారా?  సూపర్ సెవెన్ అంట నమ్ముతారా?  ఇంటింటికీ బెంజ్ కార్ అంట నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం అంట...నమ్ముతారా?

ఆలోచన చేయండి... రాజకీయాలు ఏ స్ధాయికి దిగజారిపోయాయో ఆలోచన చేయమని అడుగుతున్నాను. విలువలు, విశ్వసనీయతలు 
ఒక మనిషిలో ఉండాలి. ఈ విలువలు, విశ్వసనీయత లేని ఈ రాజకీయ వ్యవస్ధ ప్రక్షాళనకు ఎప్పుడు లోనైంది అంటే.. అది కేవలం ఈ 59 నెలల కాలంలో, మీ బిడ్డ పాలనలోనే జరిగింది. 
ఈ మాటలు చెబుతూ... 

వివక్ష లేని పాలనకు ఫ్యాను గుర్తుకే ఓటేయండి.
వాలంటీర్లు మళ్లీ మీ ఇంటికి రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ మారాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన హాస్పిటళ్లు, మన వ్యవసాయం మెరుగుపడాలన్నా... ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? రెండు బటన్లు.. రెండు బటన్లు అన్నా.. రెండు బటన్లు తమ్ముడు, రెండు బటన్లు చెల్లీ ఫ్యాన్‌ మీద నొక్కాలి. 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?. 

మన గుర్తు.. అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు తెలియని వారెవరైనా ఉంటే... అన్నా మన గుర్తు ఫ్యాను. అవ్వా మన గుర్తు ఫ్యాను. పచ్చచీర కట్టుకున్న అవ్వా మన గుర్తు ఫ్యాను. పెద్దమ్మా మన గుర్తు ఫ్యాను. చెల్లి మన గుర్తు ఫ్యాన. కళ్లజోడు అవ్వా మన గుర్తు ఫ్యాను. 

మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింకులోనే ఉండాలి. 
 
ఇవన్నీ ఒకవైపు చెబుతూ.. మీ అందరికీ ఖలీల్ అహ్మద్ ను పరిచయం చేస్తున్నాను. మన పార్టీ తరపున నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా , నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి,  నెల్లూరు ఎంపీ అభ్యర్ధిగా సాయిరెడ్డి పోటీ చేస్తున్నారు. 
మన పార్టీ అభ్యర్ధులపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచాల్సిందిగా మీ బిడ్డ సవినయంగా రెండు చేతులు జోడించి పేరుపేరునా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాడు అని తెలియజేస్తూ సీఎం వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు. 

Back to Top