ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే

ఇది మీ వైయ‌స్ జ‌గన్‌ మాట. ఇది వైయ‌స్ఆర్‌ బిడ్డ మాట

క‌ర్నూలు ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా

చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం

చంద్రబాబు ఒకపక్క ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో జత కడతారు. మరోవైపు మైనారిటీలను మోసం చేసేందుకు దొంగ ప్రేమ నటిస్తారు

మీ బిడ్డది మనసున్న ప్రభుత్వం.. కులం, మతం, వర్గం చూడకుండా సంక్షేమ ప‌థ‌కాలు

నాలుగు శాతం రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపాదికన ఇచ్చింది కాదు

ఉర్దూ భాషకు ప్రత్యేక గుర్తింపు

ఏకంగా ఏడుగురికి ఎమ్మెల్యేలుగా అవకాశమిచ్చాం

ఆత్మ స్థైర్యం, ఆత్మ గౌరవం పెంచేందుకే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నేను నా ఎస్సీ.. నా ఎస్టీ.. నా బీసీ..నా మైనారిటీ అని చెప్తాను 

రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా రూ.2.70 లక్షల  కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మలకు అందించాం 

 కర్నూలు :  ఆరు నూరైన.. నూరు ఆరైన నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ వైయ‌స్‌ జగన్‌ మాట. ఇది వైయ‌స్ఆర్‌ బిడ్డ మాట అని సీఎం వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి ఉద్ఘాటించారు.  చంద్రబాబు రాజకీయం ఊసరవెల్లి రాజకీయమని, అది బాగా ముదిరిపోయిన తొండగా మారిందని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఒకపక్క ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో జత కడతారు. మరోవైపు మైనారిటీలను మోసం చేసేందుకు దొంగ ప్రేమ నటిస్తారు.  ఇంతకన్నా ఊసరవెల్లి రాజకీయాలు ఉంటాయా? అని నిల‌దీశారు. మైనారిటీలకు రిజర్వేషన్లపై  మోదీ సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలగా? అని ప్ర‌శ్నించారు. కర్నూలు ఎన్నికల ప్రచార భేరీలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌సంగించారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఏమన్నారంటే...

కర్నూలు సిద్ధమా? 
ఇంతటి ఎండను కూడా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ్యనే ఇంతటి ప్రేమాభిమానాలు, ఇంతటి ఆప్యాయతలు, అత్మీయతలను పంచిపెడుతున్న నా ప్రతి అక్కకూ, నా ప్రతి చెల్లెమ్మకూ, నా ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ.. మీ అందరి ప్రేమాభిమానాలకు, ఆత్మీయతలకు మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. 

నాలుగు రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం.
కేవలం నాలుగు రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగపోతుంది. ఈ సందర్బంగా మీ అందరితో ఒక్క విషయం చెప్పదల్చుకున్నాను. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతున్నవి కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు.

జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. ఇంటింటి అభివృద్ధి.
జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. ఇంటింటి అభివృద్ధిఅదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోవడమే. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్ధం. మంచి చేసిన మనందరి ప్రభుత్వం దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో గత చరిత్రను మార్చుతూ, గతంలో ఎప్పుడూ జరగని విధంగా, ఏకంగా మేనిఫెస్టోను చెత్తబుట్టలో విసిరే సంప్రదాయాన్ని మార్చుతూ, మేనిఫెస్టోలోని 99శాతం వాగ్ధానాలను అమలు చేసింది. ఏకంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను మీ బిడ్డ ప్రభుత్వం ఈ 59 నెలల కాలంలోనే ఇవ్వగలిగింది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా రూ..2.70 లక్షల కోట్లు.. మీ బిడ్డ బటన్లు నొక్కిన వెంటనే నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా పంపించడం జరిగింది.
ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ 59 నెలల కాలంలోనే జరిగిన గొప్ప మార్పులు జరిగాయి. గతంలో ఎప్పుడూ జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంటు బడులు,  గవర్నమెంటు బడులన్నీ ఇంగ్లిషు మీడియం, బడుల్లోనే ఆరోతరగతి నుంచే డిజిటల్ బోధన, 8వ తరగతి నుంచే పిల్లల చేతుల్లో ట్యాబులు, పిల్లల చేతుల్లోనే బైలింగువల్ టెక్ట్స్ బుక్స్ అంటే ఒక పేజీ ఇంగ్లిషు, మరో పేజీ తెలుగులో అందుబాటులోకి తెచ్చాం. మూడో తరగతి నుంచి టోఫెల్‌లో క్లాసులు, సబ్జెక్ట్ టీచర్లు ఐబీ దాకా ప్రయాణం, గతంలో ఎప్పుడూ జరగని విధంగా బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యాకానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులుకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి, పెద్ద చదువులకు అండగా.. ఏ తల్లీ, ఏ తండ్రీ అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని పూర్తి ఫీజులిస్తూ ఆ తల్లులకే విద్యాదీవెన, ఓ వసతి దీవెన, మొట్టమొదటిసారిగా కరిక్యులమ్‌లో మార్పులు, ఇంటర్నేషనల్ యూనివర్సిటీలతో సర్టిఫైడే కోర్సులు, ఇంటర్న్ షిప్‌ మాండేట్ చేయడం వంటి కార్యక్రమాలు....  నేను మిమ్నల్నందరినీ అడుగుతున్నాను....నేను చెప్పిన ఈ మార్పులు గతంలోఎప్పుడైనా చూశారా ? 

