మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశం

సీఎం వైయస్‌ జగన్‌

నంద్యాల‌: జీసస్ జీవితమే మానవాళికి గొప్ప సందేశం అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఏసు ప్రభువును శిలువ వేసిన గుడ్‌ ఫ్రై డే రోజు, ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్‌ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలు అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇవన్నీ తన జీవితం, బోధనలు ద్వారా జీసస్‌ లోకానికి ఇచ్చిన సందేశాలు అని ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ కీర్తించారు.
 

Back to Top