సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌ల్లో నూత‌నోత్సాహం

సీఎం వైయస్.జగన్ 21వ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్ర 

విశాఖ‌లో సోష‌ల్ మీడియా ప్ర‌తినిధుల‌తో స‌మావేశం

సోష‌ల్ మీడియా ప్ర‌తినిధుల‌లో  రెట్టింపు ఉత్సాహం

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసాతో ఎన్నిక‌ల కురుక్షేత్రానికి సిద్ధ‌మ‌ని నినాదాలు

విశాఖ‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియా ప్ర‌తినిధుల‌తో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖాముఖి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. విశాఖపట్నం జిల్లా పెద్దిపాలెంలోని చెన్నాస్ కన్వెన్షన్ హాలులో వైయ‌స్ఆర్‌ సీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖ్యమంత్రి  వైయస్.జగన్ స‌మావేశ‌మ‌య్యారు. ముఖాముఖి కార్యక్రమం సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌ల్లో నూత‌నోత్సాహం నింపింది.

ముఖాముఖి కార్య‌క్ర‌మంలో సోషల్ మీడియా కార్యకర్తలు ఏమ‌న్నారంటే..

మీరు బాగుంటేనే మేము బాగుంటాం: ఎం. అనిల్ కుమార్ రెడ్డి, అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం

నా తమ్ముడు భరత్ కుమార్ రెడ్డి ఫిబ్రవరి నెలలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగివస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఆ సమయంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ గారు, భార్గవ్ అన్నగారు మా కుటుంబానికి అండగా నిలిచారు. నా తమ్ముడుకు మీరే దైవం అన్న. మీరు బాగుంటేనే మేము బాగుంటాం. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ఎల్లోమీడియా ఎంతో దుష్ప్రచారం చేసేది. అయితే భార్గవ్ అన్న ఛార్జ్ తీసుకున్న తర్వాత మన వైసీపీ సోషల్ మీడియా ప్రతిపక్షాలు భయపడేంతగా స్ట్రాంగ్ అయ్యింది. మా తమ్ముడు చనిపోయినా బాధగా ఉన్నాకూడా మీతో ఒక్కసారి ఫోటో దిగానా, మిమ్మల్ని కలుసుకున్నా వాడి ఆత్మ శాంతిస్తుందని వచ్చా. మీ అభిమానిగా ఒక్కరోజు బ్రతికినా చాలు.. మీకు మా కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది..  

మిమ్మల్ని చూసి ఇన్పైర్ అయ్యాము: బాలచంద్ర, గుంటూరు జిల్లా, తెనాలి మండలం (గీతాంజలి భర్త)

జగనన్న మీరు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. మనస్సుకు ఎంతగాయమైనా, దేహానికి ఎంతగాయమైనా చిరునవ్వుతో బ్రతకాలని అన్నది మిమ్మల్ని చూసి ఇన్పైర్ అయ్యాము. నా పిల్లలకు ఎంతో సాయం చేశారు అయితే ఇంకా అండాదండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్లీ మీరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను సార్..

సీఎం వైయ‌స్ జగన్...
బాలచంద్ర.. నీ కుటుంబానికి 100 శాతం అన్నిరకాలుగా తోడుగా ఉండే కార్యక్రమం ఇప్పటికే జరుగుతోంది. ఇది ఎప్పటికీ మనస్సులో పెట్టుకో. భార్గవ్ కూడా చాలా క్లియర్ గా చెప్పాను అన్నిరకాలుగా నిన్ను చేయి పట్టుకుని నడిపిస్తాడు.     

అన్నా మీరు చాలా జాగ్రత్త.. : పి. నాని, బాపట్ల జిల్లా
అన్న ఒక చిన్న విషయం చెప్తాను. తెనాలిలో ఇళ్ల పట్టా తీసుకుని గీతాంజలి చాలా సంతోషంతో చెప్పలేని ఆనందంతో తన అభిప్రాయాన్ని చెప్పుకుంది. కానీ మీరు చెప్పినట్టు.. కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కాయలున్న చెట్టు. తెలుగుదేశం పార్టీ ముళ్లున్న చెట్టు. గీతాంజలి కుటుంబానికి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎంతో అండగా నిలిచింది. మీ మీద దాడి జరిగితే అది మా మీద జరిగినట్టు భావించాం. అన్నా మీరు చాలా జాగ్రత్త.. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబుకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు. చంద్రబాబు యుద్ధానికి డైరెక్ట్ గా రాడు, వారి వెన్నుపోటుకు జాగ్రత్తగా ఉండమని చేతులెత్తి దండమెడుతున్నా.   