అక్కచెల్లెమ్మలకు అండగా.
గతంలో ఎప్పుడూ జరగని విధంగా నా అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లు మీద వాళ్లు నిలబడేటట్టుగా నా అక్కచెల్లెమ్మలకు ఓ ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, అక్కచెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ అందులో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం, ఇంతగా నా అక్కచెల్లెమ్మలను కాళ్ల మీద నిలబెట్టాలని చెప్పి ఆరాటపడాలన్న పరిస్థితులు, ఇన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా? అన్నా జరిగాయా? అక్కా జరిగాయా?

రైతన్నకు పెట్టుబడి సహాయంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడి సహాయంగా రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంట బీమా, సీజన్‌ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్‌ పుట్ సబ్సిడీ, పగటిపూటే రైతన్నలకు 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత కరెంటు, గ్రామంలోనే రైతన్నను చేయిపట్టుకుని నడిపించే ఓ ఆర్బీకే వ్యవస్ధ, ఇంతగా రైతన్నను ప్రేమించిన ప్రభుత్వం, రైతన్న కోసం ఇన్ని కొత్త పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? అని మీ బిడ్డ అడుగుతున్నాుస్వయం ఉపాధికి అండగా, తోడుగా ఆటోలు, ట్యాక్సీలు నడుపుకుంటున్న అన్నలకు వాహనమిత్ర, నేతన్నలకు నేతన్ననేస్తం, మత్స్యకారులుకు మత్స్యకార భరోసా, చిన్న చిన్న షాపులు పెట్టుకుని పుట్‌పాత్‌ల మీద వ్యాపారాలు చేసుకుంటున్న శ్రమజీవులైన నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు జగన్ననతోడు, చేదోడు, లాయర్లకు లా నేస్తం... నేను చెప్పిన పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? తమ్ముడూ ఉన్నాయా? అక్క ఎప్పుడైనా ఉన్నాయా? 

ఆరోగ్యం కోసం పేదవాడు అప్పుల పాలు కాకూడదని.
పేదవాడు తన ఆరోగ్యం కోసం ఆరోగ్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూదని, పేదవాడి ఆరోగ్యానికి రక్షగా రూ.25 లక్షల వరకు విస్తరించిన ఉచిత ఆరోగ్యశ్రీ, పేదవాడికి ఆపరేషన్ అయిపోయిన తర్వాత రెస్ట్ పీరియడ్‌లో ఆరోగ్య ఆసరా, మొట్టమొదటిసారిగా పేదవాడికి అందుబాటులో గ్రామంలోనే విలేజ్ క్లినిక్‌, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్‌, ప్రతి ఇంటికి జల్లెడ పడుతూ ఇంటికే ఆరోగ్య సురక్ష, పేదవాడి ఆరోగ్యం కొరకు ఇంతగా పరితపించిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా? 

ప్రతి గ్రామం ముంగిట 600 రకాల సేవలతో..
వీటన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్లినా 600 రకాల సేవలందిస్తున్న గ్రామ సచివాలయం, 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు, అవ్వాతాతలకు ఇంటికే రూ.3వేల పెన్షన్‌, ఇంటివద్దకే రేషన్‌, ఇంటివద్దకే పౌరసేవలు, ఇంటి వద్దకే పథకాలు,  గ్రామంలోనే నా అక్కచెల్లెమ్మలకు అండగా మహిలా పోలీస్‌, ప్రతి అక్కచెల్లెమ్మకు అండగా,తనకు తోడుగా పోన్‌లోనే డౌన్లోడ్ చేసుకున్న దిశయాప్‌, ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? ఈ పథకాలు, మార్పులు, లంచాలు, వివక్ష లేని పాలనను గతంలో ఎప్పుడైనా చూశారా? గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఆ దేవుడి దయ, మీ చల్లని ఆశీస్సులతో మీ బిడ్డ చేయగలిగాడు. 

