చంద్రబాబులో ఇప్పటికీ పశ్చాత్తాపం కనిపించడం లేదు

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 

చంద్ర‌బాబు నిజ‌స్వ‌రూపాన్ని సుప్రీం ఎత్తి చూపింది

సుప్రీం కోర్టు  అక్షింత‌లు వేసినా చంద్ర‌బాబు తీరు మార‌లేదు

టీడీపీ అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ అకౌంట్‌లో అబ‌ద్ధాలు ప్ర‌చారం చేస్తున్నారు

సిగ్గు లేకుండా ప్ర‌తిదాన్ని బాబు వ‌క్రీక‌రిస్తున్నాడు

అబ‌ద్ధాలు చెప్ప‌డంలో వీల్లు దిగ‌జారిపోతున్నారు

జాతీయ మీడియా కూడా చంద్ర‌బాబును త‌ప్పుబ‌ట్టింది

చంద్ర‌బాబు వేసిన సిట్‌ను సుప్రీం ర‌ద్దు చేసింది

వెజిట‌బుల్ ఫ్యాట్ మాత్ర‌మే ఉంద‌ని ఈవో చెప్పారు

చంద్ర‌బాబు మాత్రం యానిమ‌ల్ ఫ్యాట్ అని అబ‌ద్ధాలు చెప్తున్నారు

క‌ల్తీ నెయ్యి ప్ర‌సాదానికి వాడ‌లేద‌ని ఈవో మ‌రోసారి చెప్పారు

ఈవో చెప్పిన చంద్ర‌బాబు మ‌ళ్లీ అస‌త్య ప్ర‌చారాలు చేశారు

భ‌క్తుల మ‌నోభావాల‌తో చంద్ర‌బాబు ఆడుకుంటున్నారు

చంద్ర‌బాబు పాపం ప్ర‌జ‌ల‌పై ప‌డ‌కూడ‌ద‌ని దేవుడిని వేడుకుంటున్నా..

త‌ప్పును గుడ్డిగా స‌మ‌ర్ధిస్తూ స‌నాత‌న ధ‌ర్మ‌మ‌ని చెప్పుకోవ‌డం ధ‌ర్మ‌మా? :  వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ దుర్భుద్ధితో మత విశ్వాసాలను ఎలా రెచ్చగొట్టారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుందని వైయస్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. పొలిటికల్‌ డ్రామాలు చేయవద్దని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పిందని. అయినప్పటికీ టీడీపీ ఇప్పటికీ అసత్య ప్రచారమే చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జ‌రిగినా చంద్రబాబులో ఇప్పటికీ పశ్చాత్తాపం కనిపించడం లేద‌ని వైయ‌స్ జ‌గ‌న్ మండిప‌డ్డారు. లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై వైయ‌స్‌ జగన్‌ స్పందించారు. 

 వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏమ‌న్నారంటే..

సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది:
    ఈరోజు సుప్రీం కోర్టులో జరిగిన పరిణామాలను, అలాగే గత సోమవారం (సెప్టెంబరు 30) జరిగిన పరిణామాలను మీరంతా గమనించే ఉంటారు. మనం గమనిస్తే రెండింటిలో కూడా చంద్రబాబు నిజ స్వరూపాన్ని సుప్రీం కోర్టు ఎత్తి చూపించింది. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా కావాలని, రాజకీయ దుర్భిద్ధితో రెచ్చగొడుతున్నాడనేది సుప్రీంకోర్టు అర్దం చేసుకుంది కాబట్టే గట్టి వ్యాఖ్యలు చేసింది.
    దేవుణ్ని రాజకీయాల్లోకి లాగొద్దు అంది. పొలిటికల్‌ డ్రామాలు చేయెద్దు అని కూడా వ్యాఖ్యానించింది. చంద్రబాబు స్వయంగా వేసుకున్న  ‘సిట్‌’ను కూడా రద్దు చేసింది.

