ఆధారాలు చూపించినా మళ్లీ అబద్ధాలా?

ఎల్లో మీడియా తీరుపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఫైర్‌

కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే ప్రభుత్వ ఒప్పందం

రూ.2.49కే యూనిట్‌ విద్యుత్‌ ఒక చరిత్రాత్మక ఒప్పందం

ఇంకా ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ ఛార్జీలు కూడా మాఫీ

దాని వల్ల 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లు ఆదా

మరి అది రాష్ట్రానికి సంపద సృష్టించినట్లు కాదా?

అయినా అసత్యాలతో ఎల్లో మీడియా అవే రాతలు

మీ ఆరోపణలకు ఆధారాలు చూపించగలరా?

ఎల్లో మీడియాకు గుడివాడ అమర్‌నాథ్‌ సూటి ప్రశ్న

చంద్రబాబుకి దమ్ముంటే ఒప్పందం రద్దు చేసుకోవాలి 

అంతకన్నా తక్కువ ధరకు అగ్రిమెంట్‌ చేసుకోవాలి

అలా తాను ఎప్పుడూ చెప్పుకునే విజనరీనని నిరూపించాలి

చంద్రబాబు ఎన్నికల హామీలన్నీ గాలి బుడగలేనని తేలింది 

ఆరు నెలల్లోనే ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోర వైఫల్యం

ప్రజల దృష్టి మళ్లించేందుకు అదేపనిగా కుతంత్రాలు

ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఆక్షేపణ

విశాఖపట్నం: చంద్రబాబు అధిక ధరలతో చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాల వల్ల 25 ఏళ్లలో దాదాపు రూ.87,500 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని, అదే తమ ప్రభుత్వం రూ.2.49కే చేసుకున్న ఒప్పందం వల్ల అదే 25 ఏళ్లలో ఏకంగా రూ.1.10 లక్షల కోట్లు ఆదా అవుతాయని మాజీ సీఎం, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ పక్కాగా ఆధారాలు, గణాంకాలతో సహా వివరించినా, ఎల్లో మీడియా మళ్లీ అవే అబద్ధాలు రాస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఆక్షేపించారు. విశాఖపట్నం క్యాంప్‌ ఆఫీస్‌లో వైయస్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్  మీడియాతో మాట్లాడారు. 

వ్యక్తిత్వ హనన కుట్ర:
– రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి కొమ్ముకాసే కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు పూర్తిగా ప్రజల దృష్టి మళ్లించేందుకు మా అధినేత వైయస్‌ జగన్‌ వ్యక్తిత్వ హననం చేయాలని ప్రయత్నిస్తున్నాయి. అందుకే నిత్యం బురద చల్లుతూ, అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి.
– గత 15 ఏళ్లుగా చేస్తున్న ప్రచారాన్ని ఇంకా ముమ్మరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు తప్ప, ఎక్కడా ఆధారాలు చూపించే ధైర్యం చేయడం లేదు. 
– టీడీపీ గెజిట్‌ పేపర్లుగా ఉండి వైయ‌స్‌ జగన్‌.. కాంగ్రెస్‌ పార్టీని వీడి వైయ‌స్ఆర్‌సీపీ  స్థాపించిన నాటి నుంచి ఈ పత్రికలన్నీ ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నాయి. 
– తాజాగా సోలార్‌ పవర్‌ కాంట్రాక్టులో అదానీతో ఒప్పందం చేసుకున్నారని, అందుకుగాను లంచం తీసుకున్నారంటూ తప్పుడు ప్రకటనలు చేశారు. 

