మీ ఓటు దేనికి?

 నిజాలే మాట్లాడటం సీఎం వైయ‌స్‌ జగన్‌ విధానం  

చెప్పిన అబద్ధమే వంద సార్లు చెప్పడం చంద్రబాబు పద్ధతి

నైతిక విలువలతో రాజకీయాలు చేస్తున్న సీఎం వైయ‌స్‌ జగన్‌ 

ఫక్తు వ్యాపారంగా మార్చేసిన చంద్రబాబు 

సీఎం వైయ‌స్‌ జగన్‌ ఇచ్చిన మాటపై నిలబడే రకం 

నమ్మించి నట్టేట ముంచడం చంద్రబాబు నైజం 

నిజమైన విజనరీ జననేత వైయ‌స్‌ జగన్‌..  

ఎల్లో మీడియా చిత్రీకరించిన నకిలీ విజనరీ బాబు

సంస్కరణలతో సీఎం వైయ‌స్‌ జగన్‌ సుపరిపాలన  

చంద్రబాబు పాలన ఆద్యంతం అక్రమార్జన 

పరిపాలన దక్షతతో కరోనా మహమ్మారిపై వైయ‌స్ జగన్‌ జయభేరి 

చంద్రబాబు ప్రచార పిచ్చితో హుద్‌హుద్‌ బాధితులకు ఇక్కట్లు.. విభజిత రాష్ట్రాన్ని దోపిడీతో ఆర్థికంగా ఛిద్రం చేసిన చంద్రబాబు 

బాబు తీరుతో గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టిన ఘనత సీఎం వైయ‌స్ జగన్‌దే 

ఈ ఐదేళ్లలో ఏ రంగం తీసుకున్నా స్పష్టమైన మార్పు

సీఎం వైయ‌స్ జగన్‌ వ్యక్తిత్వం
సీఎం వైయ‌స్‌ జగన్‌ నిజాలే మాట్లాడతారు. అబద్ధాలు చెప్పరు. చేయగలిగిందే చెప్పడం.. ఇచ్చిన మాటకు కట్టుబడటం.. దాన్ని నిలబెట్టు కోవడం కోసం ఎందాకైనా పోరాటం చేయడం.. జనంతో మమేకమవడం సీఎం జగన్‌ విధానం. మిగిలిన సమయాన్ని కుటుంబంతో గడుపుతారు. ప్రైవేటు జీవితం అంటూ సీఎం జగన్‌కు లేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడూ.. అధికారంలోకి వచ్చాక కూడా ఇదే విధానం.

 తన తండ్రి, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణించాక.. ఆ వార్త విని తాళలేక గుండె పగిలి మరణించిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు ఓదార్పు యాత్ర చేపట్టారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాం«దీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుమ్మక్కై అక్రమ కేసులు బనాయించి.. 16 నెలలపాటు జైల్లో అక్రమంగా నిర్బంధించినా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం సీఎం జగన్‌ వెనక్కి తగ్గలేదు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటాలు చేశారు.

ప్రతిపక్ష నేతగా ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో 14 నెలలపాటు ప్రజల్లోనే గడిపారు. అధికారంలోకి వచ్చాక.. రోజువారీ పరిపాలన.. సమీక్షలు, ప్రజలతో మమేకమవడం.. మిగిలిన సమయం కుటుంబంతో గడపడం సీఎం దినచర్య. కుటుంబ రాజకీయాలకు సీఎం జగన్‌ వ్యతిరేకం. వీటి వల్ల అనవసరమైన ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నది సీఎం జగన్‌ నిశి్చతాభిప్రాయం.

చంద్రబాబు వ్యక్తిత్వం
మచ్చుకైనా నిజాన్ని చెప్పకపోవడం.. ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పడం ద్వారా నిజం చేయవచ్చునన్నది చంద్రబాబు విధానం. సెల్‌ ఫోన్‌ను నేనే కనిపెట్టా.. కంప్యూటర్‌ను నేనే తెచ్చా.. హైదరాబాద్‌ను నేనే కట్టా.. అంటూ బీరాలు పలకడమే అందుకు నిదర్శనం. ఇచ్చిన మాటకు కట్టుబడకపోవడం.. ఎనీ్టఆర్‌కు వెన్నుపోటు పొడవడంలో సహకరించిన కుటుంబ సభ్యులు హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు వంటి వారితోపాటు ఎవరినైనా నమ్మించి నట్టేట ముంచడం చంద్రబాబు నైజం.

వారసత్వ రాజకీయాలకు.. కుటుంబ రాజకీయాలకు చంద్రబాబు ఆద్యుడు. సర్పంచుగా కూడా గెలవని తన కుమారుడు నారా లోకేశ్‌ను 2017లో ఏకంగా మంత్రిని చేసి.. నాలుగు కీలక శాఖలను కట్టబెట్టారు. వియ్యంకుడు బాలకృష్ణను హిందూపురం శాసనసభ స్థానం.. లోకేశ్‌ తోడల్లుడు భరత్‌ను విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దించారు. 

