తాడేపల్లి: పంట కొనుగోలు విషయంలో కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేస్తూ.. వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రతి గింజా ప్రభుత్వమే కొంటుందన్న పౌర సరఫరా శాఖా మంత్రి ఏమైపోయారని ప్రశ్నించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మంత్రి నాదెండ్ల మనోహర్ సొంత నియోజకవర్గంలోని కొల్లిపరను సందర్శించి ధాన్యం కొనుగోళ్ళ పనితీరుపై ఆరా తీశారు. ఈ మేరకు అక్కడ తాను తెలుసుకున్న సత్యాన్ని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అంబటి ట్విట్టర్ వేదికగా.. ‘నేను సందర్శించి తెలుసుకున్న సత్యం!. కొల్లిపర మండలంలో వరి సాగు విస్తీర్ణం 13,500 ఎకరాలు. ధాన్యం దిగుబడి 31వేల మెట్రిక్ టన్నులు. ప్రభుత్వం కొన్న ధాన్యం 1500 మెట్రిక్ టన్నులు. ప్రతీ గింజా ప్రభుత్వమే కొంటుందన్న పౌర సరఫరా శాఖా మంత్రి గారి నియోజకవర్గంలోనిదే ఈ కొల్లిపర!’ అంటూ కామెంట్స్ చేశారు. నేను సందర్శించి తెలుసుకున్న సత్యం! కొల్లిపర మండలం: వరి సాగు విస్తీర్ణం: 13,500 Acres ధాన్యం దిగుబడి :31000 MT ప్రభుత్వం కొన్న ధాన్యం : 1500 MT ప్రతి గింజా ప్రభుత్వమే కొంటుందన్న పౌర సరఫరా శాఖా మంత్రి గారి నియోజకవర్గంలోనిదే ఈ కొల్లిపర అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.