ప్రతి గడపకూ వెళ్లి మేనిఫెస్టోను వివరిస్తాం..

వైయస్‌ఆర్‌ సీపీ గ్రీవెన్స్‌ సెల్‌ అధ్యక్షుడు నారాయణమూర్తి

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ సీపీ నవరత్నాల ప్లస్‌ మేనిఫెస్టోలోని అంశాలను ప్రతి గడపకూ వెళ్లి, ప్రతి మనిషికి వివరిస్తామని పార్టీ గ్రీవెన్స్‌ సెల్‌ అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి చెప్పారు. కలలు నిజం చేసుకోవడానికి ‘జగన్‌ కోసం సిద్ధం’ పేరుతో నేటి నుంచి నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో నారాయణమూర్తి మీడియాతో మాట్లాడారు.

‘2019లో పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ నవరత్నాల పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలోని వాగ్దానాలను ఈ ఐదేళ్లలో 99 శాతం అమలు చేశారు. సీఎం వైయస్‌ జగన్‌ ఇచ్చిన మాట కట్టుబడి హామీలను అమలు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలోని పట్టణాలు, పల్లెల్లో 87 శాతానికి పైగా ప్రజలు లబ్ధిపొందారు. మేనిఫెస్టోను కొత్తగా నవరత్నాల ప్లస్‌ పేరుతో పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్‌ జగన్‌ విడుదల చేశారు. ఆ మేనిఫెస్టో తాము కన్న కలలు నిజం చేసుకునేలా ఉందని  బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని నిరుపేదలు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, పట్టణాలు, పల్లెల్లోని ప్రతి ఇంటికి తీసుకెళ్లి వివరిస్తాం. జగన్‌ కోసం సిద్ధం నినాదంతో పార్టీ క్యాడర్‌ ముందుకెళ్తుంది. 

మేనిఫెస్టో బ్రహ్మాండంగా ఉందని యువత, రైతులు, మహిళలు, కార్మికులు చెబుతున్నారు. అమలుకు సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మళ్లీ మోసం చేయడానికి వస్తున్నారని ప్రజలంతా నమ్ముతున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలోని వాగ్దానాల్లో ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. కానీ, సీఎం వైయస్‌ జగన్‌ మేనిఫెస్టోకు కొత్త అర్థాన్ని తీసుకువచ్చారు. ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చి నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపారు. అదే విధంగా ఇటీవల విడుదల చేసిన నవరత్నాలు ప్లస్‌ మేనిఫెస్టోపై కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. మేనిఫెస్టోను ప్రతి ఒక్కరికీ వివరిస్తాం. సీఎం వైయస్‌ జగన్‌ మాట ఇస్తే తప్పరన్న విశ్వాసం ప్రజల్లో బలంగా ఉంది’ అని అంకంరెడ్డి నారాయణమూర్తి వివరించారు. 
 

Back to Top