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని..

2014 నుంచి 2019 వరకు ముస్లింలంతా భయపడుతూ బ్రతికారు. 2019లో మా రాజన్న బిడ్డ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలర్ ఎగరేసుకుని బ్రతుకుతున్నాం. మైనార్టీలను నలుగురిని ఎమ్మెల్యేలు చేశారు, ఎమ్మెల్సీలను చేశారు, డిప్యూటీ సీఎంను చేశారు, మండలి వైస్ ఛైర్మన్ ను చేశారు. అంతేకాకుండా ఇప్పుడు ఏడుగురికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారు, అదీగాక హఫీజ్ ఖాన్ కు రాజ్యసభ అనౌన్స్ చేశారు. ముస్లింల కోసం వైయ‌స్ఆర్ ఒక అడుగు ముందుకేస్తే.. మీరు నాలుగు అడుగులు ముందుకేశారు. వాళ్లు మూడు జెండాలతో వస్తున్నారు మనది ఒకటే జెండా కానీ ఆ జెండాకు మూడక్షరాలు వైయ‌స్ఆర్ అది చాలన్నా ఆ జెండాను మోసేందుకు..  

దొంగ కేసు పెట్టి నా కెరీర్ నాశనం చేసారు.: సామ్రాజ్యం, గతంలో ప్రైవేట్‌ చీఫ్ సెక్యూరిటీ అఫీసర్, విశాఖ ఎయిర్ పోర్ట్‌
విశాఖ ఎయిర్పోట్‌ ఫుడ్‌ కోర్టుకు సంబంధించి అంతా టీడీపీ వాళ్లు అని తెలియక అక్కడ ఉద్యోగంలో చేరాను నేను. కోడికత్తి శ్రీను విశాఖలో మీమీద దాడి చేసిన ఘటనకు ప్రత్యక్ష సాక్షిని నేను. ఆ ఘటన తర్వాత నేను జగన్‌ అభిమానిని అని తెలిసి వాళ్లు నన్ను చాలా హెరాస్ చేసారు. అక్కడ టీడీపీ నాయకులు లోకేష్, చంద్రబాబు, బాలకృష్ణ, సీఎస్‌వో వేణుగోపాల్, హర్షవర్థన్ అందరూ ఒక కూటమిలా అక్కడ ఉండేవాళ్లు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ గా నేను PCS రూల్ ప్రకారమే ఉండాలని ప్రయత్నించేదాన్ని. మీ అభిమానిని అన్న కారణంగా నన్ను అనుమానించి, నాపై దొంగకేసులు బనాయించారు. నాకెక్కడా ఉద్యోగం రాకుండా చేసారు. నా కుటుంబాన్ని కూడా ఎంతగానో హింసించారు. వేణుగోపాల్‌ అయితే నిన్ను ఎక్కడా బతకనివ్వను అని బెదిరించారు. మీ మీద హత్యాయత్నం వ్యవహారంలో నేనే చేయించినట్టు చెప్పాలంటూ నా మీద ఒత్తిడి తెచ్చారు.  దీంతో నేను ఉద్యోగానికి రిజైన్‌ చేసాను. కుటుంబం అంతా కూడా దూరంగా వెళ్లిపోయాం. ఇన్నేళ్లూ నేను ఉద్యోగం కూడా లేకుండానే ఉన్నాను. కానీ మొన్న విజయవాడలో మీమీద బోండా ఉమ చేయించిన దాడి చూసాక మౌనంగా ఉండకూడదు అనుకున్నాను. ఈ విషయాన్ని ఇప్పుడు మీ ముందే బయటపెడుతున్నాను. దొంగ కేసు పెట్టి నా కెరీర్ నాశనం చేసారు. అయినా నేను బాధపడలేదు. నా ఉద్యోగం అయితే తీయగలిగారు కానీ నా గుండెల్లోంచి జగనన్నను తీయలేకపోయారు.