మరోవంక 14 ఏళ్లు పాటు మూడుసార్లు సీఎంగా చేశానని చంద్రబాబు అంటాడు. ఈ చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా? 14 ఏళ్లు పాటు ౩ సార్లు సీఎం అంటాడు.. ఈ పెద్ద మనిషి పేరు చెబితే ఓ పేదకైనా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ గుర్తుకువస్తుందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.

మీ బిడ్డ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వంగా ఏనాడైనా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా.. చివరకి వారు ఏ పార్టీకి ఓటు వేసారన్నది కూడా చూడకుండా.. ఒక కుటుంబం పేదరికాన్ని మాత్రమే మీ బిడ్డ చూశాడు. వారి బ్రతుకులు మార్చాలని తపన పడ్డాడు. ఈ 59 నెలల కాలంలో వారి బ్రతుకులు మార్చడం కోసమే అడుగులు వేశాడు. 


ముస్లిం రిజర్వేషన్లు - బాబు ఊసరవెల్లి రాజకీయం.
కానీ చంద్రబాబు రాజకీయం.. ఊసరవెల్లి రాజకీయం. ఆయన బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క  4శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజీపీతో చంద్రబాబు జతకడతాడు. మరోపక్క మైనార్టీల ఓట్ల కోసం మైనార్టీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలుపెట్టాడు. దొంగ ప్రేమ నటిస్తాడు. కానీ 4 శాతం రిజర్వేషన్లను మైనార్టీలకు రద్దు చేస్తామన్న బీజేపీతోనే ఈ చంద్రబాబు కొనసాగుతాడట. మరి ఇంతకన్నా ఊసరవెల్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా? 
నేను చెబుతున్నాను. ఆరు నూరైనా, నూరు ఆరైనా 4 శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్ మాట. ఇది వైయస్సార్ బిడ్డ మాట. మరి మోదీ గారి సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలుగుతాడా? అని మీబిడ్డ అడుగుతున్నాడు. మైనార్టీల రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న తర్వాత కూడా ఎన్‌డీఏలో చంద్రబాబు ఎందుకు కొనసాగుతున్నాడు.

మైనార్టీల మీద మీ బిడ్డది నిజమైన ప్రేమ.
మైనార్టీల మీద మీ బిడ్డది నిజమైన ప్రేమ. ఇదే సందర్బంగా నేను ఒక్క మాట చెప్పాలి. ఇక్కడున్న వేల జనాలకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాలకు కూడా చెప్పాలి. 4 శాతం రిజర్వేషన్లు కేవలం మతం ప్రాదిపదికగా ఇచ్చినవి కావు. ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు ఆ రిజర్వేషన్లు వర్తించడం లేదు. పఠాన్లకు వర్తించడం లేదు. సయ్యద్‌లకు వర్తించడం లేదు. ఇవి కేవలం వెనుకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చినవి.

రాజ్యాంగానికి లోబడి ఇచ్చిన రిజర్వేషన్లు.
అందరూ గమనించాల్సింది ఏమిటంటే .. అన్ని మతాల్లో కూడా బీసీలు ఉంటారు, ఓసీలు ఉంటారు. మరి అలాంటప్పుడు మైనార్టీలను వేరుగా చూడడం, రాజకీయ స్వార్ధం కోసం మైనార్టీలకు నోటి దాకా వచ్చిన కూడును తీసేయాలనుకోవడంఎంత వరకు ధర్మం? ఇవి రాజ్యాంగానికి లోబడి ఇచ్చిన రిజర్వేషన్లు. రాజకీయ స్వార్దం కోసం వారి జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం కాదా? అందుకే ఇవి ఎట్టి పరిస్తితుల్లోనూ కొనసాగుతాయి. 

