ఉరవకొండ: వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలతో పేదల కష్టాలు తీరుతాయని ఆపార్టీ పట్టణ కన్వీనర్ చెంగలమహేష్ తెలిపారు. శనివారం ఉరవకొండ పట్టణంలోని శిలార్‌వీధి, బెస్త కాలనీల్లో పార్టీ నాయకులు గడప గడపకు వెళ్ళి నవరత్నాల పథకాలపై విస్తృతంగా ప్రచారం చేశారు. ఈసందర్బంగా పార్టీ మైనార్టీ విభాగం నాయకులు జీఎంఎస్ హఫీజ్, శర్మాస్, అయ్యర్‌దాదాల అధ్వర్యంలో మైనార్టీలు పెద్ద ఎత్తున వైయస్‌ఆర్ కుటుంబంలో పాల్గొన్నారు. నాయకులు వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే పేదల సమస్యల పరిష్కారానికి ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాధాన్యత ఇస్తారన్నారు. వైయస్‌ఆర్‌సీపీ నాయకులకు ఆయా వార్డు ప్రజలు తమ సమస్యలను చెప్పుకున్నారు. ప్రచార కార్యక్రమంలో వార్డు సభ్యులు ఈడిగప్రసాద్, పాటిల్ నిరంజన్‌గౌడ్, లత్తవరంగోవిందు, శేఖర్, షబ్బీర్‌లు పాల్గొన్నారు.<br/>