మీ అన్న నాగబాబుకు మీరు ఎంపీ టికెట్ ఇవ్వలేదా? 

  ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్‌
 

అమరావతి: మీ అన్న నాగబాబుకు మీరు ఎంపీ టికెట్ ఇవ్వలేదా? అంటూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను సీఎం  వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ట్విటర్‌ వేదికగా జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై మండిపడ్డారు. కాల్షీట్లు అయిపోవస్తున్నా ఆయనకు ప్రజల నుంచి కనీస స్పందన  రావడం లేదని ఎద్దేవా చేశారు. కుటుంబ పిడికిలి అంటూ కొత్త రాగాన్ని అందుకున్నారని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంలో ముగ్గురు పదవుల్లో ఉన్నారని తెలిపారు. మీ అన్న నాగబాబుకు మీరు ఎంపీ టికెట్ ఇవ్వలేదా? అని పవన్ ను ప్రశ్నించారు. గురివింద గింజలా నీతులు చెప్పొద్దని వ్యాఖ్యానించారు. వైయస్‌ జగన్ పై ప్యాకేజీ స్టార్ విషం కక్కుతున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Read Also: సీపీఎస్‌ రద్దుపై వర్కింగ్‌ కమిటీ నియామకం

Back to Top