సీఎం వైయ‌స్ జగన్ - 
సోషల్ మీడియాపరంగా ఎవరైనా హెరాస్‌మెంట్‌కి లోనైతే సహాయం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఎవరైనా సోషల్ మీడియా వల్ల ఇబ్బందులకు గురైతే చెప్పుకోగలిగేలా ఒక యాప్ తయారుచేయాలి. ప్రతివారం నాకు దానిపై రిపోర్టు కావాలి. అవతలి వాళ్లు మన మీద దాడి చేస్తున్నారు అంటే, సుచిత్ర కానీ, గీతాంజలి కానీ, సాక్షాత్తూ నామీద కానీ,....దాని అర్థం ఏమిటంటే..మనం విజయానికి చేరువగా ఉన్నామని...విజయానికి వాళ్లు దూరంగా ఉన్నారని. 


మీకోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం: హెప్సిబా, అసోసియేట్ ప్రొఫెసర్, ఫార్మసీ

మిమ్మల్ని తలవని రోజు, మీ గురించి మాట్లాడని రోజు, మీ గురించి రాయని రోజు లేదు. మా గురించి, మా కుటుంబం గురించి అయినా మర్చిపోతామేమో కానీ మీ గురించి మర్చిపోయి ఒక్కరోజు కూడా లేము. మా కుటుంబం కంటే ఎక్కువ అయ్యారు మీరు. ఎందుకంటే మీరు ఎంతో గొప్ప ఇన్స్‌పిరేషన్ మాకు. అబ్రహాం లింకన్, మహాత్మాగాంధి, అంబేడ్కర్ గురించి పుస్తకాల్లో చదువుకున్నాం కానీ మీరు మాకు కనిపించే లైవ్ ఎగ్జాంపుల్. 36 ఏళ్ల వయసులో మీరు ఢిల్లీ పీఠాన్ని ఎదిరించారు. మీ లైఫ్ జర్నీ ఇంకా తెలుసుకోవాలని ఉంది. మీరు చెప్పే మాటలు మాకెంతో ఇన్సిపిరేషన్ ఇస్తాయి. యువతను ఉత్తేజపరుస్తాయి. మీకోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం. 

ఆడవాళ్లంతా కూడా జగనన్నకే ఓటు వేస్తాం అని చెబుతున్నారు: వినయ్ కుమార్, మల్కాపురం, జగ్గయ్యపేట మండలం, ఎన్టీఆర్‌ జిల్లా


 కడుపు కాలేవాడికే మీ పథకాల విలువ తెలుస్తుంది...
కడుపు నిండిన వాడికి కడుపు మండుతోంది 

మా అన్నయ్య మన పార్టీ వీరాభిమాని, సోషల్ మీడియా సైనికుడు. 2022లో యాక్సిడెంట్‌లో మరణించాడు. అది తెల్సుకుని ముందుగా సజ్జల భార్గవ్ గారు స్పందించారు. మా ఇంటికి వచ్చారు. మీ గురించి జగనన్నకు కూడా తెలియజేసామని, మీకు సాయం అందించమని ఆదేశించారని కూడా చెప్పారు. మా కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పి రెండు నెలల్లోనే మా వదినకు ఉద్యోగం ఇప్పించారు. అంతే కాదు మా సొంత పిన్నీ, బాబాయ్‌ టీడీపీ అభిమానులు, అంతేకాదు గత టీడీపీ ప్రభుత్వంలో వాళ్లే జన్మభూమి కమిటీలో మెంబర్లు కూడా. వాళ్లకి సైతం పెన్షన్ మన ప్రభుత్వంలోనే ఇచ్చారు. సంక్షేమ పథకాలు మాకు, వాళ్లకూ కూడా వస్తున్నాయి. ఇప్పుడు వాళ్లింట్లో ఆడవాళ్లంతా కూడా జగనన్నకే ఓటు వేస్తాం అని చెబుతున్నారు. 

