నవరత్నాలతోనే పేదలకు న్యాయం

యనమలకుదురు (పెఎనమలూరు)ః మహానేత వైయస్‌.రాజశేఖరరెడ్డి ఆశయాలు సాధించాలంటే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహనరెడ్డి ప్రకటించిన నవరత్నాలతోనే సాధ్యమౌతుందని మండల బీసీసెల్‌ విభాగం అధ్యక్షుడు మరీదు శ్రీనివాసరావు అన్నారు. యనమలకుదురులో సోమవారం 4 వ వార్డులో వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... టీడీపీ ఓట్లు వేయించుకుని ప్రజలను దగా చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ పధకాలు టీడీపీ నాయకులకే అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నేతలు ఈడేగోపాలకృష్ణ, చనపతిరాము,ఎండి.ముస్తాఫా, బాషా పలువురు పాల్గొన్నారు

Back to Top