వైయ‌స్ఆర్‌సీపీలోకి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి ముర‌ళీకృష్ణంరాజు  

వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరిక‌

తాడేప‌ల్లి: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి భారీషాక్ త‌గిలింది. అధికార తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి ముదునూరి ముర‌ళీకృష్ణంరాజు ఆ పార్టీని వీడి వైయ‌స్ఆర్‌సీపీ గూటికి చేరారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మక్షంలో  ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ముదునూరి ముర‌ళీకృష్ణంరాజు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. ఆయ‌న‌కు వైయ‌స్ జ‌గ‌న్ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  ముర‌ళీకృష్ణంరాజు అమలాపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడిగా కూడా ఉన్నారు. కార్య‌క్ర‌మంలో పార్టీ సీనియ‌ర్ నేత‌లు వైవీ సుబ్బారెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్ర‌బోస్‌, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top