అనంతపురం: జేసీ వర్గీయులు తాడిపత్రిలో విచ్చలవిడిగా మట్కా,పేకాట ఆడిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరమని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఖండించారు. ఈ మేరకు పెద్దారెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. వైయస్ఆర్‌సీపీ నేతలపై దాడులు తీవ్రమయ్యాయి. బాధితులపైనే అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గం. నన్ను తాడిపత్రికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. నన్ను వెళ్లనీయకపోయినా పర్వాలేదు కానీ వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు ఆపాలి. అధికారంలో ఉన్నారని టీడీపీ ఏమి చేసినా చెల్లుతుందంటే చూస్తూ ఊరుకోం’అని పెద్దారెడ్డి హెచ్చరించారు.