సచివాలయం: పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందడుగు వేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు అంశంపై వర్కింగ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేసింది. ఐదు శాఖల కార్యదర్శులతో కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీకి కన్వీనర్‌గా ఆర్థిక శాఖ కార్యదర్శి, సభ్యులుగా ప్లానింగ్, పాఠశాల విద్య, పంచాయతీ, వైద్యశాఖ కార్యదర్శులను నియమించారు. ఎస్పీ టక్కర్ ఇచ్చిన నివేదికను ఈ వర్కింగ్ కమిటీ పరిశీలించనుంది. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పాదయాత్రలో వైయస్ జగన్‌ను అనేక మంది ఉద్యోగులు కలిశారు. సీపీఎస్‌పై అధ్యయనం చేసి రద్దు చేస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీపీఎస్ రద్దుకు సీఎం వైయస్ జగన్ కమిటీని నియమించారు. Read Also: రాజధాని చందాలు ..ఇటుకలు ఏమయ్యాయి