చంద్రబాబుకు భయం, భక్తి లేవు:
    తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను రాజకీయ దుర్భిద్దితో కావాలని అబద్దాలు చెప్పి, జంతువుల కొవ్వు వాడి లడ్డూలు తయారు చేసి భక్తులకు ఇస్తే, వారవి తిన్నట్లు సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం చేశారు. అలా ఆయన తిరుమల లడ్డూను, శ్రీవెంకటేశ్వరస్వామి విశిష్టతను, తిరుమల ప్రతిష్టను అపవిత్రం చేశారు. వీటన్నింటికీ సంబంధించి నేను సాక్ష్యాధారాలతో సహా చూపించాను. దీనిపై కోర్టు కూడా మొట్టికాయ వేసింది.
    కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని దెబ్బ తీస్తూ, చంద్రబాబు ఎలా అబద్ధాలు చెప్పాడనేది చూస్తే.. చంద్రబాబు సీఎం అయ్యాక, తను నియమించుకున్న ఐఏఎస్‌ అధికారి, టీటీడీ ఈఓ చంద్రబాబు ప్రకటనలకు విరుద్ధంగా స్వయంగా ప్రకటనలు చేశాడు.
చంద్రబాబు మామూలుగా మంచి వ్యక్తి అయితే, ఇంత ఆధారాలు కనిపిస్తుంటే, కొద్దో గొప్పో సిగ్గు పడతాడు. తన మాటలకు వ్యతిరేకంగా ఇన్ని సాక్ష్యాధారాలు కనిపించినప్పుడు, దేవుడంటే భయం, భక్తి ఉన్న వారెవరైనా పశ్చాత్తాప పడతారు. ప్రజలకు క్షమాపణ చెబుతారు. కానీ 
చంద్రబాబుకు పశ్చాత్తాపం ఉండదు. ఆయనకు దేవుడంటే భయం, భక్తి రెండూ లేవు.

పశ్చాత్తాపం కనిపించడం లేదు:
    కానీ, చంద్రబాబు ప్రవర్తించే తీరు ఎలా ఉందంటే.. ఈరోజు తెలుగుదేశం పార్టీ వెబ్‌సైట్‌లో చంద్రబాబుగారు పెట్టిన పోస్టింగ్స్‌ చూస్తే.. తప్పు జరిగిందని తెలిసినా ఆయనలో కనీసం పశ్చాత్తాపం కనిపించడం లేదు. దేవుడి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించినా కనీస పశ్చాత్తాపం లేదంటూ.. 
ఆ పోస్టింగ్స్‌లో ఏం రాశాడన్నది చదివి విపించారు.
    ‘తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్‌ కావడంతో జగన్‌రెడ్డి బావ ధర్మారెడ్డి, బాబాయి సుబ్బారెడ్డి, మామ కరుణాకర్‌రెడ్డి అంటూ అబద్దం మీద అబద్దాలు చెప్పుకుంటూ పోతున్నారు. మనిషి అన్నాక కొద్దిగానైనా దేవుడంటే భక్తి ఉండాలి. కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. ఇంత దారుణంగా వక్రీకరణ చేయడమా?’.. అని ఆక్షేపించారు.

