తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు అందించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్న పోలీసులు. ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. కాగా, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైయస్ఆర్ సీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి అంటూ ఇప్పటికే పలువురు నాయకులపై కేసులు పెట్టి వేధించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అక్రమంగ అరెస్టు చేసి జైల్‌లో పెట్టారు. ఆ కేసుతో ఎలాంటి సంబంధం లేని సజ్జల రామకృష్ణారెడ్డికి పోలీసులు నోటీసులు ఇవ్వడం పట్ల పార్టీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ సర్కార్ తీరును వైయస్ఆర్‌సీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.