చంద్రబాబు పాలన అంతా కక్షలు కార్పణ్యాలే

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఫైర్‌

ప్రకాశం జిల్లా: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మాజీ మంత్రి,  వైయ‌స్ఆర్‌సీపీ నేత మేరుగ నాగార్జున మండిపడ్డారు. అసలు చంద్రబాబు పాలన అంతా కక్షలు కార్పణ్యాలతో నడుస్తోందని ధ్వ‌జ‌మెత్తారు. గురువారం ఒంగోలులో మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ..ఆరోగ్యం బాగా లేదని పోసాని కృష్ణమురళి చెప్పినా వదల్లేదని, ఇంత నీచమా చంద్రబాబు అని మేరుగ ప్రశ్నించారు. అడ్డగోలుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు.రాష్ట్రంలో రైతులు విలవిలలాడుతున్నారని, ప్రభుత్వం మిర్చి రైతులను నిలువునా మోసం చేసిందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో వ్యవసాయం పండగలా సాగిందని,  చంద్రబాబు పాలనలో అదే వ్యవసాయం నిర్వీర్యం అయ్యిందన్నారు. 

ఇది కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు
అన్నమయ్య జిల్లా:
పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్టు అనేది టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య అని మదనపల్లి వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌ నిసార్ అహ్మద్ ఫైర్ అయ్యారు. పోసాని అనారోగ్యంతో ఉన్నప్పటికీ పోలీసులు రాత్రివేళ అరెస్టు చేయడం అన్యాయమన్నారు.
రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా ఎదురించి నిలబడతామన్నారు నిసార్ అహ్మద్‌

Back to Top