సాక్షి టీవీ 'హెడ్‌లైన్‌షో'లో చర్చహైదరాబాద్, 29 ఆగస్టు 2012 : పెద్ద చదువు'కొన'లేని పేద విద్యార్థుల కోసం దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్సుమెంట్ ప్రవేశపెడితే, ప్రస్తుత ప్రభుత్వ చర్యలు విద్యార్థులను చదువుకు దూరం చేసేలా ఉన్నాయని సీనియర్ విశ్లేషకులు, వివిధ రాజకీయ పక్షాల నేతలు అభిప్రాయపడ్డారు. ఫీజు రీయింబర్సుమెంట్‌పై ప్రభుత్వ నిర్ణయం అంశంపై సాక్షి టీవీ బుధవారం ఉదయం నిర్వహించిన హెడ్‌లైన్‌షో చర్చలో పై విధంగా అభిప్రాయం వ్యక్తం చేశారు.ప్రభుత్వ చర్యల వల్ల మంచి ర్యాంకు వచ్చిన పేద విద్యార్థులు మెరిట్ కాలేజీల్లో చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే అన్ని కాలేజీలను ఉన్నతంగా తీర్చిదిద్దితే సమస్యే ఉండదని టీఆర్ఎస్ అభిప్రాయపడింది. ప్రభుత్వం మాత్రం విద్యార్థులు, తల్లిదండ్రులను గందరగోళంలోకి నెట్టేసిందని సీనియర్ జర్నలిస్టు ప్రసాద్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. హెడ్‌లైన్‌షో చర్చ మధ్యలో వివిధ ప్రాంతాల విద్యార్థులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు.