చంద్ర‌బాబుది డ‌కౌట్ మ్యానిఫెస్టో

 ఎన్నిక‌ల ప్రచారంలో ధర్మాన ప్ర‌సాద‌రావు 

శ్రీ‌కాకుళం: చంద్ర‌బాబుది డ‌కౌట్ మ్యానిఫెస్టో అని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు విమ‌ర్శించారు. ఆయ‌న ప్ర‌క‌టించింది సూప‌ర్ సిక్స్ కాద‌ని, డూప్ సిక్స్ అంటూఅభివ‌ర్ణించారు. రాష్ట్రంలో మ‌రోసారి వైయ‌స్ఆర్‌కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటు కానుంద‌ని మంత్రి ధీమా వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా శ్రీ‌కాకుళం రూర‌ల్ మండ‌లంలో (రాగోలు, బావాజీపేట, కూటి కుప్పల పేట, గూడెం, చంద్రయ్య పేట, పెద్దపాడు) రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్ర‌కారం  విస్తృతంగా ప‌ర్య‌టించి,ఇక్క‌డి వారితో మ‌మేకం అయ్యారు. చంద్ర‌బాబు నాయుడు చెబుతున్న విధంగా కూటమి పేరిట తీసుకునివ‌చ్చిన,కుటిల నీతితో తీసుకుని వ‌చ్చిన రంగుల కాయితంను ఎవ్వ‌రూ న‌మ్మ‌వ‌ద్ద‌ని అది సూపరు సిక్సూ కాదు డూప‌రు సిక్సూ కాదు.. అబ‌ద్ధాల‌తో,ఆచ‌ర‌ణ సాధ్యం కానీ హామీల‌తో రూపొందించిన మ్యానిఫైస్టోతో రానున్న ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు డకౌట్ అవ్వ‌డం ఖాయం అని జోస్యం చెప్పారు. చ‌లోక్తులు విసిరారు. ఆయ‌న స‌మ‌ర్థ నేత కాద‌ని. ఇచ్చిన మాట‌కు క‌ట్ట‌బడి నిల‌దొక్కుకుని రాజ‌కీయం ఏనాడూ చేయ‌ర‌ని విమ‌ర్శించారు. 

రాగోలు, శ్రీ‌కాకుళం రూర‌ల్ మండ‌లం : 
ప్ర‌చార ప‌ర్వంలో భాగంగా శ్రీ‌కాకుళం మండ‌లం,రాగోలు గ్రామంలో మంత్రి ధ‌ర్మాన పర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. “ఇవాళ చంద్ర‌బాబు హామీలు ఎవ్వ‌రూ న‌మ్మ‌డం లేదు క‌నుక,అత‌ను విడుద‌ల చేసిన రంగుల కాగితం (మ్యానిఫెస్టో (ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌)) ఎవ్వ‌రూ న‌మ్మ‌డం లేదు క‌నుక జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భూములు తీసుకుంటాడ‌ని అబ‌ద్ధ‌పు ప్ర‌చారం చేస్తున్నారు. మీ గ్రామంలో రైతులు ఉన్నారు చాలామంది. రైతులంతా ఆలోచించండి ఒక్కసారి. ఈ దేశంలో ఒక‌రి భూమి ఇంకొక‌రు తీసుకునే అవ‌కాశం ఎక్క‌డైనా ఉందా ? మ‌న రాజ్యాంగంలో ఆస్తి క‌లిగే హ‌క్కు (రైట్ టు ప్రోప‌ర్టీ) ప్ర‌స్తావ‌న‌లో ఉంది. ఒక హ‌క్కు అది. రాజ్యాంగంలో ఉన్న హ‌క్కు అది. నేను కాదు ముఖ్య‌మంత్రి కాదు..ప్ర‌ధాన మంత్రి కాదు రాష్ట్ర ప‌తి కూడా ఒక‌రి భూమిని తీసుకోవ‌డం జ‌ర‌గ‌ని ప‌ని. నిబంధ‌న‌లు అలా లేవు. రాజ్యాంగం,చ‌ట్టం ఆ విధంగా లేవు. వీటిపై చంద్ర‌బాబు అపోహ‌లు క‌ల్పిస్తున్నారు కానీ వాస్త‌వం ఇందుకు పూర్తి విరుద్ధం. అస‌లు చ‌ట్ట ప్ర‌కారం ఆ విధంగా భూమిని లాక్కొనేందుకు వీల్లేదు. 2013 లో చేసిన పార్ల‌మెంట్ యాక్ట్  (ప్రిన్సిపల్ యాక్ట్ ) ప్రకారం.. ఇవాళ రాష్ట్ర ప్ర‌భుత్వానికి కానీ కేంద్ర ప్ర‌భుత్వానికి అవ‌స‌ర‌మై ఒక‌రి ద‌గ్గ‌ర నుంచి భూమి తీసుకోవాలం టే అందుకు రెండు నుంచి మూడు రెట్లు ( మార్కెట్ రేటు అనుస‌రించి) ప‌రిహారం చెల్లించి తీసుకోవాలి. ఆ రైతుకు ఆ భూమి త‌ప్ప మ‌రొక‌టి లేదు అనుకుంటే తీసుకోవ‌డం జ‌ర‌గ‌ని ప‌ని. ఎన్విరాన్మెంటల్ ఎస్సెస్మెంట్, ప్రాప‌ర్టీ ఎస్సెస్మెంట్ కుదిరితే కానీ భూమి తీసుకోవడం జ‌ర‌గ‌ని ప‌ని.  ఫెయిర్ కాప‌న్సేష‌న్ అన్న‌ది ఇవ్వ‌క‌పోతే భూమి తీసుకునేందుకు వీల్లేదు అని చ‌ట్ట‌మే చెబుతున్న‌ది. ఇవ‌న్నీ సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన చంద్ర‌బాబుకు తెలియవా ? అని అడుగుతున్నాను.

ప్ర‌భుత్వ అవ‌స‌రాల‌కు భూమి తీసుకునేందుకే ఈ దేశంలో అవ‌కాశం లేదే ? ప్ర‌జ‌ల  నుంచి భూములు తీసుకునేందుకే చ‌ట్టాలు చేస్తున్నార‌ట ! అంటే ఇంత దివాలాకోరు రాజ‌కీయ నాయ‌కుడు ఎక్క‌డ‌న్నా ఉంటాడా ? ఇవేవీ తెలియ‌కుండానే 13 ఏళ్ల 8 నెల‌ల పాటు ఆయన ఈ రాష్ట్రాన్ని ముఖ్య‌మంత్రి హోదాలో ( ఉమ్మ‌డి,విభ‌జ‌త రాష్ట్రం) పాల‌న సాగించారా ?  అని ప్ర‌శ్నిస్తున్నాను. ఇలా ఏ రాజ‌కీయ నాయ‌కుడు అయినా ప్ర‌జ‌ల‌కు ఈ విధంగా చెప్ప‌వ‌చ్చా ? చెప్పి ప్ర‌జ‌ల‌ను త‌ప్పు దారి ప‌ట్టించ‌వ‌చ్చా ?  ఇలాంటి అవ‌కాశ‌వాది ఇవాళ నాకు అధికారం ఇవ్వండి అని అడుగుతున్నాడు ? దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నిన్న‌టి వేళ అన‌కాప‌ల్లి వ‌చ్చారు. వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న చెప్పారు. ఈ భూములు తీసుకుంటాం అన్న వ్య‌వ‌హారంపై ఆయ‌న చెప్పారు. పేద‌ల భూముల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు నీతీ అయోగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ప్ర‌తిపాదించిం ది అని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్నారు. అనకాప‌ల్లిలో ఎన్డీఏ కూట‌మి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ప్ర‌జాగ‌ళం స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. రానున్న రోజుల‌లో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల‌లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని తెలిపారు.

ఈ చ‌ట్టంతో ఏళ్ల త‌ర‌బ‌డి నెల‌కొన్న భూ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని అన్నారు. కొత్త భూ చ‌ట్టాల‌పై వ‌స్తున్న పుకార్ల‌కు ప్ర‌జ‌లెవ్వ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌సరం లేద‌ని సూచించారు. ఇవీ ఈ దేశ ప్ర‌ధాని మోదీ చెబుతున్న మాటలు. మ‌రి  చంద్ర‌బాబు ఆ వేదికపైనే ఉండి ఉంటాడు. ఉన్నాడా ? మ‌రేమి  అత‌ను త‌ల ఎక్క‌డ పెట్టుకోవాలా ? నువ్వు చెబుతున్న‌ది అబ‌ద్ధం అని తెలిసిపోయింది క‌దా  ఒక ముఖ్యమంత్రి హోదాలో ప‌నిచేసిన వ్య‌క్తి అన్నీ తెలిసి అబ‌ద్ధం ఆడ‌డం ఎంత వ‌ర‌కూ స‌మంజ‌సం. అలాంటి వ్యక్తికి తెలిసే స‌హ‌క‌రిస్తామా ? ఆలోచించిచూడండి ఓ సారి. అని అన్నారాయ‌న.

Back to Top