చంద్ర‌బాబు ఫుడింగి అయితే..పొత్తులెందుకు?

పొన్నూరు ప్ర‌చార స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ వైయ‌స్ జ‌గ‌న్ ఒక్క‌డే ఒక‌వైపు

మోసం చేసిన దుష్ట‌చ‌తుష్టయం మ‌రోవైపు

నన్ను ఎదుర్కోవడానికి ఇన్ని పార్టీలతో పొత్తు అవసరమా..? 

ఈ ఎన్నిక‌లు రాబోయే ఐదేళ్ల భ‌విష్య‌త్‌

జ‌గ‌న్‌కు ఓటు వేస్తే ప‌థ‌కాల‌న్నీ కొన‌సాగింపు

పొర‌పాటున బాబుకు ఓటేస్తే..ప‌థ‌కాల‌న్నీ ముగింపే

బాబును న‌మ్మ‌డం అంటే కొండ చిలువ నోట్లో త‌ల‌పెట్టిన‌ట్లే

ఎన్నిక‌ల‌య్యాక చంద్ర‌బాబు మేనిఫెస్టోను చెత్తబుట్ట‌లో వేస్తాడు

మీ బిడ్డ వైయ‌స్ జ‌గ‌న్ మేనిఫెస్టోలోని 99 శాతం హామీల‌ను నెర‌వేర్చాడు

పొన్నూరు: చంద్ర‌బాబు ఫుడింగి అయితే..పొత్తులెందుకని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు న‌న్ను బ‌చ్చా అంటున్నాడు..పోయే కాలం వ‌చ్చిన‌ప్పుడు విల‌న్ల‌కు హీరో బ‌చ్చానే. ఈ బ‌చ్చానే ప్ర‌తి ఇంటికి మంచి చేసి ఓట్లు అడుగుతున్నాడు. 14 ఏళ్లు సీఎంగా ప‌ని చేసిన చంద్ర‌బాబు ఒక్క మంచి అయినా చేశాడా అని ప్ర‌శ్నించారు.  నన్ను ఎదుర్కోవడానికి ఇన్ని పార్టీలతో పొత్తు అవసరమా..? అని నిల‌దీశారు. వాలంటీర్ వ్యవస్థ, రైతు భరోసా, నాడు నేడు , వంటి కార్యక్రమాలతో తాను ప్రజల్లో మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నానని ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పొన్నూరు సభలో సీఎం వైయ‌స్‌ జగన్ ప్ర‌సంగించారు.

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..

పొన్నూరు సిద్ధమా?.. ఇంత మండుటెండలో కూడా ఇంతటి అభిమానం చూపిస్తూ చిక్కటి చిరునవ్వుల మధ్య ప్రేమానురాగాలు పంచి పెడుతున్న నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, నా ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, నా ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ ముందుగా మీ జగన్.. మీ బిడ్డ రెండు చేతులూ జోడించి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాడు. 

 

*మోసాలు, అబద్దాలు, కుట్రల కూటమితో యుద్ధం చేస్తున్నాం.*

మరో రెండు వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది. ఈ యుద్ధంలో అటువైపున ఉన్నది కౌరవ సైన్యం. దుష్ట చతుష్టయం. అటు గతంలో వాళ్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ మోసం చేసిన చరిత్ర ఆ కూటమిది. అటు చంద్రబాబు, ఆయనకు మద్దతుగా రెండు జాతీయ పార్టీలు, ఒక వదినమ్మ, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5.. వీరందరూ సరిపోరు అన్నట్టుగా వీరి కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, అబద్ధాలు.. వీళ్లందరితో కూడా ఈరోజు యుద్ధం చేస్తున్నాం. 

 

*మీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని, ఆ దేవుడిని...*

ఎప్పుడూ గతంలో ఏ పేదవాడికీ, ఏ మంచీ కూడా చేసిన చరిత్ర లేని వీళ్లందరూ కూడా అటువైపున కూటమిగా ఉండి ఈరోజు మీ బిడ్డపై యుద్ధం చేస్తున్నారు. ఇటువైపున మీ బిడ్డ ఒక్కడే ఒక్కడు. ఇంటింటికీ మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఒక్కడు. మీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని, పైనున్న ఆ దేవుడిని. మీ బిడ్డకు పొత్తు ఎవరితో అంటే అదీ మంచి చేసిన మీ అందరితోనే అని గర్వంగా చెబుతున్నాడు. 

 

జరగబోతున్న ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతున్న ఎన్నికలు కానేకావు. ఈ జరగబోతున్న ఈ ఎన్నికలు రాబోయే 5 సంవత్సరాలు మీ ఇంటింటి అభివృద్ధిని, పేద కుటుంబాల భవిష్యత్తును, పేద కుటుంబాల తలరాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు. ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవటమే. ఇది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని, ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని మీ అందరితో మీ బిడ్డ తెలియజేస్తున్నాడు. 

 

చంద్రబాబును నమ్మటం అంటే కొండచిలువ నోట్లో తలకాయపెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతున్నాను. మనందరి వైయస్సార్ కాంగ్రెస్.. 2024కు సంబంధించిన మేనిఫెస్టోకు అర్థం పేదలకు మరింత మంచి చేస్తూ పేదల భవిష్యత్తు కోసం మరో రెండు అడుగులు ముందుకు వేస్తూ ఇంటింటి అభివృద్ధికి, ఇంటికే అందుతున్న పౌర సేవలు, పథకాలు వీటన్నింటి కొనసాగింపే మన మేనిఫెస్టోకు అర్థం. అందరూ ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఎప్పుడూ రాష్ట్రంలో జరగని విధంగా ఇంతకు ముందు అంతా ఎన్నికలప్పుడు మాట ఇచ్చేవాళ్లు, మేనిఫెస్టో అని చెప్పేవాళ్లు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే రోజులు గతంలో మనమంతా కూడా చూశాం. 

కానీ మొట్టమొదటిసారిగా ఏకంగా ఒక మేనిఫెస్టోను బైబిల్ గా, ఖురాన్, భగవద్గీతగా భావిస్తూ మేనిఫెస్టోకు అర్థం చెబుతూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99 శాతం హామీలను ఏదైతే చెప్పామో అది చేసి అది చూపించి ఈరోజు మీ అందరి ఆశీర్వాదాలు తీసుకునేదాని కోసం, ఎన్నికల బరిలో మీ బిడ్డ దిగుతున్నాడు. విశ్వసనీయత ఉన్న మీ ప్రభుత్వం మీద విలువలు, విశ్వసనీయత లేని చంద్రబాబు ఎలా నోరు పారేసుకుంటున్నారో మీరంతా చూస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నప్పుడు మీరంతా వింటున్నారు కదా. నిజంగా చంద్రబాబు  నాయుడు గారు మాట్లాడే మాటలు వింటుంటే, ఆయన మాటలు చూస్తే ఒక్కొక్కసారి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి.. ఆయన హయాంలో ఆయనేం చేశాడు? ఆ చేసిన మంచేమిటి? అని ఆ మంచిని చూపించి ఓట్లు అడగాల్సింది పోయి ఆయన మీటింగులో ఆయన చేస్తున్నదేమిటి అంటే జగన్ ను తిట్టి తిట్టి పెడుతుంటాడు ఈ పెద్దమనిషి చంద్రబాబు. 

 

*పోయేకాలం వచ్చినప్పుడు విలన్లకి హీరో బచ్చాలా కనిపిస్తాడు.*

ఈ మధ్య చంద్రబాబు ఏమంటున్నాడు? నన్ను ఒక బచ్చా అంటున్నాడు. అవును. ఓడిపోయే కాలం వచ్చినప్పుడు హైదరాబాద్ కు వెనక్కు పోయే కాలం వచ్చినప్పుడు, పోయేకాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హీరో బచ్చాగానే కనిపిస్తాడు. అయ్యా చంద్రబాబూ.. నువ్వు బచ్చా అంటున్న నేను ఇంటింటికీ మంచి చేసి, ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా నిలబడి ప్రజల్ని ఓటు అడుగుతున్నాడు నువ్వు బచ్చా అంటున్న మీ జగన్. ఇంటింటికీ మంచి చేసి ఒంటరిగా నిలబడి ధైర్యంగా అడుగుతున్నాడు. మరి 14 ఏళ్లు సీఎం అంటావు, 3 సార్లు సీఎంగా చేశాను అంటావు. మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క మంచైనా నువ్వు చేసింది గుర్తుకు వస్తుందా? అని అడుగుతున్నాను ఈ పెద్దమనిషి చంద్రబాబునాయుడుని. 

 

*చేసిన మంచి చూపించి ఓటడిగే పరిస్ధతి నీకు ఉందా చంద్రబాబూ?.*

మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒక్కటి నువ్వు చేసిన మంచి స్కీము గుర్తుకు వస్తుందా? అని మీ అందరి సమక్షంలో అడుగుతున్నాను. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన నువ్వు.. ప్రజలకు మీకు ఫలానాది చేశాను.. నాకు ఓటు వేయండి అని ఎందుకు అడగలేకపోతున్నావయ్యా చంద్రబాబూ.. అని ఈరోజు అడుగుతున్నాను. నువ్వు బచ్చా అంటున్న మీ జగన్.. ఈరోజు ప్రజల ముందు నిలబడి నేను ఫలానది చేశాను, ఇంటింటికీ మంచి చేశాను, చేసిన ఆ మంచిని చూసి మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి పిలుపునిస్తుంటే మరి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు నీ పేరు చెబితే ప్రజలకు గుర్తుకొచ్చేది ఒక్కటంటే ఒక్కటైనా ఉందా చంద్రబాబూ అని అడుగుతున్నాను. ఆ చేసిన మంచిని చూపించి, నేను ఈ మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి నీకు ఉందా చంద్రబాబూ? 

 

*నన్ను ఎదుర్కునేందుకు భయపడే పొత్తులు..*

మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు.. కేవలం 58 నెలల పాలన చేసిన నన్ను బచ్చా అంటున్న మీ జగన్ ను చూసి ఎందుకు భయపడుతున్నావయ్యా చంద్రబాబూ.. అని అడుగుతున్నాడు మీ బిడ్డ. అయ్యా చంద్రబాబూ.. నువ్వు నిజంగా అంత పుడింగువే అయితే బచ్చా అంటున్న నన్ను ఎదుర్కునేదానికి ఇన్ని పార్టీలతో పొత్తులెందుకయ్యా అని చంద్రబాబును అడుగుతున్నాను. నువ్వు అంటున్న నేను బచ్చానే అయితే ఇంటింటికీ సేవలందిస్తూ నేను తెచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలు 60-70 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ, రైతన్నను చేయిపట్టుకుని నడిపిస్తూ రైతు భరోసా కేంద్రాలు, గ్రామంలోనే విలేజ్ క్లినిక్స్, నాడునేడుతో బాగుపడిన ఇంగ్లీషు మీడియం బడులు, గ్రామంలోనే ఓ మహిళా పోలీసు, గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్, గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు. మరి ఇవన్నీ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన నువ్వు ఎందుయ్యా తేలేకపోయావు చంద్రబాబూ అని అడుగుతున్నాను. 

