అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి

వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి ఆధ్వర్యంలో డీజీపీకి ఫిర్యాదు

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ మహిళా నేతలపై అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి డిమాండు చేశారు. ఈ మేర‌కు సోమ‌వారం వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌గిరిలోని డీజీపీ కార్యాల‌యం అధికారికి ఫిర్యాదు చేస్తూ ఓ లేఖ అందించారు. ఈ సంద‌ర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ సోషల్ మీడియా వేదిక‌గా వైయ‌స్ఆర్‌సీపీ మహిళా కార్యకర్తకు వేధింపులు అధిక‌మ‌య్యాయ‌ని చెప్పారు.  సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న వారిని వేధింపులకు గురిచేస్తున్నారని.. టీడీపీ సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని పేర్కొన్నారు.  ఫోటోలు మార్ఫింగ్ చేసి అసభ్యంగా పోస్టులు పెడుతున్న టీడీపీ సోషల్ మీడియా పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేసిన‌ట్లు చెప్పారు. విన‌తిప‌త్రం ఇచ్చిన వారిలో వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్‌ సభ్యులు, సోషల్ మీడియా సభ్యులు పాల్గొన్నారు.
 

Back to Top