సీఎం జగన్‌
ఓదార్పు యాత్ర నుంచి ప్రజాసంకల్ప పాదయాత్ర వరకు నిత్యం జనంతో మమేకమవుతూ వచ్చిన వైఎస్‌ జగన్‌.. ప్రజా సమస్యలను, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను గుర్తించారు. విద్య, వైద్యం కోసం అధిక శాతం కుటుంబాలు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవడం వల్ల రుణాల ఊబిలో కూరుకుపోతున్నారని పసిగట్టారు. అధికారంలోకి వచ్చాక సమస్యలను పరిష్కరించి మెరుగైన సమాజాన్ని నిరి్మంచడమే లక్ష్యంగా.. రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా రూపొందించుకున్న ప్రణాళికలను అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా డబ్బులను పేదలకు పంచి పెడుతున్నారని పెత్తందార్లు చేస్తున్న విమర్శల్లో అర్థం లేదు. సీఎం జగన్‌ ప్రారంభించిన ప్రతి పథకానికి ఒక లక్ష్యం ఉంది. ఆర్థిక వేత్తలంతా ఇదే సరైన విధానమని ప్రశంసిస్తున్నారు. 

విద్యారంగం
⇒ ప్రజాసంకల్ప పాదయాత్రలో పేదరికంతో పిల్లలను చదివించలేని తల్లిదండ్రుల పరిస్థితిని గమనించారు. ప్రతి ఇంట్లో ప్రతి అబ్బాయి.. అమ్మాయి ఉన్నత చదువులు చదివితే.. ఉద్యోగాలు, ఉపాధి పొందుతారని, అప్పుడు ఆ కుటుంబం పేదరికాన్ని అధిగమిస్తుందని భావించారు. మీ పిల్లలను బడికి పంపితే చాలు అమ్మ ఒడి పథకం కింద ఏడాదికి తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తానని మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి.. కార్పొరేట్‌ స్థాయికి దీటుగా అభివృద్ధి చేశారు. ఇంగ్లిష్‌ మీడియం భోదనను, సీబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రవేశపెట్టారు.  
 

⇒ నాణ్యమైన పౌష్టికాహారాన్ని, మధ్యాహ్న భోజనం, చిక్కీని అందించేందుకు గోరుముద్ద పథకాన్ని ప్రారంభించారు. పాఠశాల తెరిచిన రోజే పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగ్, బూట్లు, సాక్స్‌లను విద్యా కానుక కింద పిల్లలకు అందిస్తున్నారు. మూడో తరగతి నుంచే టోఫెల్‌ శిక్షణ ఇస్తున్నారు. తద్వారా పిల్లలను పాఠశాలలకు పంపడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి సగటు నమోదు నిష్పత్తి (జీఈఆర్‌) 2018 నాటికి 84.48 శాతం ఉంటే.. ఇప్పుడు వంద శాతానికి చేరుకుంది. అంటే.. బడి ఈడు పిల్లలందరూ బడుల్లోనే ఉండాలన్న లక్ష్యం సాధించారు. పిల్లల చదువుల కోసం సీఎం జగన్‌ తీసుకుంటున్న చర్యలను బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడుతున్న ప్రముఖ సంఘ సంస్కర్త, నోబెల్‌ శాంతిపురష్కార గ్రహీత, రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత కైలాస్‌ సత్యార్థి దేశ, అంతర్జాతీయ వేదికలపై ప్రశంసించారు.  
 

⇒ అంతర్జాతీయ స్థాయిలో మన పిల్లలు పోటీ పడేలా చేయాలనే లక్ష్యంతో సీఎం జగన్‌.. ఐబీ (ఇంటర్నేషనల్‌ బకలారియేట్‌) సిలబస్‌ను 2025 జూన్‌ నుంచి ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. 2035 నాటికి పదో తరగతి పరీక్షలు ఐబీ సిలబస్‌లో మన విద్యార్థులు రాస్తారు. ఆ తర్వాత ఉన్నత విద్యను ఐబీ సిలబస్‌లోనే ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్, కేంబ్రిడ్జి, ఎంఐటీ, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ వంటి యూనివర్సిటీల ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో అభ్యసించనున్నారు. ఆ సరి్టఫికెట్లతో బయటకొచ్చిన మన విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు కార్పొరేట్‌ సంస్థలు క్యూ కట్టడం ఖాయం. 
 

⇒ ప్రాథమిక స్థాయి నుంచి విద్యారంగాన్ని పటిష్టం చేస్తున్న సీఎం జగన్‌.. బీటెక్, ఎంటెక్, ఎంబీబీఎస్‌ వంటి ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు విద్యాదీవెన పథకం ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్నారు. వసతి, భోజన ఖర్చుల కోసం వసతి దీవెన కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తున్నారు. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా చూశారు. బీటెక్, ఎంటెక్‌ వంటి ఉన్నత చదువులు చదివిన విద్యార్థులకు నైపుణ్యాలను పెంచుతూ శిక్షణ ఇస్తున్నారు. దాంతో 2022–23లో క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా గరిష్టంగా 1.80 లక్షల మంది విద్యార్థులు కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగాలు పొందారు. 

