జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య

దాడిని తీవ్రంగా ఖండించిన వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ సీఎం వైయస్‌ జగన్  

తాడేప‌ల్లి:  పులివెందుల నియోజకవర్గం, వేముల మండల కేంద్రం లో నీటి సంఘాల ఎన్నికల్లో అధికార టీడీపీ నేతల దారుణాలను ప్రపంచానికి చూపిస్తున్న జర్నలిస్ట్‌లపై దాడి హేయమైన చర్య అని వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. జర్నలిస్ట్‌లపై మూకుమ్మడిగా దాడి చేసి గాయపరచిన వారిపై కేసులు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

కూటమి ప్రభుత్వంలో మీడియాపై దాడులు ఎక్కువయ్యాయని, మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగా ఆయన అభివర్ణించారు. నిజాలు నిర్భయంగా వెలికితీస్తున్న మీడియా గొంతునొక్కాలనుకోవడం కూటమి ప్రభుత్వం దుర్మార్గపు చర్య అని వైయస్‌ జగన్‌ అన్నారు.

Back to Top