ప్రతి మైనార్టీ సోదరుడికి, అక్కచెల్లెమ్మకు భరోసా ఇస్తున్నా..
నేను ఇవాళ ప్రతి మైనార్టీ సోదరుడికి, ప్రతి మైనార్టీ అక్కచెల్లెమ్మకి భరోసా ఇస్తూ చెబుతున్నాను. 4శాతం రిజర్వేషన్లు విషయం అయినా, ఎన్ఆర్సీ అయినా, సీఏఏ అయినా ఇంకా ఏ మైనార్టీ అంశమైనా మైనార్టీ మనోభావాలకు, వారి ఇజ్జత్ ఔర్ ఇమాన్‌కు అండగా నిలబడుతూ, వారి బిడ్డ జగన్ వారికి మద్ధతిస్తూ.. ఎప్పటికీ అండగా ఉంటాడు.
మైనార్టీల పట్ల ప్రేమ చూపుతూ ఒక్క డీబీటీ స్కీంలే కాదు.. ఇళ్లపట్టాలు, ఇళ్ల నిర్మాణం, షాదీ తోఫావంటివి మాత్రమే కాదు, ఉర్ధూని రెండో అధికార భాషగా ప్రకటించడం మొదలు.. నలుగురు మైనార్టీలను ఎమ్మెల్సీలుగా, నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడమే కాకుండా.. ఐదేళ్లు  నా మైనార్టీ సోదరుడ్ని ఒకరిని డిప్యూటీ సీఎంగాను పక్కనే పెడ్డుకున్నాను. నా మైనార్టీ సోదరిని శాసనమండలి వైస్ చైర్మన్ గానూ, మైనార్టీ సబ్ ప్లాన్ బిల్లు తేవడం.. ఇలా ప్రతి సందర్భంలోనూ వారికి సముచిత స్ధానం ఇచ్చుకుంటూ వచ్చింది కేవలం ఈ 59 నెలల కాలంలోనే అని చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడుతున్నాను. 

నా మైనార్టీ సోదరులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు అంతా గమనించండి. మన రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్ధానాలుంటే అందులో 7 ఎమ్మెల్యే స్ధానాలు మైనార్టీలకు ఇవ్వడం ద్వారా.. ఈరోజు వారికి 4 శాతం రాజకీయ రిజర్వేషన్లు కూడా ఇచ్చినట్టయింది. అలా ఇచ్చిన పార్టీ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెబుతున్నాను.  
మరి చంద్రబాబు ఇలా మైనార్టీలకు మంచి చేసిన చరిత్ర ఎన్ని జన్మలకైనా వస్తుందా? అందరూ గమనిచండి. నేను ప్రతి సందర్భంలోనూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు, నా బీసీలు అంటూ ఇంతగా వారి పట్ల నా ప్రేమను, అభిమానాన్ని ఎందుకు ఇంత బాహాటంగా చూపిస్తానంటే.. కారణం ఒక ముఖ్యమంత్రి స్ధాయిలో వారిని ఇంతగా గుండెల్లో పెట్టుకుని, వారిపై ప్రేమ చూపిస్తే అప్పుడు ఆ వెనుకబడిన వర్గాలకు, ఆ గ్రామాలలోనూ, రాష్ట్రంలోనూ వారికిచ్చే గౌరవం పెరుగుతుంది. వారిలో ఆత్మగౌరవం, ఆత్మస్ధైర్యం పెరుగుతుంది. ఇది జరగాలంటే ముఖ్యమంత్రి స్ధాయిలో వ్యక్తి ప్రతి సందర్బంలోనూ నా.. నా..  అంటూ ఆప్యాయత చూపిస్తేనే జరుగుతుంది.

మరోవంక చంద్రబాబును చూడండి. ఇలాంటి ప్రేమ, న్యాయం కధ దేవుడెరుగు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మోసాలు, అబద్దాలు ఎలా ఉంటాయో చూపిస్తాను. మీరే చూడండి. (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ...) 
2014లో ఇదే చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి, ఇదే ముగ్గురి ఫోటో పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్‌లో చెప్పిన ఈ అంశాలను... 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉంటూ, ఇందులో చెప్పినవి ఏ ఒక్కటైనా జరిగాయా? అని అడుగుతున్నాను. మిమ్నల్నే అడుగుతాను. మీరే చెప్పండి.

చంద్రబాబు విఫల హామీలు.
రైతు రుణమాపీపై సంతకం చేస్తానన్నాడు. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ అన్నాడు. రైతన్నలకు..జరిగిందా? రెండో హామీ పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తా అని చెప్పాడు. రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేసాడా? అని అడుగుతున్నాను.
మూడో హామీ చంద్రబాబు చెప్పింది.. ఆడబిడ్డ పుడితే మహలక్ష్మి పథకం కింద రూ. 25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తానన్నాడు. రూ.25వేలు కథ దేవుడెరుగు.. ఇన్నివేల మంది ఇక్కడున్నారు..  కనీసం ఒక్క రూపాయి అయినా మీ బ్యాంకు ఖాతాల్లో వేశాడా ?అని అడుగుతున్నాను. 