 

అయ్యా చంద్రబాబూ.. నువ్వు బచ్చా అంటున్న ఈ జగన్.. నా 58 నెలల పాలనలో ఎక్కడా అవినీతి లేకుండా, వివక్ష లేకుండా ఏకంగా 130 సార్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్లిపోతోంది. ఎక్కడా లంచాలు లేవు. ఎక్కడా వివక్ష లేదు. మరి నేను అడుగుతున్నాను. నేను బచ్చాను అయితే.. నువ్వెందుకు చేయలేకపోయావయ్యా చంద్రబాబూ.. నువ్వెందుకు ఇన్ని బటన్లు నొక్కలేకపోయావు చంద్రబాబూ అని ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతున్నాను. నేను బచ్చాను అయితే ఒక అమ్మ ఒడిగానీ, చేయూత గానీ, ఆసరాగానీ, సున్నావడ్డీ గానీ, రైతు భరోసా గానీ, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, వాహనమిత్ర, ఇంటికే వచ్చి ఇస్తున్న అవ్వాతాతల రూ.3 వేల పెన్షన్, నేతన్న నేస్తం, విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న తోడు, జగనన్న చేదోడు, మత్స్యకార భరోసా గానీ.. ఇలాంటి పథకాలన్నీ కూడా నువ్వు బచ్చా అంటున్న మీ జగన్ చేసినప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఒక్కటంటే ఒక్కటి చేయలేకపోయావు అని మీ బిడ్డ అడుగుతున్నాడు . 

 

*5 ఏళ్లలో జగన్ చేసిన పథకాలే చేస్తానంటున్నావంటే..*

నువ్వు 14 ఏళ్లు చేయకపోగా ఇప్పుడు ఎన్నికల వేళ ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు జగన్ ఈ 5 సంవత్సరాల్లో చేసిన ఈ పథకాలనే నువ్వు కూడా చేస్తాను అని చెబుతున్నావంటే దాని అర్థం ఏమిటి అని అడుగుతున్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబును. ఎవరు బచ్చా? ఎవరు లీడర్ అని ఈ సందర్భంగా ఇదే చంద్రబాబు నాయుడును అడుగుతున్నాను. 

 

నాడు-నేడు ద్వారా ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వ బడులు బాగుపడ్డాయన్నా, ప్రభుత్వ హాస్పిటల్లు బాగుపడ్డాయన్నా, ఈరోజు పిల్లలు వెళ్లే స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంతో పిల్లలు చదువుతున్నా కూడా, ఆ పిల్లల చేతుల్లో ఈరోజు ట్యాబులు కనిపిస్తున్నా, ఈరోజు డిజిటల్ బోధనతో ఆరో క్లాసు నుంచి అన్ని క్లాస్ రూముల్లో ఏకంగా ఐఎఫ్‌పీలు పెట్టి పిల్లలకు డిజిటల్ బోధన ఇస్తున్నాం. ఈరోజు ప్రతి గ్రామానికీ ఒక ఫ్యామిలీ డాక్టర్, ప్రతి గ్రామంలోనూ ఈరోజు ఒక విలేజ్ క్లినిక్, ప్రతి గ్రామంలో ఇంటింటికీ విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కనిపిస్తుంది. వీటి అన్నింటితో ఏరోజైనా కూడా గ్రామానికి వెళ్లి చూశావా? ఈ 58 నెలల కాలంలో నువ్వు బచ్చా అంటున్న ఈ జగన్ ఏమేమి చేశాడో ఎప్పుడైనా వెళ్లి చూశావా చంద్రబాబూ? అని అడుగుతున్నాను. 

 

నా అక్కచెల్లెమ్మల కొరకు ఏకంగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇన్నిన్ని పథకాలు తీసుకుని రావడమే కాకుండా నా అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో కడుతున్న 22 లక్షల ఇళ్లు, ఇంటికే వచ్చే పౌర సేవలు, ఇంటికే వచ్చే పథకాలు.. ఈరోజే ఏ గ్రామంలో ఎవరిని కదిలించినా కూడా ..లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఈరోజు ప్రతి ఇంటికీ పథకాలు అందుతున్నాయంటే అది కూడా జరుగుతున్నది ఈ 58 నెలల పాలనలోనే. నువ్వు బచ్చా అంటున్న ఈ జగన్ పాలనలోనే అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాను. 