సిగ్గు ఎగ్గూ లేకుండా వక్రీకరణ:
    సుప్రీంకోర్టు నిజానికి చంద్రబాబుకు అక్షింతలు వేస్తే, దాన్ని నేషనల్‌ మీడియా మొత్తం రాసిందంటూ.. గత సోమవారం సుప్రీంకోర్టులో వాదనల తర్వాత, ప్రతి నేషనల్‌ టీవీ, న్యూస్‌ పేపర్‌ చంద్రబాబును ఆక్షేపిస్తూ.. ఏం రాశాయన్నది చదివి వినిపించారు.
    ‘కీప్‌ గాడ్‌ అవే ఫ్రమ్‌ పాలిటిక్స్‌ సుప్రీంకోర్ట్‌ టెల్స్‌ నాయుడు’ అని ప్రతి నేషనల్‌ ఛానల్, ప్రతి ఇంగ్లిష్‌ పేపర్‌ చంద్రబాబును తప్పు బట్టినా, ఆయన్ను సుప్రీంకోర్టు తిట్టినా, ఆక్షేపించినా, టీడీపీ సోషల్‌ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం, రాస్తున్న అబద్దాలు చూస్తుంటే, ఆయన ఎంత నీచానికి దిగాడన్నది తెలుస్తుంది.
    ‘తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్‌. మీ పాపం పండింది జగన్‌.. అంటూ ఏ మాత్రం సిగ్గూ, ఎగ్గూ లేకుండా వక్రీకరిస్తున్నారు. నిజానికి సుప్రీంకోర్టు చంద్రబాబును తిడితే, దాన్నీ వక్రీకరిస్తూ.. మీ పాపం పండింది. వైవీ సుబ్బారెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం అని రాశారు.ఇంత దారుణంగా వక్రీకరిస్తూ, చంద్రబాబు దిగజారిపోయిన పరిస్థితి’.. అని శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఇలా..:
    సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి చేసిన తప్పులు, చెప్పిన అబద్ధాలను మరొక్కసారి మీకు వివరిస్తాను.. అంటూ వైయస్‌ జగన్‌ ఆ వివరాలు మరోసారి ప్రస్తావించారు.
    ‘జూలై 6, జూలై 12న వచ్చిన నెయ్యి ట్యాంకర్లు.. నాణ్యత పరీక్షించిన తర్వాత వాటిని లోపలికి అనుమతించలేదు. తిరుపతి, తిరుమలలో ఒక గొప్ప రొబొస్ట్‌ వ్యవస్థ ఉంది. 2014–19 మధ్య క్వాలిటీ లేని 14 నెయ్యి ట్యాంకర్లు వెనక్కు పంపగా, మా హయాంలో 2019–24 మధ్య 18 ట్యాంకర్లు వెనక్కు పంపడం జరిగింది’.
    నెయ్యి, ఇతర సరుకుల సేకరణకు టీటీడీలో పక్కా వ్యవస్థ ఉంది. అన్నీ ఈ–టెండర్ల ద్వారా బిడ్లు నిర్వహిస్తారు. ఎల్‌–1కు 65 శాతం, ఆ తర్వాత బిడ్లో ఉన్న వారికి అదే ధరకు 35 శాతం ఇస్తారు. తిరుమలకు టెండర్‌ ప్రకారం సరఫరా చేసే నెయ్యి ట్యాంకర్లు.. తమతో ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపు పొందిన ల్యాబ్‌ నుంచి క్వాలిటీ సర్టిఫికెట్‌ తీసుకురావాలి. ఆ సర్టిఫికెట్‌తో వచ్చినా, తిరుపతిలో ప్రతి ట్యాంకర్‌ శాంపిల్‌ మూడు సార్లు టెస్ట్‌ చేస్తారు. అలా జూలై 6, 12 తేదీల్లో వచ్చిన ట్యాంకర్లు తిరుపతిలో చేసిన నాణ్యత పరీక్షలో ఫెయిల్‌ అయితే, వాటిని వెనక్కు పంపారు. అవే శాంపిల్స్‌ను ఎన్డీడీబీకి పంపిస్తే, జూలై 23న రిపోర్ట్‌ వచ్చింది. దాంతో ఆ ట్యాంకర్లు వెనక్కు పంపడంతో పాటు, ఆ కంపెనీ వారికి నోటీసులు కూడా ఇచ్చారు’.. అని వివరించిన శ్రీ వైయస్‌ జగన్, ఆ సందర్బంగా జూలై 23న ఈవో ప్రెస్‌తో ఏమన్నారో చూపారు.