ఎవరు విజనరీ?
వైద్య రంగం  
⇒ ఇంట్లో ఒకరికి జబ్బు చేస్తే.. చికిత్స కోసం చేసిన అప్పులు తడిసి మోపెడై ఇబ్బందులు పడుతున్న లక్షలాది కుటుంబాలను పాదయాత్రలో గుర్తించిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక నిర్జీవమైన ఆరోగ్యశ్రీకి జీవం పోశారు. ఆరోగ్యశ్రీలో చికిత్స విధానాలను 1,059 నుంచి 3,257కి పెంచారు. రూ.25 లక్షల వరకు వైద్య ఖర్చుల పరిమితిని పెంచారు. చికిత్స వ్యయం రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీని వర్తింపజేశారు. ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ఆరోగ్య ఆసరా కింద నెలకు గరిష్టంగా రూ.5 వేలను సహాయంగా అందిస్తూ జీవనోపాధులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. తద్వారా ప్రజారోగ్యానికి భరోసా కల్పించారు.  
 

⇒ నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను కల్పించి, కార్పొరేట్‌ స్థాయికి అభివృద్ధి చేశారు. ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు ఖాళీ ఉండడానికి వీలు లేకుండా చర్యలు తీసుకుని.. 54 వేల పోస్టులను భర్తీ చేశారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ ఆవిష్కరణే లక్ష్యంగా ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి.. ప్రజల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు.  
 

⇒  బీపీ, షుగర్, ఇతర అనారోగ్య సమస్యలను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి.. చికిత్సలు అందిస్తున్నారు. తద్వారా ప్రజలు గుండె, మెదడు, కిడ్నీ, క్యాన్సర్‌ వంటి ఇతర పెద్ద జబ్బుల బారిన పడకుండా నియంత్రిస్తున్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక మెడికల్‌ కాలేజ్‌ చొప్పున.. కొత్తగా 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టారు. వందేళ్ల చరిత్రలో రాష్ట్రంలో 11 మెడికల్‌ కాలేజీలు ఉంటే.. మూడేళ్ల వ్యవధిలోనే కొత్తగా 17 కాలేజ్‌లను అందుబాటులోకి తెస్తున్నారు. తాజాగా రాజంపేటలో మరో కాలేజీ నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఐదు కాలేజీలు గతేడాది ప్రారంభమయ్యాయి. వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు కాలేజీలు ప్రారంభించనున్నారు. 

వ్యవసాయ రంగం 
⇒ రాష్ట్రంలో 70 శాతం ప్రజల జీవనాధారం వ్యవసాయం. పాదయాత్రలో రైతులు పడుతున్న వెతలను కళ్లారా చూసిన వైఎస్‌ జగన్‌.. పంట పండినా, ఎండినా కర్షకులకు నష్టం లేకుండా చేయడం ద్వారా వ్యవసాయాన్ని పండుగగా మార్చాలని నిర్ణయించారు. అధికారంలోకి వచ్చాక విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు గ్రామ స్థాయిలో ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు) వ్యవస్థను తీసుకొచ్చారు. 
 

⇒నకిలీలకు తావులేకుండా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు రైతు ముంగిటకు అందించారు. ఇచ్చిన హామీ కంటే మిన్నగా రైతు భరోసా కింద ప్రతి ఏటా పెట్టుబడి సహాయం అందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత పంటల బీమా, తొమ్మిది గంటలపాటు పగటిపూటే ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ అందించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఆ సీజన్‌ ముగిసేలోగా పరిహారం అందించి దన్నుగా నిలబడటం ద్వారా వ్యవసాయాన్ని పండుగగా చేశారు. దేశ జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 16 శాతం ఉంటే.. రాష్ట్ర వ్యవసాయ రంగం వాటా 36 శాతంపైనే (దేశంలో రెండో స్థానం) ఉండటమే అందుకు తార్కాణం. రాష్ట్రంలో సీఎం జగన్‌ అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలను ఐక్యరాజ్య సమితి, నీతి ఆయోగ్, నాబార్డు, ప్రపంచ బ్యాంకు ప్రశంసించాయి.  

పారిశ్రామిక రంగం  
⇒ పాదయాత్రలో ఉద్యోగం, ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న యువత కష్టాలను తెలుసుకున్న వైఎస్‌ జగన్‌.. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించి, నిరుద్యోగాన్ని తగ్గించాలని నిర్ణయించారు. అధికారం చేపట్టాక విప్లవాత్మక సంస్కరణల ద్వారా సులభతర వాణిజ్యం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌)లో ఏటా రాష్ట్రాన్ని దేశంలో నంబర్‌ వన్‌ స్థానంలో నిలిపారు. ఎంఎస్‌ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్య చిన్నతరహా పరిశ్రమలు)లకు ప్రోత్సాహకాలు ఇచ్చి, చేయిపట్టి నడిపించారు. దాంతో 2018–19 నాటికి రాష్ట్రంలో 1.9 లక్షలు ఉన్న ఎంఎస్‌ఎంఈలు ఇప్పుడు ఏడు లక్షలకు చేరుకున్నాయి. 
 

⇒ పారదర్శక పారిశ్రామిక విధానం వల్ల టాటాలు, బిర్లాలు, అదానీ, అంబానీ, భజంకా, భంగర్, సింఘ్వీ, మిట్టల్‌ వంటి పారిశ్రామిక దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు పోటీలు పడుతున్నాయి. ఐదేళ్లలో రూ.3,02,085 కోట్ల పెట్టుబడులు కార్యరూపం దాల్చాయి. టీడీపీ సర్కార్‌ హయాంలో కేవలం రూ.59,970 కోట్ల పెట్టుబడులే రావడం గమనార్హం. ఎంఎస్‌ఎంఈలు, భారీ పరిశ్రమల వల్ల కొత్తగా 15.88 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. రాష్ట్రంలో పీఎఫ్‌ ఖాతాల సంఖ్య 2018–19 నాటికి 44.85 లక్షలు ఉంటే.. 2022–23 నాటికి 60.73 లక్షలకు పెరగడమే అందుకు నిదర్శనం.  
 