 

ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా కేబినెట్ లో ఇవాళ 68 శాతం.. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు ఈరోజు కనిపిస్తున్నారు.  130 బటన్లు నొక్కి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏదైతే పంపించామో.. అందులో ఏకంగా 75 శాతం పైచిలుకు ఈరోజు నేను నానానానా అని పిలుచుకునే పేద వర్గాలకే దక్కింది అంటే ఈరోజు మనం వచ్చిన తర్వాత ఏకంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి అందులో ఏకంగా 80 శాతం పైచిలుకు ఈరోజు నానానానా అంటూ మన పిల్లలే అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారంటే.. మొట్ట మొదటి సారిగా ఈరోజు ఆలయ కమిటీలతోపాటు నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేటెడ్ కాంట్రాక్టుల్లోనూ ఈరోజు నేను నా..నా.. అని పిలుచుకునే నా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ఏకంగా 50 శాతం రిజర్వేషన్లు చట్టం చేసి మరీ తగిన ప్రాతినిధ్యం, తగిన ఆత్మగౌరవం దక్కుతోంది మీ జగన్ పాలనలోనే. 

 

*50శాతం స్ధానాల్లో పోటీలో ఉన్నది కూడా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే.*

దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు మన రాష్ట్రంలో ఉంటే ఈ 200 స్థానాలకు గానూ ఏకంగా 50 శాతం అంటే 100 స్థానాలు నేను నానానానా అని పిలుచుకునే నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ వర్గాలకే ఈరోజు టికెట్లు ఇచ్చి వాళ్లే ఈరోజు మన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారంటే సామాజిక న్యాయానికి ఇదీ అర్థం అని చెబుతూ ప్రపంచానికి చూపించింది నువ్వు బచ్చా అంటున్న ఈ జగన్ పరిపాలనలోనే కాదా అని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ తెలియజేస్తున్నాను. 

 

 

మరి నేను ఇదే చంద్రబాబును అడుగుతున్నాను. మరి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశావు కదా. 3 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటావు కదా. మరి సామాజిక న్యాయంలో నువ్వు చేసింది ఏందయ్యా అని చంద్రబాబును గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నాను. ఓ మోసాల బాబూ.. ఓ మోసాలయ్యా.. నువ్వు ఎలాంటి వాడివో, నీ కూటమి ఎలాంటిదో చెప్పటానికి కేవలం ఈ ఒకే ఒక్క పాంప్లెట్ సరిపోదా అని అడుగుతున్నాను. ఇది గుర్తుందా మీ అందరికీ(మేనిఫెస్టో చూపిస్తూ). ఇది 2014లో ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో కూటమిగా ఇదే ముగ్గురితో కలిసి ఇదే ముగ్గురి ఫొటోలతో ముఖ్యమైన హామీలు అంటూ మీ ప్రతి ఇంటికీ ఆయన సంతకం పెట్టి పంపించాడు ఆరోజు 2014లో. గుర్తుందా అన్నా ఇదీ. 

 

ఎక్కడ మీరు మర్చిపోతారేమో అని ఇదే వారి ఈటీవీలో, టీవీ5, ఏబీఎన్‌లో అడ్వర్టైజ్ మెంట్లు ఊదరగొట్టారు. 2014లో చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి.. ప్రతి ఇంటికీ పంపించిన ఈ పాంప్లెట్ లో ఆయన ఏం చెప్పాడు? ఏం చేశాడు అన్నది అడుగుదామా? అన్నా, అక్కా, అడుగుదామా మరి?. 

 

*చంద్రబాబు విఫల హామీలు..*

ఈ పాంప్లెట్ లో ఆయన చెప్పినది.. రైతు రుణ మాఫీ అంటూ మొదటి సంతకం చేస్తానన్నాడు. రూ.87,612 కోట్ల రుణాల మాఫీ జరిగిందా? ఆయన చేసిన రెండో హామీ ఏమిటోతెలుసా? పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తాను అన్నాడు. మరి రూ.14,205 కోట్లు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు ఇందులో ఒక్క రూపాయి అయినా చేశాడా? ఆయన చెప్పిన మూడో హామీ.. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. కనీసం ఒక్క రూపాయి అయినా చేశాడా? అని అడుగుతున్నాను. ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు ఆయన చెప్పిన ముఖ్యమైన హామీలు ఇంకోటి చదవమంటారా? ఇంటింటికీ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెలా రూ.2 వేలు నిరుద్యోగభృతి ఈ పెద్దమనిషి చెప్పాడు. 60 నెలల్లో నెలకు రూ.2 వేల చొప్పున రూ.1.20 లక్షలు ఇచ్చాడా అని అడుగుతున్నాను. 

