పొదిలిః వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్.జగన్‌మోహనరెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుందని విద్యార్ధి విభాగం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి కందుల రాజశేఖర్ అన్నారు. మండలంలోని కుంచేపల్లిలో జరిగిన వైయస్‌ఆర్ కుటుంబం కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని సర్పంచ్ కొమ్మసాని కృష్ణారెడ్డి ప్రారంభించారు. స్వచ్ఛందంగా యువకులు సభ్యత్వం కోసం ముందుకు వస్తున్నారని తెలిపారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ వైయస్‌ఆర్ స్టిక్కర్లను దర్వాజాలకు అంటించారు. నవరత్నాల పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల ప్రచార కమిటీ అధ్యక్షులు వెలుగోలు కాశీ, పేరం నాగిరెడ్డి, కొమ్మసాని అశోక్‌రెడ్డి, రవికుమార్, విఘ్ణేశ్వర్, కె.శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.<br/>