మీరు అందించే పథకాల విలువ కడుపు కాలేవాడికే తెలుస్తుంది...కడుపు నిండిన వాడికి తెలియదు. ఆ పెత్తందారులు మాకు గాయం చేస్తే మీరు మాకు సాయం చేస్తున్నారు. మా చివరి శ్వాస వరకూ జై జగన్‌ అనే అంటాం. ఫ్యాన్‌ కే ఓటేస్తాం. వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ సోషల్ మీడియా కూడా మాకు కుటుంబమే అన్నా..మా అన్న చనిపోయినప్పుడు ఓ కూలీ చేసుకునే వ్యక్తి ఫోన్ చేసి నేను ఇవాళ కూలి పనికి వెళ్తున్నా, కూలీగా వచ్చిన రూ.600 నీకు పంపుతా తమ్ముడూ అని చెప్పాడు. ఇంత గొప్ప కుటుంబం ఇచ్చింది నువ్వే కదా జగనన్నా...నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం.

సోషల్ మీడియా ప్రతినిధులు మాట్లాడిన అనంతరం సీఎం మాట్లాడుతూ ఏమన్నారంటే.....:

జగనన్న మీకు ఎప్పుడూ అండగా, తోడుగా ఉంటాడు.
మీ అందరితో కూడా ఒకే ఒక విషయం చెప్పదల్చుకున్నాను. చాలా మంది మాట్లాడగలిగారు. ఇంకా చాలా మంది మాట్లాడలేని పరిస్థితి. కానీ మీ అందరితో ఒకటే చెబుతున్నాను. మీ అందరికీ కూడా తోడుగా, మీ జగనన్న ఎప్పుడూ మీకు అండగా ఉంటాడని మాత్రం ఈ సందర్భంగా చెబుతున్నాను. 

దేవుడు పెద్ద స్క్రిప్టే రాశాడు.
ఇంకొక విషయం కూడా చెబుతున్నాను. ఈ దెబ్బ ఇక్కడ (నుదురుపైన) తగిలింది అంటే అది ఇక్కడా(కంటి మీద) తగల్లేదు. ఇక్కడా (కణత మీద) తగల్లేదు అంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్టేదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడు అని దాని అర్థం. కాబట్టి భయం లేదు. 

పైన దేవుడు – కింద మీరు అండగా ఉండగా మీ అన్నకు భయంలేదు.
మనం గెలిచేది 175కు 175 సీట్లే అని 25కు 25 ఎంపీ సీట్లే.  ఒక్క సీటు కూడా ఎక్కడా తగ్గేందుకు వీల్లేదు. మీ భుజస్కందాల మీద ఫోన్ అనే ఈ ఆయుధం మీ చేతుల్లో ఉందనేది గుర్తుపెట్టుకోమని అందరితో కోరుతున్నాను. అటు వైపున 100 ఈనాడులు వచ్చినా, 100  ఆంధ్రజ్యోతులు వచ్చినా, 100  టీవీ5లు వచ్చినా, 100 మంది చంద్రబాబులు, 100 మంది దత్తపుత్రులు వచ్చినా, జాతీయ పార్టీలు పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ మద్దతు పలికినా, కుట్రలు పన్నినా కుతంత్రాలు పన్నినా, అబద్ధాలు చెప్పినా, మోసాలు చేసినా మీ అందరికీ ఒకటే చెబుతున్నాను మీ జగన్ కు  భయం లేదు. మీ అన్నకు.  మీ తమ్ముడుకి భయం లేదు. కారణం పైన దేవుడు ఉన్నాడు. కింద మీరంతా మీ అన్నకు అండగా ఉన్నారు. 

మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు ఇక్కడ ఉన్న వాళ్లకు, ఇక్కడికి రాలేకపోయిన చాలా మంది ఆత్మీయులకు, దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉండి కూడా వారి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు చూపిస్తున్న నా అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు అందరికీ కూడా మీ జగన్ మరొక్కసారి మనసారా చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఇటువైపున తిరుగుతా వచ్చినంత మేర సెల్ఫీ తీసుకుంటాను అంటూ... సీఎం వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.

Back to Top