⇒ రాష్ట్రానికి 974 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా పారిశ్రామికాభివృద్ధి వేగవంతం చేయడం కోసం సీఎం జగన్‌ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. కొత్తగా నాలుగు పోర్టులు (మూలపేట, కాకినాడ గేట్‌వే, మచిలీపట్నం, రామాయపట్నం), పది ఫిషింగ్‌ హార్బర్లు, ఆరు ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్లను నిరి్మస్తున్నారు. మూడు పారిశ్రామిక కారిడార్లు (వైజాగ్‌–చెన్నై, చైన్నై–బెంగళూరు, హైదరాబాద్‌–బెంగళూరు), పది ఇండస్ట్రియల్‌ నోడ్స్‌ను నిర్మిస్తున్నారు. అప్పుడే రామాయపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లో ఇండోసోల్‌ పరిశ్రమల ఉత్పత్తులను ప్రారంభించడం గమనార్హం. 

సేవా రంగం 
⇒ హైదరాబాద్, బెంగుళూరు వంటి మెట్రోపాలిటన్‌ నగరాలతో పోటీ పడే నగరం రాష్ట్రంలో లేకపోయినా ఇన్ఫోసిస్, రాండ్‌స్టాడ్, అదానీ డేటా సెంటర్, బీఈఎల్, అమెజాన్‌ వంటి ఐటీ పరిశ్రమలను సీఎం జగన్‌ రాష్ట్రానికి రప్పించారు. ఐటీ పరిశ్రమల వల్ల 59 నెలల్లో రాష్ట్రంలో 47,908 మందికి ఉద్యోగాలు వచ్చాయి. విశాఖపట్నంలో రూ.పది వేల కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పిస్తే హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రోపాలిటన్‌ నగరాలతో పోటీ పడే స్థాయికి చేరుకుంటుంది. అప్పుడు భారీ ఎత్తున విశాఖపట్నంకు ఐటీ పరిశ్రమలతోపాటు అంతర్జాతీయ ప్రతిష్టాత్మక హోటల్స్‌ వంటివి వస్తాయి. తద్వారా సేవా రంగం ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది.  

చంద్రబాబు  
ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఏలేరు భూ కుంభకోణం నుంచి ఐఎంజీ భారత్‌ కుంభకోణం వరకు అనేక స్కాంలకు పాల్పడ్డారు. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం చంద్రబాబును ఎల్లో మీడియా విజనరీగా చిత్రీకరిస్తూ వచ్చింది. దాన్ని అందిపుచ్చుకున్న చంద్రబాబు విభజన తర్వాత తానో విజనరీ అంటూ ఊదరగొడుతూ వస్తున్నారు. రామోజీరావుకు చెందిన ఈటీవీకి ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో తానో విజనరీనని సెల్ఫ్‌ సర్టిఫికెట్‌ ఇచ్చుకున్నారు. అమరావతిలో ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించేందుకు సెంట్రల్‌ కూలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించానని 
చంద్రబాబు చెప్పడంతో మీడియా ప్రతినిధి నిర్ఘాంతపోయారు.  
 

విద్యా రంగం  
2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పలుమార్లు వివిధ వేదికలపై మాట్లాడుతూ విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత కాదని ప్రకటించారు. నారాయణ వంటి ప్రైవేటు విద్యా సంస్థలు అడ్డగోలు ఫీజులతో దోచుకోవడం.. పంచుకోవడమే చంద్రబాబు విజన్‌. ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం జగన్‌ ఇంగ్లిష్‌ మీడియం బోధనను ప్రవేశపెడితే.. తెలుగు మీడియంలోనే బోధన సాగాలని అడ్డుకునే దుస్సాహసం చేసిన విజనరీ చంద్రబాబు. ఫీజు ఎంతైనా కేవలం రూ.35 వేల రీయింబర్స్‌ మాత్రమే చేస్తామంటూ చంద్రబాబు షరతులు విధించడంతో.. వేలాది మంది విద్యార్థులు మిగతా ఫీజు చెల్లించలేక ఉన్నత చదువులు మానేశారు.  

వైద్య రంగం  
మౌలిక సదుపాయాలు కల్పించకుండా.. ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వ ఆస్పత్రులను చంద్రబాబు భ్రష్టు పట్టించారు. ఆరోగ్యశ్రీని నీరుగార్చారు. బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు చేసేందుకు ప్రైవేటు ఆస్పత్రులు నిరాకరించడంతో పేదలు తల్లడిల్లిపోయారు. వైద్యం కోసం లక్షలకు లక్షలు అప్పులు చేసిన లక్షలాది కుటుంబాలు అప్పుల పాలై రోడ్డున పడేలా చేసిన విజనరీ చంద్రబాబు. 

