ప్రేమ్ కుమార్ కుటుంబానికి అండ‌గా వైయ‌స్ఆర్‌సీపీ  

వైయ‌స్‌ జగన్‌ను కలిసిన ప్రేమ్‌కుమార్‌ కుటుంబ సభ్యులు

సోష‌ల్ మీడియా కార్య‌కర్త కుటుంబ స‌భ్యుల‌కు ధైర్యం చెప్పిన పార్టీ అధినేత‌

తాడేప‌ల్లి:  అక్ర‌మ అరెస్టుకు గురైన గుంటూరుకు చెందిన‌  వైయ‌స్ఆర్‌సీపీ సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త ప్రేమ్‌కుమార్‌కు వైయ‌స్ఆర్‌సీపీ అండ‌గా నిలిచింది. వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి గుంటూరుకు చెందిన సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ కొరిటిపాటి ప్రేమ్‌ కుమార్‌ భార్య సౌజన్య,  పిల్లలు అభిసాత్విక, అభినయ్‌ కలిశారు.  ప్రేమ్‌కుమార్‌ బెయిల్‌ విషయంలో అవసరమైన న్యాయ సహాయం అందజేయాలని వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ టీమ్‌కు వైయ‌స్‌ జగన్‌ సూచించారు.వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తి అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు వైయ‌స్ జ‌గ‌న్‌ హామీ ఇచ్చారు.
 
పోలీసులు తెల్లవారుజామున తమ ఇంటికి వచ్చి దౌర్జన్యంగా వ్యవహరించి ప్రేమ్‌కుమార్‌ను తీసుకువెళ్ళిన తీరును వైయస్‌ జగన్‌కు  కుటుంబసభ్యులు వివ‌రించారు. వారికి ధైర్యాన్నిచ్చి, అక్రమ కేసులు చట్టపరంగా ఎదుర్కుందామని పార్టీ అధినేత భరోసా క‌ల్పించారు. 

వైయస్‌ జగన్‌ను కలిసిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు,మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, గుంటూరు నగర మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు త‌దిత‌రులు ఉన్నారు.

Back to Top