పథకాలు ఆపగలరు కానీ..మా విజయాన్ని ఆపలేరు

రాజానగరం రోడ్‌షోలో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

14 ఏళ్లు సీఎంగా చేశానంటున్న చంద్రబాబు ఏం చేశాడు?

చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా?

2019లో ప్రజలు సైకిల్‌ను పార్ట్‌ పార్ట్‌గా పీకి పక్కన పడేశారు

తుప్పు పట్టిన సైకిల్‌కు రిపేర్‌ చేయాలని బాబు కష్టపడుతున్నాడు

దత్తపుత్రుడు సైకిల్‌పై కూర్చొని టీ మాత్రమే తాగుతానన్నాడు

వదినమ్మను ఢిల్లీ పంపాడు..పెద్దలు సైకిల్‌కు పార్ట్‌లే లేవు..ఎలా బాగు చేస్తావయ్యా 
అని అడిగారు

తుప్పు పట్టిన సైకిల్‌ బెల్‌ కొడుతూనే ఉన్నాడు..ఆ బెల్‌ పేరే అబద్ధాల మేనిఫెస్టో

అధికారం దక్కితే చంద్రబాబు చేసేది మోసాలే

రైతు రుణాలు మాఫీ చేస్తానన్నాడు..చేశాడా? 

ఢిల్లీతో కుట్రలు పన్ని బటన్లు నొక్కిన సొమ్ము నా అక్కచెల్లెమ్మలకు అందకుండా అడ్డుకుంటున్నారు

ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఢిల్లీ వాళ్లతో కలిశారు

జూన్‌ 4న మళ్లీ మీ బిడ్డ అధికారంలోకి వస్తాడు

మళ్లీ మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తరువాత పథకాలు అందిస్తాం

రాజానగరం: చంద్రబాబు ఢిల్లీతో కలిసి కుట్రలు చేసిపథకాలు ఆపగలరు కానీ..మా విజయాన్ని ఆపలేరని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హెచ్చరించారు. ఓటు అనే అస్త్రంతో ఈ చంద్ర‌బాబుకు గుణ‌పాఠం చెప్పాల‌ని పిలుపునిచ్చారు. ఈ రోజు రాష్ట్రంలో క్లాస్ వార్ జ‌రుగుతోంది. పేద‌వాడు ఒక‌వైపు..పెత్తందార్లు ఒక‌వైపు ఉన్నారు. ఎవ‌రు మీకు మంచి చేశారో ..ఎవ‌రు ఉంటే ఆ మంచి కొన‌సాగుతుంద‌న్న‌ది మాత్ర‌మే మీరు వేసే ఓటు నిర్ణ‌యిస్తుంద‌ని గుర్తించుకోవాల‌న్నారు. జూన్‌ 4న మళ్లీ మీ బిడ్డ అధికారంలోకి వస్తాడు, పథకాలన్నీ అందిస్తాడని మాటిచ్చాడు. మంగళవారం రాజానగరం రోడ్‌షోలో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు.

ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే.. 

రాజానగరం సిద్ధమా... ?
మ‌ధ్యాహ్నం 12 గంట‌లు కావస్తోంది. ఎండ తీక్షణంగా ఉంది. అయినా కూడా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతలు చూపిస్తున్న ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, నా ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, నా ప్రతి స్నేహితుడికి, ప్రతి సోదరుడికీ... మీ అందరి ఆప్యాయతలకు ముందుగా మీ బిడ్డ చేతులు జోడించి పేరు, పేరుగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు.

మరో ఆరు రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతుంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకోవడానికి జరగబోతున్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్లలో మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీరు జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోవడమే. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే అని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకొండి. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపటమే అన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకొండి.

దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈ 59 నెలల మీ బిడ్డ పరిపాలనలో గతంలోఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు వివిధ పథకాల ద్వారా నేరుగా బటన్లు నొక్కి ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా అందించాం. మళ్లీ చెప్తున్నాను రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా రూ.2.70 లక్షల  కోట్లు వివిధ పథకాల ద్వారా నా అక్కచెల్లెమ్మలకు మీ బిడ్డ బటన్ నొక్కి నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు అందించాం.
తమ్ముడు మిమ్నల్నే అడుగుతున్నాను.. అక్కా మిమ్నల్నే అడుగుతున్నాను. 
గతంలో ఎప్పుడైనా ఇలా బటన్లు నొక్కి నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ కావడం జరిగిందా? గతంలో ఎప్పుడూ చూడని విధంగా మీ బిడ్డ అధికారంలోకి వచ్చేవరకు.. రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ఉద్యోగాలుంటే.. కేవలం ఈ 59 నెలల కాలంలో మరో 2.31వేలు ఉద్యోగాలు రాష్ట్రచరిత్రలో ఎప్పుడూ జరగనిది, మీ బిడ్డ పాలనలో జరిగించినది వాస్తవం అవునా కాదా .
ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా జరిగిందా ఆలోచన చేయండి. 
మేనిఫెస్టోలో చెప్పినది ఏకంగా 99శాతం అమలు చేసి.. ప్రతి ఇంటికి ఆ మేనిఫెస్టో అక్కా, చెల్లెమ్మా ఇదిగో మా మేనిఫెస్టో.. ఇందులో చెప్పినవన్నీ మీ బిడ్డ పాలనలో జరిగాయా లేదా అన్నది మీరే టిక్కు పెట్టండి అని చెప్పి... మొట్టమొదటిసారిగా మేనిఫెస్టోకు అర్ధం చెబుతూ.. అందులో 99 శాతం హామీలను నెరవేర్చి.. ఆ మేనిఫెస్టోని ప్రతి అక్కకూ, చెల్లెమ్మ ఇంటికి పంపించి.. వారితో టిక్కు పెట్టించి.. వారి చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ల ఆశీస్సులు తీసుకున్న ప్రభుత్వం ఇది. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా ?

మచ్చుకు నేను గడాగడా ఇప్పుడు కొన్ని పథకాలు చెబుతాను. ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఎవరైనా చేశారా ? మీరెప్పుడైనా చూశారా ? అన్నది నేను మిమ్నల్నే ఆలోచన చేయమని కోరుతున్నాను.
నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంటు బడులు, గవర్నమెంటు బడులలో ఇంగ్లిషు మీడయం, 6వ తరగతి నుంచే క్లాస్ రూమ్ లలో డిజిటల్ బోధన, 8వతరగతికి వచ్చేసరికి ప్రతి పిల్లాడి చేతిలో ట్యాబులు, ఇంగ్లిషు మీడియంతో మొదలుపెడితే 3వ తరగతి నుంచో టోఫెల్ క్లాసులు, సబ్జెక్టు టీచర్లు, ఐబీ వరకు ప్రయాణం, పిల్లల చేతుల్లో బైలింగువల్ టెక్ట్స్ బుక్స్ అంటే ఒక పేజీ ఇంగ్లిషు మరో పేజీ తెలుగులో అందుబాటులోకి తెచ్చాం. బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యాకానుక, బడులలో పిల్లలకు గోరుముద్ద ,పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు ఓ అమ్మఒడి, పూర్తి ఫీజులు కడుతూ ఆ తల్లులకు, పిల్లలకుఅండగా ఉంటూ జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, పెద్ద చదువుల కరిక్యులమ్ లో ఇంటర్నేషనల్ యూనివర్సిటీలను ఆన్ లైన్ సర్టిఫైడ్ కోర్సులతో భాగస్వామ్యం చేయడం, ఇంటర్న్ షిప్ ను తప్పనిసరి చేయడం...  విద్యారంగంలో నేను చెప్పినవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.