పారిశ్రామిక రంగం  
రాష్ట్రంలో 2014–19 మధ్య చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా తీరం మన బలం.. 974 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతాన్ని ఉపయోగించుకుని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానంటూ బీరాలు పలికారు. కానీ.. ఐదేళ్లలో కనీసం ఒక్క పోర్టు కడతామనిగానీ.. ఒక ఫిషింగ్‌ హార్బరైనా నిర్మిద్దామనిగానీ ఆలోచన చేయని విజనరీ చంద్రబాబు. 

సేవా రంగం  
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలకు తెరతీశారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఆ సమయంలోనే అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నేదరుమల్లి జనార్ధనరెడ్డి హైటెక్‌ సిటీకి శంకుస్థాపన చేశారు. కానీ.. హైటెక్‌ సిటీని తానే నిర్మించినట్లు చంద్రబాబు ఇప్పటికీ అబద్ధాలు వల్లె వేస్తుంటారు. హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దినట్లు బీరాలు పలుకుతుంటారు. కానీ.. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు అధికారం కోల్పోయే నాటికి 2003–04 నాటికి ఐటీ ఎగుమతుల విలువ కేవలం రూ.5,025 కోట్లు మాత్రమే.
 

కానీ.. మహానేత వైఎస్సార్‌ అధికారం చేపట్టిన తర్వాత ఐటీ ఎగుమతులు ఏటా సుమారు రెట్టింపు వృద్ధిని నమోదు చేస్తూ 2009–10 నాటికి రూ.33,482 కోట్లకు చేరాయి. అంటే వైఎస్సార్‌ హయాంలో ఐటీ ఎగుమతులు 566 శాతం పెరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో 900 ఐటీ కంపెనీలు వస్తే.. వైఎస్సార్‌ ఐదేళ్ల పాలనలో ఏకంగా 1,400కు పైగా కంపెనీలు రావడం గమనార్హం. చంద్రబాబు హయాంలో ఐటీ రంగం ద్వారా 85,000 మందికి ఉపాధి లభిస్తే.. వైఎస్సార్‌ హయాంలో 2,85,000 దాటింది. విభజన తర్వాత రాష్ట్రంలో 2014–19 మధ్య ఐటీ పరిశ్రమల వల్ల వచ్చిన ఉద్యోగాల సంఖ్య కేవలం 27,643 మాత్రమే.  

విశ్వసనీయత సీఎం జగన్‌ 
⇒ ‘రాజకీయ నాయకుడు విశ్వసనీయత కోల్పోతే.. రాజకీయాలలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం లేకపోతే రాజకీయాలు ఎందుకు చేయడం? ఎవరి కోసం? దేనికోసం?’ అంటారు సీఎం జగన్‌. చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి ఇంట్లో తన ఫొటో.. ప్రతి పేదవాడి గుండెల్లో తాను బతికి ఉండాలన్నదే సీఎం జగన్‌ సిద్ధాంతం. అమలు చేయగలిగిన హామీలు మాత్రమే ఇవ్వడం.. ఇచ్చిన మాటకు కట్టుబడటం సీఎం జగన్‌ నైజం. 
 

⇒ విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు ప్రకటించిన సందర్భంలో.. వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేయోభిలాషులు పలువురు రూ.50 వేల వరకు రుణ మాఫీ ప్రకటించాలని వైఎస్‌ జగన్‌పై ఒత్తిడి తెచ్చారు. ఆచరణ సాధ్యం కాని హామీని తాను ఇవ్వలేనని అప్పట్లో వైఎస్‌ జగన్‌ తేల్చి చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన అలవికాని హామీల వల్ల కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో వైఎస్‌ జగన్‌ అప్పట్లో అధికారంలోకి రాలేకపోయారు.  
 

⇒  2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారు. ఇది సీఎం జగన్‌ చెప్పాడంటే చేస్తాడంతే అన్న నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుపోవడానికి దారితీసింది. ప్రస్తుత ఎన్నికల్లో కూడా అమలు చేయదగిన హామీలతోనే ఎన్నికల మేనిఫెస్టోను సీఎం జగన్‌ విడుదల చేశారు.  

చంద్రబాబు 
 

⇒ మోసమే ఆస్తిగా.. వెన్నుపోటే పెట్టుబడిగా రాజకీయాల్లో ఎదిగిన నేత చంద్రబాబు. ఎన్నికలప్పుడు అలవికాని హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కి ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజం. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాక 1999 ఎన్నికల్లో కోటి మందికి ఉపాధి, 35 లక్షల ఇళ్లు నిరి్మస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. వాజ్‌పేయిపై వీచిన సానుభూతి పవనాల్లో అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు.  
 

⇒ విభజన నేపథ్యంలో చంద్రబాబు 2014 ఎన్నికల్లో వ్యవసాయ రుణాలు మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి వంటి 650 హామీలు ఇచ్చారు. మోదీ ప్రభంజనంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిన ఘనత ఈ పెద్దమనిíÙదే. చెప్పిన మాటకు కట్టుబడి ఉండకపోవడం చంద్రబాబు నైజం. చంద్రబాబు అంటే మోసం చేస్తాడనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది.  

