చంద్రబాబు మళ్లీ జైలుకు వెళ్లక తప్పదు

వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి

వైయ‌స్ఆర్‌ జిల్లా:  సీఎం చంద్రబాబు నాయుడు మళ్లీ జైలుకు వెళ్లక తప్పదని వైయ‌స్ఆర్ సీపీ వైయ‌స్ఆర్‌ జిల్లా అధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే పీ రవీంద్రనాథ్‌ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని, ఇసుక, మద్యంలో దోచేసుకుంటున్నారని ఆయ‌న‌ మండిపడ్డారు. గత వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వంలో ఉన్న ఇసుక డంప్‌ను టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఖాళీ చేసిందని ఆరోపించారు. బుధ‌వారం ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

స్కిల్‌ కేసులో చంద్రబాబును ఆనాడు అరెస్టు చేస్తే పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు. అన్యాయంగా అరెస్టు చేశారంటూ బార్యా, పిల్లలు, దత్త పుత్రుడు అంతా గోల చేశారు. ఆనాడు ఈడీ ఇచ్చిన సమాచారం మేరకు అరెస్టు జరిగింది. ఇప్పుడు ఈడీ వారి ఆస్తులను కూడా అటాచ్ చేసింది. ఇప్పుడు స్కిల్ అక్రమాలు చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందని తేలింది. 

పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేసేందుకు చంద్రబాబు పెద్ద స్కెచ్ వేశాడు. షెల్ కంపెనీలతో 370 కోట్లు కొట్టేసి నిరుద్యోగులకు అన్యాయం చేశారు. సీమెన్స్ సంస్థ పేరు చెప్పుకుని.. డిజైన్ టెక్ అనే షెల్ కంపెనీ ద్వారా నిధులు కొట్టేశారు. ఆ ఫైల్ డ్రాఫ్ట్ పై అన్నీ చోట్ల చంద్రబాబు సంతకం ఉంది. జరిగిన అక్రమాలన్నీ నిజమే కాబట్టే ఈడి ఆస్తులు అటాచ్ చేసింది.

మద్యంలో టీడీపీ సిండికేట్ల వల్ల తెలంగాణా కంటే తక్కువ ఆదాయం వచ్చిందని, 90 శాతం టీడీపీ  వారికే వచ్చాయని, మిగిలిన 10శాతం షాపులు పొందిన వారిని కూడా బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ అక్రమాలను, అబద్ధపు హామీలను ప్రజలే ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. విజయవాడ వరదల్లో వచ్చిన విరాళాలు కూడా జేబులో వేసుకుంటున్నారని మండిపడ్డారు. 

చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎటు వెళ్తుందో, ఏమైపోతుందోననే ఆందోళన కలుగుతోందన్నారు. ప్రభుత్వ దురాగతాలు మితిమీరి పోతున్నాయని విమర్శించారు. వీళ్ళ అకృత్యాలు ప్రజలకు తెలియకుండా మీడియా గొంతు నొక్కుతున్నారని, టీవీ9, సాక్షి, ఎన్టీవీలతో పాటు మరి కొన్ని ఛానళ్లను ప్రసారం కాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దుర్మార్గమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి అన్నారు.

Back to Top