పల్లగిరిలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త దారుణ హత్య 

ఎన్టీఆర్‌ జిల్లా:  ఏపీలో  రోజు రోజుకు హత్యా రాజకీయాలు పెరిగిపోతున్నాయి. విద్వేషమే లక్ష్యంగా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులపై విరుచుకుపడుతున్నారు దుండగులు. నందిగామ నియోజకవర్గం పల్లగిరిలో  వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త దారుణంగా హత్యగావించబడ్డాడు. శనివారం నాగుల్‌ మీరా అనే వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తను  దారుణంగా హత్య చేశారు దుండగులు.

నాగుల్‌ మీరాను హతమార్చి  ఊరి బయట నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు. ఈ  విషాద ఘటన సమాచారాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు.. నాగుల్‌ మీరా మృతదేహాన్ని పరిశీలించారు. హంతకులను కఠినంగా శిక్షించాలని ఆయ‌న డిమాండ్‌ చేశారు. 

Back to Top