నైతిక విలువలు 
సీఎం జగన్‌: నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్నది సీఎం జగన్‌ విధానం. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణించాక.. ఆ మరణవార్త విని గుండెలు పగిలి మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని వైఎస్‌ జగన్‌ అప్పట్లో మాట ఇచ్చారు. ఓదార్పు యాత్ర చేపట్టడానికి కాంగ్రెస్‌ నిరాకరించడంతో ప్రజలకు ఇచ్చిన మాట కోసం, మహానేత వైఎస్‌ ఆశయ సాధన కోసం కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్‌సీపీని స్థాపించారు. వైఎస్సార్‌సీపీలో చేరాలంటే.. ఎవరైనా ఆ పార్టీ నుంచి సంక్రమించిన ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామాలు చేయాలని షరతు విధించారు. అదే విధానానికి కట్టుబడ్డారు. 
 

చంద్రబాబు:

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిందే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి. ఓటుకు నోటును అలవాటు చేసి రాజకీయాలను ఫక్తు వ్యాపారం చేసిన ఘనత చంద్రబాబుదే. దేశంలో తొలి సారిగా 1996 లోక్‌సభ ఎన్నికల్లో ఓటుకు నోటును ఎరగా వేసి.. ఆ తర్వాత అలవాటు చేసిన చరిత్ర బాబుది. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చి.. వైఎస్సార్‌సీపీని దెబ్బ తీసేందుకు 23 మంది ఎమ్మె ల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేయడమే కాకుండా, ఏకంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం కల్పించి రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు కేసులో కోట్ల కట్టలు, ఆడియో వీడియో టేపులతో తెలంగాణ ప్రభుత్వానికి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ చంద్రబాబు.. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి రాత్రికి రాత్రే హైదరాబాద్‌ నుంచి పారిపోయివచ్చి ఉండవల్లిలోని కృష్ణా నది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడంలో తల దాచుకున్నారు. అంతెందుకు ఆర్నె ల్ల క్రితం శాసనసభ్యుల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటుకు కోట్లను ఎరవేశారు.  

నిబద్ధత.. సీఎం జగన్‌
ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన (ఏవోబీ) వై.రామవరం మండలం చాపరాయిలో 2017 జూన్‌ 30న విష జ్వరాలు ప్రబలి 17 మంది గిరిజనులు మృత్యువాత పడ్డారు. కానీ.. ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పటి ప్రతిపక్ష నేత అయిన వైఎస్‌ జగన్‌ 2017 జూలై 1న పోలీసులు వారిస్తున్నా వినకుండా అటవీ ప్రాంతంలో సముద్ర మట్టానికి 1750 మీటర్ల ఎత్తులో ఉన్న చాపరాయికి వెళ్లారు. విష జ్వరాలు ప్రబలి 17 మంది గిరిజనులు కన్ను మూయడానికి దారితీసిన పరిస్థితులను వెలుగులోకి తెచ్చారు. తాను అధికారంలోకి వస్తే.. గిరిజన ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలను మెరుగు పరుస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరచడంతోపాటు ఖాళీలను భర్తీ చేశారు. స్పెషలిస్టు డాక్టర్లను నియమించారు. గిరిజన ప్రాంతాల్లో ఐదు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, ఒక మెడికల్‌ కాలేజ్‌ని నిరి్మస్తున్నారు. సీఎం జగన్‌ నిబద్ధతకు ఇదో తార్కాణం మాత్రమే. 
 
చంద్రబాబు 
గోదావరి పుష్కరాల ప్రారంపోత్సవం రోజున అంటే 2015 జూలై 14న రాజమహేంద్రవరంలో అప్పటి సీఎం చంద్రబాబు ప్రచార పిచ్చితో స్నానాలు చేసేందుకు ఒకేసారి భక్తులను వదలడంతో తొక్కిసలాట జరిగి 29 మంది దుర్మరణం పాలయ్యారు. కనీసం ఈ దుర్ఘటనపై చంద్రబాబు పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదు. మీ ప్రచార పిచ్చితో 29 మందిని బలిగొన్నారు కదా.. అని చంద్రబాబును మీడియా ప్రశి్నస్తే.. కుంభమేళాలో చచ్చిపోవడం లేదా.. గోదావరి పుష్కరాల్లోనే చచ్చిపోయారా? గోరంతలు కొండంతలు చేస్తారా? అంటూ రంకెలేయడం విస్మయానికి గురిచేసింది. ప్రచారపిచ్చితో 2022 డిసెంబర్‌ 29న కందుకూరులో ఇరుకుసందులో చంద్రబాబు సభ నిర్వహించడం వల్ల తొక్కిసలాటలో 9 మంది మరణించారు. అయినా సరే ఆ సభను నిర్వహించడం ద్వారా ప్రజల పట్ల తనకు ఎంత నిబద్ధత ఉందో చంద్రబాబు చాటి చెప్పుకున్నారు. 

సంస్కర్త (రిఫార్మర్‌) సీఎం జగన్‌
విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన సీఎం జగన్‌.. పాలనలోనూ విప్లవాత్మక మార్పులు తెచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ.. జిల్లాలను పునర్‌ వ్యవస్థీకరించడం ద్వారా ప్రజల ఇంటి ముంగిటకే ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (నగదు బదిలీ) రూపంలో పేదల ఖాతాల్లో నేరుగా అత్యంత పారదర్శకంగా రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. మరో అడుగు ముందుకేసి వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీన వృద్ధులకు పెన్షన్‌ పంపిణీ చేస్తున్నారు. పాలనా సంస్కరణల ద్వారా సీఎం జగన్‌ ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కరించారని నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. ఇంజనీరింగ్‌ పనుల్లో రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టి.. చంద్రబాబు నిర్జీవంగా మార్చిన టెండర్ల వ్యవస్థకు జవసత్వాలు చేకూర్చి, ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.7,500 కోట్లు ఆదా చేశారు.  