గతంలో ఎప్పుడూ జరగని విధంగా నా అక్కచెల్లెమ్మలు వాళ్లు కాళ్ల మీద వాళ్లు నిలపబడాలని, అక్కచెల్లెమ్మల ఆర్ధిక స్వావలంబన కోసం ఎప్పుడూ చూడని విధంగా అక్కచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ అందులో కడుతున్నవి 22 లక్షల ఇళ్లు..ఈ పథకాల మాదిరిగా ఎప్పుడైనా జరిగాయా ? అన్నా నేను మిమ్నల్నే అడుగుతున్నాను. చెల్లెమ్మా మిమ్మల్నే అడుగుతున్నాను. 

అవ్వాతాతలకు ఇంటికే రూ.3వేలు పెన్షన్, ఇంటివద్దకే పౌరసేవలు, ఇంటివద్దకే రేషన్, ఇంటి వద్దకే పథకాలు... ఇలా నేరుగా మీ ఇంటి వద్దకే రేషన్, పథకాలు వంటివి గతంలో ఎప్పుడైనా జరిగిందా ?
గతంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా రైతన్నలకు పెట్టుబడి కోసం సాయంగా రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంట బీమా, సీజన్‌ ముగిసేలోగా రైతన్నలకు  మొట్టమొదటిసారిగా అందుతున్న ఇన్ పుట్ సబ్సిడీ, పగటిపూడే 9 గంటలకు పాటు రైతన్నలకు ఉచిత విద్యుత్, గ్రామస్ధాయిలోనే రైతన్నను చేయిపట్టుకుని నడిపిస్తూ గ్రామస్ధాయిలోనే ఆర్బీకే వ్యవస్ధ.. ఇటువంటి పాలన, రైతన్నను ఇలా చేయిపట్టుకుని నడిపించే అడుగులు గతంలో ఎప్పుడైనా జరిగాయా ?

స్వయం ఉపాధికి అండగా...
స్వయం ఉపాధికిఅండగా ఎప్పుడూ, ఎవరూ ఊహించని విధంగా ఆటోలు, టాక్సీలు నడిపేవారికి తోడుగా వాహనమిత్ర, నేతన్నలకు నేతన్ననేస్తం, మత్స్యకారులు మత్స్యకార భరోసా, చిరువ్యాపాలుకు అండగా ఓ తోడు, ఓ చేదోడు, లాయర్లకు అండగా లా నేస్తం ఈ మాదిరిగా స్వయం ఉపాధికి అండగా నిల్చిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా ?
గతంలో ఎప్పుడూ చూడని విధంగా వైద్యం కోసం ఏ పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని... రూ.25 లక్షల వరకు విస్తరించిన ఉచిత ఆరోగ్యశ్రీ, ఆపరేషన్ తర్వాత కూడా పేదవాడు ఇబ్బంది పడకూడదని ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష.. ఇంతగా పేదవాడి ఆరోగ్యం మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా ? అని అడుగుతున్నాను. వీటన్నంటితో పాటు ఏ గ్రామానికి వెళ్లినా ఆ గ్రామంలో 600 రకాల సేవలందిస్తున్న సచివాలయం.
ఆ గ్రామంలో 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చి సేవలందించే వాలంటీర్... అదే గ్రామంలో రైతన్నను చేయిపట్టుకుని నడిపిస్తూ ఆర్బీకే, దానికి పక్కనే ఓ విలేజ్ క్లినిక్, మరో నాలుగు అడుగులు వేస్తే నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లిషు మీడియం బడి, అదే గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, నా అక్కచెల్లెమ్మలకు భద్రతగా, తోడుగా గ్రామంలోనే మహిలా పోలీసు, నా అక్కచెల్లెమ్మలకు తోడుగా వాళ్ల ఫోన్ లలోనే దిశా యాప్.. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అక్కా జరిగాయా? చెల్లెమ్మా జరిగాయా?