అయినా చంద్రబాబు ఏమన్నారు?:
    అలా నాణ్యత లేని నెయ్యి వాడలేదని ఈఓ స్పష్టంగా చెప్పినా, తన 100 రోజుల పాలనలో అన్ని రంగాల్లో ఫెయిల్‌ అయిన చంద్రబాబు, డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూ.. సెప్టెంబరు 18న ఎన్డీఏ సమావేశంలో తిరుమల లడ్డూపై దారుణ ఆరోపణలు చేశారంటూ.. ఆ వీడియో కూడా శ్రీ వైయస్‌ జగన్‌ చూపారు.
    జూలై 23న ఎన్డీడీబీ రిపోర్ట్‌ వస్తే, రెండు నెలల తర్వాత అన్ని తెలిసినా, సెప్టెంబరు 18న ఆ విషయం ప్రస్తావిస్తూ.. దేవుడి ప్రతిష్టను దెబ్బ తీస్తూ.. శ్రీవారి లడ్డూ తయారు చేసే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారు. ఆ వెంటనే రెండు రోజులకు, అంటే సెప్టెంబరు 20న మాట్లాడిన టీటీడీ ఈఓ.. ఈ విషయం మీద చంద్రబాబు మాటలను కరెక్ట్‌ చేస్తూ.. నాణ్యత లేని నెయ్యి వాడలేదని స్పష్టం చేశారు. టెస్టుల్లో ఫెయిల్‌ అయిన రెండు ట్యాంకర్లు వెనక్కు పంపామని ఈఓ చెప్పిన వీడియో ప్రదర్శించారు.
    అయినా కూడా మళ్లీ సెప్టెంబరు 22న మాట్లాడిన చంద్రబాబు, ఏ మాత్రం భయం, భక్తి లేకుండా తనకు రాజకీయ ఉద్దేశాలే ముఖ్యమని, స్వామివారు అన్నా, తిరుపతి అన్నా భయం, భక్తి లేదని నిరూపిస్తూ.. తాను అంతకు ముందు చెప్పిన పచ్చి అబద్ధాలను మరోసారి వల్లె వేశారు. తిరుమలకు వచ్చిన 4 ట్యాంకర్ల నెయ్యి వాడినట్లు చెప్పారు.

ప్రధానికి లేఖ. ‘సుప్రీం’లో పిటిషన్‌:
    ఒక అబద్దానికి రెక్కలు కట్టి గోబెల్స్‌ ప్రచారంలో భాగంగా రాజకీయ దురుద్దేశంతో అబద్ధాలు ఆడి, తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాశస్త్యం, లడ్డూ విశిష్టతను అపవిత్రం చేస్తూ చంద్రబాబు అన్న మాటలపై మేము ప్రధానికి లేఖ రాశాం. సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించాం. 
    సుప్రీంకోర్టు సైతం ఈ కేసు వినేటప్పుడు.. కోర్టులో న్యాయమూర్తులు ఎలా స్పందించారో ఒకసారి గుర్తు చేసుకొండి అంటూ.. గత సోమవారం సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా న్యాయమూర్తులు ఏమన్నారన్నది చదివి వినిపించారు. ఇవన్నీ నేషనల్‌ మీడియాలో రిపోర్ట్‌ అయ్యాయి అని చెప్పారు.
    అంతే కాకుండా ఆరోజు (గత నెల 30న) సుప్రీంకోర్టు ఇంకా ఏం చెప్పిందనేది ప్రస్తావిస్తూ.. ఆ జడ్జిమెంట్‌ కాపీ స్లైడ్లో చూపారు. సీఎం చంద్రబాబును ఆక్షేపిస్తూ, సుప్రీంకోర్టు స్వయంగా ఈ వ్యాఖ్యలు చేసిందని చెప్పారు.