చంద్రబాబు 
సంస్కరణ అంటే చంద్రబాబు దృష్టిలో ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయడం.. ఉద్యోగులను రోడ్డున పడేయడం.. వాటిని అత్తెసరు ధరకే బినామీలకు కట్టబెట్టడం. ఉమ్మడి రాష్ట్రంలో 1999–2004 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో నిజాం షుగర్స్, ఆల్విన్, హెచ్‌ఎంటీ వంటి 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసి.. వేలాది మంది ఉద్యోగులను రోడ్డున పడేశారు. వాటి ఆస్తులను అస్మదీయులకు కట్టబెట్టి దోచుకున్నారు. 2014–19 మధ్య టెండర్ల వ్యవస్థను నీరుగార్చి.. అస్మదీయ కాంట్రాక్టర్లకు సగటున 4.85 శాతం అధిక ధరలకు కట్టబెట్టి ప్రభుత్వ ఖజానాకు రూ.20 వేల కోట్లకుపైగా నష్టం చేసిన చంద్రబాబు.. వాటిని కాంట్రాక్టర్లతో కలిసి దోచుకున్నారు. రూ.16 వేల కోట్లకుపైగా విలువైన పనులను నామినేషన్‌ పద్ధతిలో అస్మదీయులకు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకున్నారు.  

సామాజిక సాధికారత సీఎం జగన్‌
సామాజిక న్యాయం చేయడంలో సీఎం జగన్‌ దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచారు. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలు అంటూ అక్కున చేర్చుకునే సీఎం జగన్‌.. మంత్రివర్గంలో ఏకంగా 17 పదవులు (70 శాతం) ఆ వర్గాలకే ఇచ్చారు. ఐదు డిప్యూటీ సీఎం పదవులు ఉంటే.. నాలుగు పదవులు ఆ వర్గాల వారికే ఇచ్చారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ.. శాసనమండలి చైర్మన్‌గా ఎస్సీ, డిప్యూటీ చైర్‌ పర్సన్‌గా మైనార్టీ మహిళకు అకాశం ఇచ్చారు. రాజ్యసభ, శాసన మండలి సభ్యులుగా సింహ భాగం ఆ వర్గాలకే అవకాశం ఇచ్చారు. స్థానిక సంస్థల్లో అధిక శాతం పదవులు వారికే ఇచ్చారు.
 

దేశ చరిత్రలో తొలి సారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలు, మహిళలకు నామినేషన్‌ పనుల్లో, పదవుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం చేసి మరీ ఆ వర్గాలకు పట్టం కట్టారు. డీబీటీ, నాన్‌ డీబీటీ పథకాల ద్వారా రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చితే.. అందులో అధిక భాగం వాటా ఆ వర్గాలకే దక్కింది. రాజకీయ, ఆర్థిక సాధికారతతో ఆ వర్గాలు సామాజిక సాధికారత సాధించాయి. సార్వత్రిక ఎన్నికల్లో సీఎం జగన్‌ మరో అడుగు ముందుకేసి, 175 శాసనసభ, 25 లోక్‌సభ వెరసి 200 స్థానాల్లో వంద స్థానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారినే బరిలోకి దించారు. 

చంద్రబాబు 
ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా.. అంటూ ఎస్సీలను.. తోకలు కత్తరిస్తా, తాటతీస్తా, జడ్జీలుగా పనికి రారంటూ బీసీలను.. దేశ ద్రోహం కేసులు బనాయించి ముస్లింలను.. కోడలు మగపిల్లాన్ని కంటానంటే అత్త వద్దంటుందా అంటూ మహిళలను అపహాస్యం చేసిన చంద్రబాబు సామాజిక అన్యాయానికి పాల్పడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రివర్గంలో ఆ వర్గాలకు సముచిత స్థానం కల్పించిన చంద్రబాబు.. ఒక్కరినంటే ఒక్క బీసీనిగానీ, ఎస్సీనిగానీ, ఎస్టీనిగానీ, మైనారీ్టనిగానీ రాజ్యసభకు పంపలేదు. చివరకు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ వర్గాలకే టికెట్ల కేటాయింపుల్లో అన్యాయం చేసి సామాజిక విద్రోహానికి పాల్పడ్డారు.
 

ఆర్థికవేత్త సీఎం జగన్‌
సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చే నాటికి అంటే 2019 మే 30కి ప్రభుత్వ ఖజానాలో రూ.వంద కోట్లు మాత్రమే మిగిలాయి. చంద్రబాబు దోపిడీతో గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టిన సీఎం వైఎస్‌ జగన్‌.. సంక్షేమ, అభివృద్ధి పథకాలను పరుగులు పెట్టించారు. పేదల ఖాతాల్లో సంక్షేమ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్లను జమ చేశారు. వాటిని సద్వినియోగం చేసుకున్న పేదలు జీవనోపాధిని మెరుగుపరుచు కోవడంతో పేదరికం తగ్గింది. రాష్ట్రంలో పేదరికం చంద్రబాబు హయాంలో 11.77 శాతం ఉంటే.. ఇప్పుడు 4.19 శాతానికి తగ్గింది.
 

