టీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు 

అమ‌రావ‌తి:  ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన తెలుగుదేశం,బిజేపి,జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది.

   శాసనమండలిలో విప్ లేళ్ళ అప్పిరెడ్డితోపాటు మాజిమంత్రి రావెల కిషోర్ బాబు,లీగల్ సెల్ రాష్ర్ట అధ్యక్షుడు మనోహర్ రెడ్డి,పార్టీ గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి,పార్టీ నేతలు శ్రీనివాసరెడ్డి,విల్సన్ బాబు,పానుగంటి చైతన్య,ఎస్సీ సెల్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ లు ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేసి ఇందుకు ఆధారాలను అందించారు.

1. తెలుగుదేశం  ఎన్ ఆర్ ఐ విభాగం యుఎస్ కోఆర్డినేటర్ కోమటి జయరాం ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేవిధంగా ప్రణాళిక రూపొందించారని ఇది ఎంసిసికి వ్యతిరేకం కాబట్టి పూర్తి విచారణ జరిపి ఆ పార్టీ ఎన్ ఆర్ ఐ వింగ్ ద్వారా జరిగిన ఆర్దిక లావాదేవీలపై విచారణ చేయాలని కోరారు.అలాగే జయరాం పై లీగల్ యాక్షన్ తీసుకోవాలని కూడా కోరారు.

2. తెలుగుదేశం పార్టీ వివిధ పత్రికలలో ఎన్నికల నియమావళికి విరుధ్దంగా ఇచ్చిన ప్రకటనలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

3. టిడిపి-బిజేపి-జనసేన కూటమికి సంబంధించి జగన్ కు వ్యతిరేకంగా నిరాధారమైన అంశాలతో కూడిన వీడియో ప్రకటనను ఏబిఎన్ తెలుగు ఛానల్ ప్రసారం చేస్తున్నారని,అది ఎంసిసికి వ్యతిరేకం కాట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

4. జనసేన పార్టీకి చెందిన మర్రెపు సురేష్ అనే వ్యక్తి గజపతినగరంలో ఈనెల 23 వతేదీన ముఖ్యమంత్రి జగన్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

5. గజపతినగరం,ఆముదాలవలస,పాతపట్నం ప్రాంతాలలో చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో ఈనెల 23 వతేదీన వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు.దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

6. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈనెల 23 వతేదీన ఉప్పాడ సభలో వైయస్సార్ సిపి తరపున పోటీచేస్తున్న అభ్యర్దులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

7. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో జాతీయపతాకాన్ని అవమానించే రీతిలో వ్యవహరించారు.ఇది ఎన్నికల నియమావళికి విరుధ్దం.దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.

చంద్రబాబు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని లేళ్ల అప్పిరెడ్డి ధ్వజం. 
     ఎన్నికల కమీషన్ అంటే లెక్కలేకుండా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను యధేచ్చగా ఉల్లంఘిస్తున్న
చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి విన్నవించామని అప్పిరెడ్డి తెలియచేశారు.
ఇప్పటికి ముఖ్యమంత్రి జగన్ గారిపై వ్యక్తిగతంగా కామెంట్స్ చేస్తూ సంస్కారం లేకుండా ప్రవర్తించడమే కాకుండా ఎన్నికల నియమావళికి విరుధ్దంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన వ్యక్తి 40 ఇయర్స్ ఇండస్ర్టీ అని చెప్పుకునే చంద్రబాబు ఇలా మాట్లాడటం సరికాదన్నారు.

మహిళల అదృశ్యాలు అంటూ చంద్రబాబు,పవన్ కల్యాణ్ ల విషప్రచారం 
30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని పవన్ ఆరోపించారని అదే పెద్ద అబధ్దం,అసత్యాలు మాట్లాడుతున్నారని అనుకుంటే ఇప్పుడు ఎన్నికల ప్రచార సభలో నేడుచంద్రబాబు ఏకంగా 50 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని విషం గక్కుతున్నారని అన్నారు.ఇంతమంది మహిళలు  అదృశ్యమయితే వారి కుటుంబ సభ్యులు కేసులు పెట్టరా? ఎల్లోమీడియాలో అడ్డగోలుగా వార్తలు రాసేవారు కదా? అని ప్రశ్నించారు.మహిళల్లో ఆందోళన రేకెత్తించే ఇలాంటి అంశాలు మాట్లాడటం సరికాదన్నారు.

జాతీయజెండాను అవమానించిన పవన్ కల్యాణ్ పై చర్య తీసుకోవాలి. 
జాతీయ జెండా పట్టుకుని పవన్ ఎన్నికల ర్యాలీలో పాల్గొనటం ఏంటి పవన్?..ఇదేనా నీ దేశభక్తి.జెండాలు మార్చటం పవన్ కి అలవాటే కావచ్చు.. కానీ జాతీయ జెండాని కూడా రాజకీయాల్లో వాడటం ఏంటి?
దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నాం.నీవు చదివిన రెండులక్షల పుస్తకాలలో జాతీయజెండాను ఎలా గౌరవించాలనే అంశం లేదా అని అప్పిరెడ్డి ఎద్దేవా చేశారు.

కోమటి జయరాం పాస్ పోర్ట్ సీజ్ చేసి వెంటనే అరెస్ట్ చేయాలి. 
చంద్రబాబు అండ్ కో ను ప్రజలు నమ్మడం లేదని అందుకే ఎన్.ఆర్.ఐ.లను రంగంలోకి దింపారని కోమటి జయరాం లాంటి వాళ్లు ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలా తెలుగుదేశం పార్టీ ఎలాగైనాసరే గెలిచేందుకు కోట్లు వెదజల్లుతున్నారు. చివరికి ఓటర్లను వెధవలు అంటూ దూషిస్తున్నారు. ఓటర్లను అవమానించి వ్యక్తిగతంగా దూషించిన టిడిపి ఎన్ ఆర్ ఐ వింగ్ కోఆర్డినేటర్ కోమటి జయరాంపై చర్యలు తీసుకోవాలి. చేశారు.ప్రజాస్వామ్యంపై నిత్యం లెక్చర్లు ఇచ్చే నిమ్మగడ్డ రమేష్ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. రూ.2 వేల కోట్లు డంప్ చేశారని మాకు సమాచారం ఉందన్నారు.వెంటనే కోమటి జయరాంని అరెస్టు చేసి విచారణ జరపాలన్నారు.ఆయని పాస్‌పోర్ట్ ని సీజ్ చేయాలన్నారు.ఎన్నికలు ప్రజాస్వామ్య పద్దతిలో జరగేలా చర్యలు చేపట్టాలని లేళ్ళ అప్పిరెడ్డి ఎన్నికల కమీషన్ కు విజ్ఞప్తి చేశారు.

Back to Top