‘సెకీ’తోనే ప్రభుత్వ ఒప్పందం:
– సోలార్‌ పవర్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ (సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)కి, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందపై సెకీ, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కమ్‌లు సంతకాలు చేశాయి.
– పూర్తి పారదర్శకంగా జరిగిన ఈ ఒప్పందంలో ఎక్కడా థర్డ్‌ పార్టీ లేదు. దళారులు అంత కంటే లేరు.
– అదే చంద్రబాబు హయాంలో విండ్‌ పవర్‌కు సంబంధించి పీపీఏలు చూస్తే 2014– 19 మధ్య 3500 మెగావాట్లకు 133 ఒప్పందాలను సగటు యూనిట్‌ ధర రూ.4.83 చొప్పున చేసుకున్నారు. 
– అలాగే సోలార్‌ పవర్‌ పీపీఏలు చూస్తూ 2014–19 మధ్య 35 ఒప్పందాలు చేసుకుంటే వాటిని సగటు యూనిట్‌ ప్రైజ్‌ రూ.5. 

– ఇప్పుడున్న ధరలు చూస్తే దేశవ్యాప్తంగా ఎక్కడా రూ. 2.70కు తక్కువ దొరకడం లేదు. మన రాష్ట్రానికి కూడా కావాలంటే రూ.3.10కి తక్కువ దొరికే పరిస్థితి లేదు.
– పైగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం 25 ఏళ్లపాటు ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్సమిషన్‌ ఛార్జీల మినహాయింపుతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా రాష్ట్రానికి 25 ఏళ్లలో రూ. 1.10 లక్షల కోట్లు ఆదా చేయడం ద్వారా, అంత సంపద సృష్టించినట్లు అయింది.
– ఐఎస్‌టీసీ మినహాయింపు లేకుంటే మనం కొనుగోలు చేసిన రూ. 2.49 విద్యుత్‌ను మరో రూ.2 అదనంగా చెల్లించి యూనిట్‌ రూ. 4.49 కొనుగోలు చేయాల్సి వచ్చేది. 

దమ్ముంటే ఆధారాలు చూపాలి:
– కానీ ఐఎస్‌టీసీ చార్జీలున్నాయని ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా దమ్ముంటే అందుకు సంబంధించిన ఆధారాలుంటే చూపించాలి.
– అలాగే ఒకవేళ మేం ఎక్కువ ధర చెల్లించి కొన్నామని మీరు చెప్పిందే నిజమైతే ఈ అగ్రిమెంట్‌ను రద్దు చేసి రూ. 2.49 కన్నా తక్కువ ధరకు ఒప్పందం చేసుకుని చంద్రబాబు నిరూపించాలి. 
– ఎన్నికలప్పుడు ఐదేళ్ల పాటు విద్యుత్‌ చార్జీలు పెంచనని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే నాణ్యమైన విద్యుత్‌ పంపిణీ చేయాలంటే ధరలు పెంచక తప్పదని ఎలా చెప్పడం ఏరు దాటాక బోడి మల్లన సామెతలా ఉంది.  
– అదానీ వచ్చి వైఎస్‌ జగన్‌ను కలిస్తే నేరం, లంచాలు ఇవ్వడానికి వచ్చినట్టు.. చంద్రబాబు కలిస్తే పెట్టుబడులు పెట్టడానికి వచ్చినట్టా..? ఇంత దుర్మార్గమా.. 

– వైయ‌స్‌ జగన్‌ చెప్పిన ప్రతి అంశంలోనూ ఆధారాలతో సహా వివరించారు. మరి టీడీపీ, ఎల్లో మీడియా చేస్తున్న ఆరోపణల్లో ఏ ఒక్కదానికైనా ఆధారాలు చూపించగలరా?.

– కూటమి పార్టీ నాయకులు పెట్టిన కేసులే నమోదు చేస్తామనేలా పోలీస్‌ వ్యవస్థ దిగజారిపోయింది. మాపై చేస్తున్న దుష్ప్రచారం గురించి ఎన్ని ఫిర్యాదులిచ్చినా ఏఒక్క దానిపైనా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. మాకు వినపడటం లేదు, కనపడటం లేదన్నట్లు రాష్ట్ర పోలీసులు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఆక్షేపించారు.

Back to Top