మరోవంక చంద్ర 14 సంవత్సరాలు పాటు 3 సార్లు సీఎంగా చేశానంటాడు.
కానీ నేను అడుగుతున్నాను. చంద్రబాబు పేరు చెబితే ఏ పైదకైనా ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా?.
14 ఏళ్లు సీఎం అంటాడు. 3 సార్లు సీఎం అంటాడు. మరి ఆయన పేరు చెబితే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీం ఏ పేదవాడికైనా గుర్తుకు వస్తుందా ?.
ఎన్నికల ముందు చంద్రబాబు రకరకాల వాగ్ధానాలు ఇచ్చి.. ఆ తర్వాత అవి అమలుచేయకపోవడం వల్ల తమకు కలిగిన నష్టానికి ప్రతీకారంగా రైతన్నలు, నిరుద్యోగులు, అక్కచెల్లెమ్మలు, సామాజికవర్గాలు, పల్లె ప్రజలు, పట్టణ ప్రజలు, రైతన్నలు అంతా కలిసి చంద్రబాబు సైకిల్ ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారు.

ఆ తుప్పు పట్టిన సైకిల్ కు రిపేరు చేయాలని చంద్రబాబు చాలా కష్టపడుతున్నాడు. అందులో భాగంగా ముందుగా ఎర్రచొక్కాల దగ్గరకి వెళ్ళాడు. అక్కడ ఫలితం లేదు. ఆ తర్వాత దత్తపుత్రుడి దగ్గరకు వెళ్లాడు. దత్తపుత్రుడు సైకిల్ మొత్తం చూసి.. సైకిల్ తుప్పుపట్టింది, నేను కేరియర్ మీద మాత్రమే ఎక్కుతాను, టీ గ్లాస్ పట్టుకుని తాగుతాను. మిగిలింది నా వల్ల కాదన్నాడు.

తర్వాత వదినమ్మను ఢిల్లీకి పంపాడు. అక్కడ మెకానిక్స్ ను ఇక్కడికి దింపి.. సైకిల్ ఓ షేపులోకి తీసుకురమ్మని అడిగాడు. ఢిల్లీ నుంచి ఆ మెకానిక్స్ ఇక్కడికి వచ్చి.. తుప్పు పట్టిన సైకిల్ ను చూశారు. సైకిల్ కు హేండిల్ లేదు, సీటు లేదు. ఫెడల్స్ లేవు. చక్రాలు లేవు, ట్యూబులు లేవు. మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు. మరి ఇంత తుప్పుపట్టిన సైకిల్ ను ఎలా బాగుచేస్తాం చంద్రబాబూ అని అడిగితే పిచ్చిచూపులు చూస్తూ... ఇదొక్కటే మిగిలిందని బెల్లు చూపించి.. ట్రింగ్.. ట్రింగ్ మని బెల్లు కొట్టడం మొదలుపెట్టారు. 
ఆ బెల్లు పేరే అబద్దాల మేనిఫెస్టో.

ఇలా అధికారంలోకి వచ్చే దాక అబద్దాలు, మోసాలు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు , మోసాలు ఒక్కసారి 2014లో ఈ పాంప్లెట్ చూద్దామా ? అక్కా ఈ పాంప్లెట్ గుర్తుందా? చెల్లెమ్మా ఈ పాంప్లెట్ గుర్తుందా? తమ్ముడూ ఈ పాంప్లెట్ గుర్తుందా ? 2104లో ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు స్వయంగా సంతకం పెట్టి, ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి వారి ఫోటోలు పెట్టి.. ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికీ పంపించాడు. ఆ తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా గెలిచి.. 2014 నుంచి 2109 వరకు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కాలంలో.. ఈ ముఖ్యమైన హామీలంటూ ఆయన స్వయంగా సంతకాలు పెట్టి మీ ప్రతి ఇంటికీ పంపించిన పాంప్లెట్ లో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అమలు చేశాడా ? నేను చదువుతాను. మీరే చెప్పండి. ఇందులో ఒక్కటైనా అమలు చేశాడా ?.