రాష్ట్ర తలసరి ఆదాయం చంద్రబాబు హయాంలో 2018–19లో రూ.1,51,173 ఉంటే.. సీఎం జగన్‌ హయాంలో 2022–23 నాటికి రూ.2,19,518కి పెరిగింది. కేంద్రం జీడీపీలో రాష్ట వాటా చంద్రబాబు హయాంలో ఐదేళ్లూ సగటున 4.47 శాతం ఉంటే.. సీఎం జగన్‌ హయాంలో 4.82 శాతానికి పెరిగింది. చంద్రబాబు హయాంలో అప్పుల కాంపౌండెడ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌ 21.87 శాతం ఉంటే.. ఇప్పుడు 12.13 శాతానికి తగ్గింది. సంపద సృష్టించిందీ సీఎం జగనే. చంద్రబాబు హయాం (2014–19)లో మూల ధన వ్యయం ఏటా సగటున రూ.15,227 కోట్లు ఖర్చు చేస్తే.. సీఎం జగన్‌ గత ఐదేళ్లు ఏటా సగటున రూ.17,757 కోట్లు ఖర్చు చేశారు. కోవిడ్‌ ఆర్థిక సంక్షోభంలో ప్రజల ఖాతాలకు నగుదు జమ చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజలు ఆకలితో అలమటించకుండా ఆదుకున్నారు. 
 
చంద్రబాబు 
ఆర్థిక శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చదివానని, తానో ఆర్థికవేత్తనని, సంపద సృష్టించానని చంద్రబాబు బీరాలు పలుకుతారు. ఇందులో చదువొక్కటే నిజం.. మిగతావన్నీ అసత్యాలే. ఎడాపెడా అధిక వడ్డీలకు రుణాలు చేయడం.. వాటిని అస్మదీయులతో కలిసి దోచుకోవడం, పంచుకోవడం.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడమే చంద్రబాబు ఆర్థిక విధానం.  

పరిపాలన దక్షత సీఎం జగన్‌
విభజిత రాష్ట్రాన్ని 2014–19 మధ్య చంద్రబాబు అడ్డగోలుగా దోచేసి ఛిన్నాభిన్నం చేశారు. కుంగి కుదేలైన రాష్ట్రాన్ని సీఎం జగన్‌ తన పరిపాలన దక్షతతో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపారు. 2020 ఫిబ్రవరి నుంచి 2022 జనవరి వరకు కరోనా మహమ్మారి దాదాపు రెండేళ్లు ప్రపంచాన్ని గజగజ వణికించింది. ఈ మహమ్మారి విజృంభించినప్పుడే.. దానితో సహజీవనం చేయాల్సిందేనని.. ట్రేస్‌.. టెస్ట్‌.. ట్రీట్‌మెంట్‌ మినహా మరో మార్గం లేదని సీఎం జగన్‌ ప్రకటించారు. దీన్ని చంద్రబాబు సహా ఆయన ఎల్లో గ్యాంగ్‌ అప్పట్లో అపహాస్యం చేసింది.
 

సీఎం జగన్‌.. వైద్యారోగ్య శాఖను సమర్థవంతంగా పని చేయించడం ద్వారా కరోనా మహమ్మారిని గట్టిగా ఎదుర్కొన్నారు. కోట్లాది మంది ప్రజల ప్రాణాలను రక్షించారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా, సంక్షేమ పథకాలు ఆపకుండా.. పేదల ఖాతాల్లో నిధులు జమ చేశారు. దాంతో కోట్లాది మంది ప్రజల జీవనోపాధికి ఇబ్బంది లేకుండాపోయింది. పరిపాలన దక్షతతో కరోనాను సీఎం జగన్‌ సమర్థవంతంగా ఎదుర్కొన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ, నీతి ఆయోగ్‌ ప్రశంసించాయి.  
 

చంద్రబాబు 
హుద్‌హుద్‌ తుఫాన్‌ 2014 అక్టోబర్‌ 12న విశాఖపట్నంతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేసింది. సర్వం కోల్పోయి.. ఆకలి కేకలతో ఉత్తరాంధ్ర దద్దరిల్లింది. తుఫాన్‌ తగ్గిన వెంటనే విశాఖపట్నంకు చేరుకున్న అప్పటి సీఎం చంద్రబాబు.. ప్రచార పిచ్చితో రంపం పట్టుకుని చెట్లను తొలగిస్తున్నట్లు ఫొటోలకు ఫోజులు ఇస్తూ.. సహాయక చర్యలు చేపట్టకుండా ఆటంకం కలిగించారు. బాధితులను ఆదుకోకుండానే హుద్‌హుద్‌ తుఫాన్‌ను జయించినట్లు ప్రగల్భాలు పలికారు. ప్రతిపక్షంలోకి మారాక 2020 మార్చిలో తాను అధికారంలో ఉంటే కరోనా మహమ్మారి వచ్చేదా.. అంటూ బీరాలు పలకడంతో ప్రజలు నిర్ఘాంతపోయారు.   

Back to Top