 

ఇంకా ముందుకు పోతే... అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. నేను అడుగుతున్నాను. ఇంత మంది మీరంతా ఇక్కడ ఉన్నారు. మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? 

రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ మాఫీ అన్నాడు. జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా? సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. జరిగిందా? పొన్నూరులో ఏమైనా కనిపిస్తోందా? అని అడుగుతున్నాను. 

 

మరి అందరూ ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇవన్నీ ఏదైతే నేను చదివానో స్వయానా చంద్రబాబు 2014లో ఇదే కూటమిగా ఏర్పడి ముఖ్యమైన హామీలంటూ ఆయన సంతకం పెట్టి ప్రతి ఇంటికీ పంపించిన ఈ పాంప్లెట్ లో నుంచి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా జరిగిందా? పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? అదీ లేదు. మరి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇలాంటి వాళ్లను నమ్మవచ్చా? అని మిమ్మల్ని అందరినీ నీఅడుగుతున్నాను. మరి ఇప్పుడేమంటున్నారు? ఇప్పుడు మళ్లీ ఇదే కూటమిగా వీళ్లే మోసం చేసేందుకు ఇవాళ ఏమంటున్నారు? సూపర్ సిక్స్ అంటున్నారు. సూపర్ సెవెన్ అంటున్నారు. ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు. నమ్ముతారా? ఇంటింటికీ బెంజ్ కారు కొనిస్తామంటున్నారు. నమ్ముతారా? మరి ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇలాంటి దారుణమైన మోసాలు, అబద్ధాలతో ఈరోజు మనం యుద్ధం చేస్తున్నాం. మీ అందరితోనూ అందుకే చెబుతున్నాను. 

 

*పథకాలు మీ గడపకు రావాలంటే ఫ్యానుకే మీ ఓటు.*

వాలంటీర్లు మళ్లీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తుమారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, ఆ పథకాలన్నీ ఇంటికే రావాలన్నా, మన పిల్లలు, మన చదువులు, మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యం, మన ఆరోగ్యం, మన వ్యవసాయం ఇవన్నీ మెరుగుపడాలన్నా మీలో ప్రతి ఒక్కరికీ కూడా తెలియజేస్తున్నాను.. ఇవన్నీ జరగాలంటే ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలూ.. తగ్గేదే లేదు. సిద్ధమేనా? 

 

మన గుర్తు.. అక్కా మన గుర్తు ఫ్యానక్కా. అన్నా మన గుర్తు ఫ్యాను అన్నా. అవ్వా మన గుర్తు ఫ్యాను, తాతా మన గుర్తు ఫ్యాను, తమ్ముడూ మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడుండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్ లోనే ఉండాలి.  పొన్నూరు ఎమ్మెల్యేగా అంబటి మురళిని గెలిపించండి. గుంటూరు ఎంపీగా కిలారు రోశయ్యను గెలిపించండి అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభ్య‌ర్థించారు.

 

మీ అందరు  ప్రేమ, అభిమానాలతో మన పార్టీ అభ్యర్థుల పై మీ ఆశీస్సులు ఉంచి గెలిపించండి. 

మండుతున్న ఈ ఎండను ఏ మాత్రం లెక్కపెట్టకుండా మీ చిక్కటి చిరునవ్వుల మధ్య, మీ ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు మరొక్కసారి మీ బిడ్డ రెండు చేతులూ జోడించి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాడు అని చెబుతూ సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.

Back to Top