ఆ ఆర్టికల్స్ ను పెయిడ్ ఆర్టికల్స్ కింద పరిగణించాలి

ఈసీకి వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు  

అమ‌రావ‌తి:  ఈనాడు దినపత్రికలో ఏప్రిల్ 30 వతేదీన ఓటర్లను ప్రభావితం చేసే విధంగా, టిడిపి అభ్యర్దులకు అనుకూలంగా న్యూస్ ఆర్టికల్స్ ప్రచురిస్తున్నారు. ఆ ఆర్టికల్స్ ను పెయిడ్ ఆర్టికల్స్ కింద పరిగణించాలని వైయ‌స్ఆర్‌సీపీ ఎన్నికల కమీషన్ ను కోరింది.  ఎన్నికల నియమావళికి విరుధ్దంగా వ్యవహరించిన పవన్ కల్యాణ్,చంద్రబాబులపై ఎన్నికల కమీషన్ కు వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు చేసింది . పార్టీ  ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి, లీగల్ సెల్ నేత శ్రీనివాసరెడ్డి లు ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేసి ఆధారాలు అందచేశారు.

1. ఏప్రిల్ నెల 30 వతేదీన చంద్రబాబు దెందులూరు,తెనాలి లలో ప్రచారం సందర్భంగా నిర్వహించిన సభలలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిని ఉద్దేశ్యించి వ్యక్తిగత,అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుధ్దం కాబట్టి చంద్రబాబు పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

2.ఏప్రిల్ 30 వతేదీన ఉంగుటూరు,పెద్దాపురంలలో నిర్వహించిన ప్రచారసభలలో ఆయా నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నవైయ‌స్ఆర్‌సీపీ  అభ్యర్దులపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుధ్దం కాబట్టి పవన్ కల్యాణ్ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
 

 175 కి 175 సీట్లు గెలిచితీరుతాం:  ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు
  ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు అబద్దాలు,అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.ముఖ్యంగా జగన్ గారిపై ఈ యాక్ట్ పై వాస్తవ విరుద్దంగా ప్రజల ఆస్దులు తీసుకుంటున్నారని చెబుతూ ప్రజలలో అయోమయం సృష్టిస్తున్నారని అన్నారు.చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు బజారు రౌడీలుగా ప్రవర్తిస్తున్నారు.

నారాయణమూర్తి మాట్లాడుతూ పవన్ కల్యాణ్,చంద్రబాబులు పచ్చమీడియాతో కలసి కుట్రపూరితంగా అబద్దాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం పవన్ మాట్లాతున్నారు.ఓటమి భయంతో వారు మాట్లాడుతున్నారని విమర్శించారు.
 

Back to Top