సుప్రీంకోర్టు ఎలా స్పందించింది?:
    ‘కల్తీ నెయ్యి వాడలేదని ఈఓ చెప్పినా, లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు? ఆధారాలు లేకపోయినా సీఎం మీడియా ముందు అలా ఎలా మాట్లాడుతారు?. ఒకవైపు విచారణ జరుగుతుండగా.. ఆ వ్యాఖ్యలతో సిట్‌ ప్రభావితం కాదా?. తమ నివేదిక తప్పు కావచ్చని స్వయంగా ఎన్‌ డీ డీబీ రిపోర్టులోనే రాశారు కదా?. ఎన్‌డీడీబీ నివేదికపై సెకండ్‌ ఒపీనియన్‌ ఎందుకు తీసుకోలేదు?. అదొక్కటే కాదు దేశంలో ఎన్నో ల్యాబ్స్‌ ఉన్నాయి కదా?. ముఖ్యమంత్రి ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఈఓ ప్రకటన ఉంది. సీఎం చేసిన ప్రకటనకు ఎలాంటి ఆధారాలు లేవు. దర్యాప్తునకు ఆదేశించినప్పుడు పదాల గారిడీ ఎంత మాత్రం అవసరం లేదు. ఎన్‌డీడీబీ నివేదిక జూలైలో వస్తే దానిపై ముఖ్యమంత్రి ఎందుకు సెప్టెంబరులో మాట్లాడినట్లు?. జూలైలోనే ఎందుకు మాట్లాడలేదు?. మీడియాతో మాట్లాడ్డానికి ముందు లడ్డూలను పరీక్షించడం సరైనదని సీఎం భావించలేదా?. అసలు బహిరంగ ప్రకటనలు ఎందుకు చేయాలి?. దాని వల్ల సిట్‌ దర్యాప్తు ప్రభావితం కాదా?. అది కోట్ల మంది మనోభావాలను దెబ్బ తీస్తుందని తెలియదా?. సిట్‌ ఏర్పాటు చేసినా, ఇంకా కల్తీ నెయ్యిపై ప్రకటన ఎలా చేస్తారు?. మీడియాతో ఎలా మాట్లాడుతారు?’.. అని సుప్రీంకోర్టు గత 30వ తేదీన అబ్జర్వేషన్స్‌ పాస్‌ చేసింది.

కోర్టు ఇంకా ఏమేం మాట్లాడింది?:
    ఎఫ్‌ఐఆర్‌ సెప్టెంబరు 25న రిజిస్టర్‌ చేస్తే.. అంతకు ముందే సెప్టెంబరు 18న ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. సిట్‌ ఏర్పాటైంది సెప్టెంబరు 26న అయితే.. అంతకన్నా ముందే ఎలా ప్రకటన ఇచ్చాడంటూ.. సీఎం పబ్లిక్‌ స్టేట్‌మెంట్‌ కోట్లమంది భక్తుల మనోభావాలు దెబ్బ తీస్తుందని కోర్టు చెప్పింది. 
    ఇన్ని రకాలుగా చంద్రబాబును సుప్రీంకోర్టు ఆక్షేపించినా, మళ్లీ ఇవాళ కూడా న్యాయస్థానం కల్తీ నెయ్యి వాడలేదని ఈఓ చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు చేసిన తప్పును ఎత్తి చూపుతూ ఆక్షేపించింది. చంద్రబాబు తాను  స్వయంగా ఏర్పాటు చేసుకున్న సిట్‌ ను రద్దు చేస్తూ.. సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర అధికారులు అసిస్ట్‌ చేస్తారని చెబుతూ వీరికి తోడు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒకరు నియమితులవుతారని.. వీరందరూ లడ్డూకి సంబంధించిన విషయంపై నివేదిక ఇస్తారని ఆదేశించింది. 

అయినా బాబు దారుణ స్పందన:
    ఇంతగా సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించినా.. చంద్రబాబులో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు. ఆయనకు వ్యక్తిత్వం ఉంటే ముందు ప్రజలను క్షమాపణ కోరాలి. తర్వాత తిరుమలలో స్వామి వారిని తప్పు చేశానని వేడుకోవాలి. కానీ, అవేవీ చేయకుండా టీడీపీ ట్విటర్లో ఏం రాశారో చూడండి అంటూ.. ఆ ట్వీట్స్‌ చదివి వినిపించారు. 
    ‘చంద్రబాబుని కోర్టు తిడితే నీ పాపం పండింది జగన్‌.. అంటూ మమ్మల్ని తిట్టినట్టు వక్రీకరిస్తూ ట్వీట్‌ చేశారు. ఇంకా వక్రీకరణలో భాగంగా తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియక్‌ కావడంతో జగన్‌ రెడ్డి బావ ధర్మారెడ్డి, బాబాయి సుబ్బారెడ్డి, మామ కరుణాకర్‌ రెడ్డి అడ్డంగా బుక్కయ్యారని పెద్ద అబద్దం రాశారు.  