ఇందులో ముఖ్యమైనది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. రూ.87,612 కోట్ల రైతుల రుణమాఫీ జరిగిందా? రెండోది పొదుపు సంఘాల రుణాలను రద్దు చేస్తానన్నాడు.డ్వాక్రా సంఘాల అక్కచెల్లెమ్మలను,వారి కుటుంబ సభ్యులను  నేనుఅడుగుతున్నాను.. రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా రద్దు అయ్యాయా ?
 
మూడో హామీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి స్కీం కింద రూ.25వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు.  నేను అడుగుతున్నాను. ఇన్ని వేల మంది ఇక్కడున్నారు. ఏ ఒక్కరికైనా ఒక్క రూపాయి డిపాజిట్ చేశాడా అని అడుగుతున్నాను.
ఇంటింటికీ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు, అంటే రూ.1.20 లక్షలు ఇచ్చాడా ? అర్హులందరికీ మూడు సెంట్లు స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు ఇస్తామన్నారు. 
 మూడు సెంట్లు స్థలం కథ దేవుడెరుగు, చంద్రబాబు హయాంలో ఇక్కడున్న ఇన్ని వేలమందిలో ఏ ఒక్కరికైనా కనీసం ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.
రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాలుమాపీ అన్నాడు. జరిగిందా?. 
ఉమెన్ ప్రొటెక్షన్ పూర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా ? సింగపూర్ ని మించి అభివృద్ధి చేస్తామన్నారు, చేశారా?.
ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు, జరిగిందా ?
రాజానగరంలో కనిపిస్తోందా ? ఆలోచన చేయండి. ఇదే ముగ్గురు..  చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నికలప్పుడు మీ ఇంటికి 2014లో పంపించి.. ఆ తర్వాత 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత.. ఇందులో ఆయన చెప్పినవి ఒక్కటంటే ఒక్కటి జరిగిందా? అని అడుగుతున్నాను. 
ఇప్పుడు మళ్లీ ఇదే ముగ్గురు, మళ్లీ కూటమిగా ఏర్పడ్డారు. మళ్లీ మేనిఫెస్టో డ్రామా అంటున్నారు. నమ్ముతారా?
సూపర్ సిక్స్ అంటున్నారు నమ్ముతారా? తమ్ముడూ నమ్ముతారా? చెల్లెమ్మా నమ్ముతారా ?
సూపర్ సెవెన్ అంటున్నారు నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు నమ్ముతారా? ఇంటింటికీ బెంజికార్ అంట నమ్ముతారా? ఇలాంటి వాళ్ల అబద్దాలు, మోసాలు ఏ  స్ధాయిలో ఉన్నాయో గమనించమని మిమ్నల్ని కోరుతున్నాను. మీరే గమనించి ఉంటారు. వీళ్ల కుట్రలు ఏ స్ధాయిలో ఉన్నాయో మీరే చూస్తున్నారు. 

ప్రభుత్వాన్ని దెబ్బతీసే కుట్రలు.
మామూలుగా     ఒక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు. ఆ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు పరిపాలన చేస్తుంది. అలాంటి ప్రభుత్వాన్ని దెబ్బతీయడం కోసం, ఇబ్బందులు పెట్టడం కోసం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబునాయుడు ఢిల్లీతో కలిసి ఏ స్ధాయిలో కుట్రలు పన్నుతున్నారో మీరే చూడండి.
అవ్వాతాతలకు ఇంటికి వచ్చే పెన్షన్ ను దగ్గరుండి వీళ్లే రాకుండా చేశారు. ఇన్ని సంవత్సరాలుగా మీ జగన్ అవ్వాతాతలకు నేరుగా ఇంటికి పెన్షన్ పంపిస్తున్నాడు. ఎన్నికలకు రెండు నెలలు ముందు చంద్రబాబు కుట్రలు పన్ని.. అవ్వాతాతలకు ఇంటికి పెన్షన్ రాకుండా చేస్తే.. ఆ అవ్వాతాతలు రెట్టించిన ఉత్సాహంతో జగన్ కు ఓటు వేయారా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.

కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ జగన్ ఏదైతే చివరలో బటన్లు నొక్కాడో.. ఆ బటన్లు నొక్కిన సొమ్మును కూడా నా అక్కచెల్లెమ్మలకు రాకుండా ఢిల్లీ వాళ్లలో వీళ్లంతా కుట్రలు చేస్తూ... అడ్డుకునే కార్యక్రమం చేస్తుంటే.. సాక్షాత్తూ మీ జగన్ ఓ ముఖ్యమంత్రిగా కోర్టుకు వెళ్లి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కేసులు వేసే పరిస్ధితిలోకి ప్రజాస్వామ్యం దిగజారిపోయిందంటే వీళ్లను ఏమనాలి.

ఇవాళ మీ జగన్ బటన్ నొక్కిన పథకాలన్నీ కేవలం ఎన్నికలు వస్తున్నాయని  కొత్తగా నొక్కినవి కాదు. జగన్ నొక్కినవన్నీ ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం జగన్ బటన్ నొక్కుతూ, నొక్కతూ ఉన్న పథకాలకే మల్లీ బటన్ నొక్కాడు. ఈ స్కీమ్ లు కొత్తగా వచ్చినవి కాదు. వీటికి అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం కూడా తెలిపినవి.
మరి అటువంటివి 60 నెలల కథ దేవుడెరుగు.. .587నెలలు కాకముందు జగన్ ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్ని.. ఆ బటన్లు నొక్కిన సొమ్మును నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా అడ్డు తగిలే దౌర్భాగ్య పరిస్థిలలోకి వీళ్లు దిగజారిపోయారు.

నేను ప్రతి అక్కచెల్లెమ్మలకు, వారి కుటుంబ సభ్యులకు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు ఏ పథకం ఎప్పుడు వస్తుందో, మొట్టమొదటిసారిగా మీ జగన్ ఏకంగా ఒక కేలండర్ ఇచ్చి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా పాలన జరిగింది కేవలం మీ బిడ్డ హయాంలోనే. 

మరి ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు కేలండర్ లో చెప్పిన విధంగా క్రమం తప్పకుండా ఇస్తూ పోతున్న మీ జగన్ ను ఇబ్బంది పెట్టడానికి..  చివరిలో కట్టడి చేస్తే మాత్రం నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు ఊరు కుంటారా అని మీ బిడ్డ అడుగుతున్నాడు.
 ఓటు అనే అస్త్రంతో చంద్రబాబు నాయుడికి ఆయన చేస్తున్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పమని మీబిడ్డగా గట్టిగా కోరుతున్నాను. 
మీ బిడ్డగా మాట చెబుతున్నాను.. ఆ దేవుడి దయ, మీ చల్లని ఆశీస్సులు ఉన్నంత కాలం మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కడూ ఆపలేడు. మళ్లీ మీ బిడ్డే అధికారంలోకి వస్తాడు. జూన్ 4 న అధికారంలోకి వచ్చిన వెంటనే ఓ వారంలో రోజుల్లోనే ఈ బటన్లు అన్నీ క్లియర్ చేస్తాడు. ప్రతి ఒక్కరినీ ఒక్కటే గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను.