నాలుగోది...ఇంటింటికీ ఉద్యోగం అన్నాడు.. ఉద్యోగం ఇవ్వలేకపోతే రూ.2వేలు నిరుద్యోగభృతి ప్రతి నెలా అన్నాడు. ఐదు సంవత్సరాలు అంటే 60 నెలలు, నెలకు రూ.2 వేలు అంటే ప్రతి ఇంటికీ రూ.1,20,000. ఇచ్చాడా? అని అడుగుతున్నాను. 
 
రూ. 10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్లూమ్ రుణాల మాఫీ అన్నాడు జరిగిందా..? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తానన్నాడు చేశాడా? సింగపూరును మించి అభివృద్ధి చేస్తానన్నాడు జరిగిందా? ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తా అన్నాడు జరిగిందా?.. కర్నూలులో కనిపిస్తోందా? ఆలోచన చేయమని అడుగుతున్నాను. సాక్షాత్తూ చంద్రబాబు సంతకం పెట్టి 2014లో సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్‌లో ఒక్కటంటే ఒక్కటైనా హామీలు అమలు చేశాడా? అని అడుగుతున్నాను. 

పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? దాన్నీ అమ్మేశాడు. ఇలాంటివాళ్లను నమ్మెచ్చా? మళ్లీ ఇప్పుడు ఏమంటున్నాడు ? చంద్రబాబు. 

కూటమిగా ఏర్పడి మళ్లీ మేనిఫెస్టోల డ్రామా.సూపర్ సిక్స్ అంటున్నారు, నమ్ముతారా? అక్కా నమ్ముతారా?  సూపర్ సెవెన్ అంట నమ్ముతారా?  ఇంటింటికీ బెంజ్ కార్ కొనిస్తారంట నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం అంట...నమ్ముతారా?

ఆలోచన చేయండి...ఇలాంటి దారుణమైన వారితో యుద్ధం చేస్తున్నాం. ఇలాంటి మోసాలతో మనం యుద్ధం చేస్తున్నాం. అందుకే మీ అందరికీ మళ్లీ చెబుతున్నాను. 

వివక్ష లేని పాలనకు ఫ్యాను గుర్తుకే ఓటేయండి.
వాలంటీర్లు మళ్లీ మీ ఇంటికి రావాలన్నా?.. పేదవాడి భవిష్యత్ మారాలన్నా?.. పథకాలన్నీ కొనసాగాలన్నా?.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా?.. మన పిల్లలు వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా?.. మన హాస్పిటళ్లు, మన వ్యవసాయం మెరుగుపడాలన్నా?... ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?. 

మన గుర్తు ఇక్కడో, అక్కడో, ఎక్కడైనా తెలియనివారు ఎవరైనా ఉంటే.. మన గుర్తు ఫ్యాను అక్క. చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాను. అన్నా మన గుర్తు ఫ్యాను. అవ్వా మన గుర్తు ఫ్యాను. పెద్దమ్మా మన గుర్తు ఫ్యాను. తాత మన గుర్తు ఫ్యాను. 

నా పక్కనే ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఇంతియాజ్ అన్న ఉన్నాడు. ఐఏఎస్ ఆఫీసర్‌గా రాజీనామా చేసి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చాడు. బ్రహ్మాండమైన చదువులు చదివాడు. మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. అదే విధంగా ఎంపీ అభ్యర్దిగా బీ వై రామయ్య అన్న నిల్చుంటున్నాడు. అతి సామాన్యుడు. ఇటువంటి వ్యక్తులను ఎంపీగా చేసి పంపించి.. పేదవాడు కూడా ఢిల్లీకి పోగలగడని చూపిద్దాం. రూరల్, అర్భన్ కలిసే ఉంటాయి. పాణ్యం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి అన్నను కూడా గొప్ప మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను.

ఇంతటి ఎండను కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వుల మధ్య ఆప్యాయతలు చూపుతున్నందుకు ప్రతి అవ్వకూ, తాతకూ, ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి స్నేహితుడికీ, సోదరుడికీ మరొక్కసారి మీ బిడ్డ చేతులు జోడించి ప్రార్దిస్తూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం శ్రీ వైయస్‌.జగన్ తన ప్రసంగం ముగించారు.
 

Back to Top