చంద్రబాబు మన ఖర్మ:
    నిజానికి సుప్రీంకోర్టు ఎవరినీ తప్పు పట్టింది?. ఎవరు దేవుడి దగ్గర దోషిగా నిలబడాలి?. ఎవరికి దేవుడంటే భయం, భక్తి ఉంది?. 
మన ఖర్మ ఏమిటంటే.. చంద్రబాబు వంటి అన్యాయమైన నాయకుడు మనకున్నాడు. ఈయనకు దేవుడంటే భయం, భక్తీ రెండు లేవు. దేవుడిని సైతం రాజకీయాల్లో వాడుకునే అన్యాయమైన బుద్ధి చంద్రబాబు లాంటి నాయకుల్లో ఉంది.
    కాబట్టే.. రాష్ట్రానికి  రాబోయే రోజుల్లో దేవుడి కోపం ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై  పడకూడదని నేను దేవుడ్ని వేడుకుంటున్నాను. అది చంద్రబాబుకే పరిమితం కావాలి. ఆయన మాట్లాడింది పచ్చి అబద్ధం అని తెలిసినా ఆయన్ను మోస్తున్న కూటమికి, ఆ నాయకులకే పరిమితం కావాలని అందరం దేవుడ్ని మొక్కుకోవాలి. నేను కూడా మొక్కుకుంటున్నాను. 

ఆ దేవదేవుడే చూసుకుంటాడు:
    చివరగా, ఒకటి గుర్తు పెట్టుకొండి. ఇవన్నీ వెలుగులోకి వచ్చాయంటే దేవుడి దయతోనే. అన్నీ ఆ వెంకటేశ్వరస్వామినే నడిపిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వరస్వామితో ఆడుకుంటున్నారు. ఇటువంటి అన్యాయాలు చేస్తున్న వ్యక్తులకు ఆయనే మొట్టికాయలు వేస్తాడు.

పవన్‌కు సనాతన ధర్మం తెలుసా?:
    పవన్‌కు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసా? సాక్షాత్తూ నువ్వు ఆ కూటమిలో ఉన్నావు. నీ కళ్ల ఎదుటే చంద్రబాబు ఆ తప్పు చేశాడు. అది నీతో సహా, ఆరేళ్ల పిల్లాడికి కూడా కనిపిస్తోంది. శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రాశస్త్యం, లడ్డూ విశిష్టతను తగ్గిస్తూ, కొన్ని కోట్ల మంది విశ్వాసాలకు విఘాతం కలిగిస్తూ.. చంద్రబాబు మాట్లాడితే.. అన్నీ తెలిసి నువ్వూ అదే మాట మాట్లాడావు. అలాంటి నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావు.
    దేవుడి విషయంలో తప్పు జరుగుతున్నా, ఎత్తి చూపకపోవడం ఎంత వరకు సబబు? అలాంటి నీవు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావు. అదేనా నీ సనాతన ధర్మం వైఖరి?.

చంద్రబాబులో కించిత్‌ మార్పు లేదు:
    సుప్రీంకోర్టు ఇంత ఆక్షేపించినా, చంద్రబాబు చేసిన తప్పు ఎత్తి చూపినా, ఆయన స్వయంగా వేసుకున్న సిట్‌ ను రద్దు చేసినా.. చంద్రబాబులో మార్పు లేదు.ఒక అబద్దాన్ని నిజం చేయడానికి మళ్లీ మళ్లీ అబద్ధాలు చెబుతున్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామితో ఆడుకుంటున్నాడు. 
ఆయనకు పరిహారం తప్పదు. తెలిసి తెలిసి వెంకటేశ్వరస్వామివారితో ఆడుకుంటున్నాడు.
    సుప్రీంకోర్టు అబ్జర్వేషన్లు ఇలా ఉన్నప్పుడు.. టీటీడీ ఈఓ మాటలు రికార్డుగా ఉన్నప్పుడు.. నిజానికి అక్కడ ఏమీ జరగలేదు. అయినా అక్కడ ఏదో జరిగినట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారు. అబద్ధాలకు రెక్కలు కట్టి, ప్రచారం చేస్తున్నారని శ్రీ వైయస్‌ జగన్‌ ఆక్షేపించారు.

Back to Top