వైయస్ఆర్‌సీపీ ప్ర‌చార ర‌థాలు ప్రారంభం

ఎల్ఈడీ ప్రచార రథాల‌ను ప్రారంభించిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి 

స్వ‌చ్ఛందంగా ప్ర‌చార ర‌థాలు స‌మ‌కూర్చిన‌ యూఎస్ఏకి చెందిన వైయ‌స్ జగన్ అభిమానులు

ఎన్ఆర్ఐ మిత్రులకు అభినందనలు 

తాడేప‌ల్లి: వచ్చే నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రచారం కోసం  యూఎస్ ఏకి చెందిన ఎన్ ఆర్ ఐ మిత్రులు 13 వాహనాలను సమకూర్చడం జరిగింది. ఇప్పుడే వాటిని ప్రారంభించాం. పూర్తిగా ఎవరు అడిగింది కాదు స్వచ్ఛందంగా జగన్,వైయస్సార్ సిపి అభిమానులు వీటిని అందించారు. ఈ ఐదు సంవత్సరాలుగా జరిగిన సంక్షేమం,అభివృధ్ది లాగానే మరో ఐదేళ్ళు కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు.చల్లా మధు వాళ్ళ టీమ్ కోఆర్డినేట్ చేసి వాటిని నియోజకవర్గాలకు పంపారు. అక్కడ ఈ వాహనాల ద్వారా జగన్ గారి పాలనలో పేద, ఎస్సి, బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు జరిగిన మేలు, ప్రయోజనాలను ప్రదర్శించడం జరిగుతుంది. వైయ‌స్ జగన్  విజయం మా విజయం అనుకుని పనిచేస్తున్నారు.ప్రభంజనంలా వైయస్ఆర్‌సీపీ  విజయం సాధించబోతోంది. జగనన్న వల్ల ఆంద్రప్రదేశ్ బాగుపడుతుందని భావిస్తున్నారు.ఈ మహా యజ్ఞంలో దేశ,విదేశాలలో ఉన్నవారు స్వచ్ఛంధంగా భాగస్వాములు అవుతున్నారు.అందరూ కూడా జగన్ గారు మరోసారి విజయం సాధించాలనే మనస్పూర్తిగా కోరుకుంటున్నారన్నారు.
వైయ‌స్ జగన్ ఘన విజయం సాధించబోతున్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారనే ఊపు కనిపిస్తోందని అన్నారు.

బొండా ఉమ విషయంలో చట్టం తన పని తాను చేస్తుంది 
       ప్రీప్లాన్డ్ అటాక్ అనేది ఇప్పటికీ చెబుతున్నాం. ఇద్దరికి ఆ రాయి తగిలి గాయం చేసిందంటే గురిపెట్టి కొట్టారు... మా అదృష్టం కొద్ది ప్రమాదం తప్పింది. లేదంటే వైయ‌స్ జగన్ గారికి కంటికి కొద్దిగా కింద కణతకు తగిలి ఉంటే ఏమయ్యేది. ప్రాణాలకు ప్రమాదం జరిగేది అనే విషయాన్ని గుర్తించాలి. మేం అలా మాట్లాడటానికి సాలిడ్ రీజన్ ఉంది. టిడిపి గాని, పవన్ కల్యాణ్ లాంటి ఇదంతా డ్రామా అంటున్నారు. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం. ఇదే డ్రామా వారిని ఆడమని చెప్పండి. దూరం నుంచి రాయి పెట్టి కొట్టించుకోమని చెప్పండి.అక్కడ్నుంచి రాయి పెట్టి కొట్టించుకోవడం మరొకటి చేయడం అనేది సాధ్యమా... పైగా బొండా ఉమాని టార్గెట్ గా చేస్తున్నారు.ఆయనను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పడం వింటున్నాం. అసలు ఇరికించాలని చూడటం ఏంటి...రేపు ఎక్కడైనా హత్య చేసినవాడు నన్ను హత్యయత్నంలో ఇరికించాలని చూస్తున్నారని చెబితే ఎలా కుదురుతుంది...దానిలో హేతుబధ్దత ఏమి ఉంటుంది. 

కొట్టిన వాడు దాని వెనక కుట్ర ఉంది.కుట్ర ఉందని ఎందుకు చెబుతున్నాం అంటే ముఖ్యమంత్రి అంతటి వ్యక్తిపై రాయి లేదా వెపన్ తో దాడిచేసే సాహసం ఎవరు చేయగలరు.వారి వెనక ఎవరైనా ఉండాలి. లేదా దాడి చేసిన వారిని రెచ్చగొట్టడం అన్నా చేసి ఉండాలి. ఇందులో ఒకరిని ఇరికించేది ఏమీ ఉండదు.వారి చేసి ఉంటే దొరుకుతారు. దొరికితే చట్టం తన పనిచేసుకుంటుంది. ఇది ఒక ప్రకారం జరిగింది అని మేం ఫస్ట్ నుంచి చెబుతున్నామో అలానే ఇప్పుడు కనిపిస్తోంది. బొండా ఉమ రోల్ ఉంటే అదే బయటకు వస్తుందని అన్నారు. బొండా ఉమా ఉన్నాడా..ఆయన కంటే పైన వారు ఉన్నారా అనేది విచారణలో బయటపడుతుందన్నారు.
సీఎం గారిపై దాడి ప్రీప్లాన్డ్ అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి.దానికి మోటివ్ ఎవరికి ఉంటుందని బావించినప్పుడు పలానా వాళ్ళు అయి ఉండవచ్చని అనుకున్నాం.వారు కాక ఇంకా ఎవరైనా ఉండవచ్చా..లేదా చంద్రబాబు ఉన్నారా అనేది విచారణలో తేలాల్సి ఉంది. జరిగిన దాడి హత్యాయత్న అందులో సందేహం లేదన్నారు.  సలహాదారుల విషయంలో ఈసి నిభంధనలు గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఎన్నికల నియమావళికి సంబంధించి ఏ విధమైన నిబంధనలు ఉంటాయో అవే వర్తిస్తాయి అని అన్నారు.

Back to Top