ఎర్రన్నాయుడు మృతికి షర్మిల సంతాపం

ఉరవకొండ:

తెలుగు దేశం పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు దుర్మరణం చెందడం విచారకరమని వైయస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మరో ప్రజా ప్రస్థానం నుంచి ఆమె ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపీగా ఆయన పనిచేశారన్నారు. కుటుంబ పెద్ద చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తమకు తెలుసునని పేర్కొంటూ ఆమె ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఎర్రన్నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మనో నిబ్బరంతో ఉండాలని ఆయన కుటుంబ సభ్యులను షర్మిల కోరారు.

Back to Top