కుట్రలు చేస్తున్న చంద్రబాబు దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు మీ జగన్ మాదిరిగా బటన్లు నొక్కలేదు. గతంలో చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మీ జగన్ కన్నా ముందు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ అదే రాష్ట్రం, అదే బడ్జెట్ అయినా ఏ రోజూ చంద్రబాబు ప్రజల కోసం, అక్కచెల్లెమ్మల కోసం బటన్లు నొక్కలేదు. ఏ ఒక్క అక్కచెల్లెమ్మకూ డబ్బులిచ్చిన పరిస్థితి ఎప్పుడూ లేదు. ఏ పథకమూ లేదు. 
కానీ బిడ్డ ఈ 59 నెలల కాలంలో 130 బటన్లు నొక్కాడు. ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పంపాడు. కాబట్టే మీ జగన్ దగ్గర చంద్రబాబు మాదిరిగా డబ్బులేదు. చంద్రబాబు దగ్గర ప్రజలను దోచేసిన సొమ్ము చాలా ఉంది. ఆ దోచేసిన సొమ్ముతో చంద్రబాబు ప్రజలను పేదలను లోబర్చుకునేందుకు ఎన్నికల రోజు రూ.2, రూ.3 కొన్ని కొన్ని చోట్ల రూ.4, రూ.5 వేలు కూడా ఇస్తాడు. ప్రతి ఒక్కరికీ ఒక్కటే చెబుతున్నాను. చంద్రబాబు ఎన్నికల రోజు ఇచ్చే డబ్బంతా మనదే. మన దగ్గర దోచేసిన డబ్బు. కాబట్టి ఆయన ఇస్తే ఓ ఒక్కరూ వద్దుఅనొద్దు. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కటే ఒక్కటి గుర్తుపెట్టుకొండి.

ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. కేవలం క్లాస్ వార్ జరుగుతుంది. పేదవాడు ఒకవైపు పెత్తందార్లు మరోవైపున ఉండి యుద్ధం జరుగుతుంది. మీరు ఓటే వేసే ముందు మీ ఇంట్లో ఉన్న భార్య, అవ్వాతాతలు, ఆడపడుచులు, పసిపిల్లల అభిప్రాయం కూడా తెలుసుకొండి. ఆ తర్వాత ఎవరి వల్ల, ఏ ప్రభుత్వం 
మీ ఇంటికి, మీ కుటుంబానికి మంచి జరిగింది.. ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది మాత్రమే మీరు వేసే ఓటుని డిసైడ్ చేసేటట్టుగా పెట్టుకోమని కోరుతున్నాను. ఈ విషయం చెప్పడం చాలా అవసరమని కచ్చితంగా చెబుతున్నాను.

ఈ ప్రాంతంలో ఉన్న భూముల గురించి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చెప్పాడు. ఈ విషయం నాకు తెలుసు. అనుకోకుండా ప్రాసెస్ లో ఉన్న పైల్ క్లియర్ చేయలేకపోయాం. ఈ లోగా అనుకోకుండా ఎన్నికల షెడ్యూల్డ్ ప్రకటించారు. ఇక్కడే నిలబడి చెబుతున్నాను. ఈ భూములకు సంబంధించి మన అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరించి మీ అందరి సమక్షంలో మీటింగ్ పెడతానని సవినయంగా తెలియజేస్తున్నాను.

మీ అందరితో నేను కోరేది ఒక్కటే. జరగబోతున్న కురుక్షేత్రయుద్ధంలో 175 కు 175 అసెంబ్లీ స్ధానాలు, 25 కి 25 ఎంపీ స్ధానాలు గెలవాలి. ఒక్క సీటు కూడా తగ్గేందుకు వీలు లేదు. సిద్ధమైనా 

ఇక్కడో, అక్కడో, ఎక్కైడో మన గుర్తు తెలియని వాళ్లు ఉంటే.. అన్నా మన గుర్తు ఫ్యాను. చెల్లి మన గుర్తు ఫ్యాను. మంచి చేసే ఫ్యాను ఇంట్లో ఉండాలి. చెడు చేసే సైకిల్ ఎక్కడ ఉండాలి. ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుడాలి. సింక్ లోనే ఉండాలి.ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. 

మన పార్టీ తరపున బరిలో ఉన్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులను  ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ చేతులు జోడించి పేరు పేరునా ప్రార్దిస్తున్నాను అని చెబుతూ సీఎం  వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు. 

Back to Top