అధికార పార్టీ అండ‌తోనే అశోక్ రెడ్డి అరాచ‌కాలు

మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా

క‌డ‌ప‌: క‌డ‌ప న‌గ‌రంలోని 24వ డివిజ‌న్ టీడీపీ ఇన్‌చార్జ్ అశోక్‌రెడ్డి అరాచ‌కాల‌కు అధికార టీడీపీ అండ‌గా ఉంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మండిప‌డ్డారు. కడప నగరంలోని జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు దేవి రెడ్డి ఆదిత్య, నగర యువజన విభాగం అధ్యక్షుడు గుంటి నాగేంద్ర మీడియాతో మాట్లాడారు. 

అంజాద్‌బాషా ఏమ‌న్నారంటే..

  • రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హామీలను తుంగలోకి తొక్కింది
  • పది నెలల కాలంలో సాధించింది ఎందంటే మద్యం ఏరులా పారేలా చేసింది
  • సంతల్లో కూడా బెల్ట్ షాప్ లను ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు చేస్తోంది
  • టన్నుల కొద్ది గంజాయి సరఫరా చేస్తూ విద్యార్థులతో అమ్మకాలు చేస్తోంది
  • అడ్డు అదుపు లేకుండా పార్టీ నేతల కనుసన్నుల్లో జూదం సాగిస్తున్నారు
  • 24వ డివిజన్ టిడిపి ఇన్చార్జ్ అశోక్ రెడ్డి జూదం నిర్వహిస్తూ రాయచోటిలో పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి
  • జూదం ఆడిస్తూ పట్టుబడ్డ అశోక్ రెడ్డి వైయ‌స్ఆర్‌సీపీ నేతగా చెప్పడం బాధాకరం
  • అశోక్ రెడ్డి 24డివిజన్ టీడీపీ ఇంచార్జిగా ఉన్నారు
  • ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులతో కలిసి ఫోటో దిగిన అశోక్ రెడ్డి
  • లక్ష రూపాయలు కట్టి టీడీపీలో శాశ్వత సభ్యత్వం తీసుకున్న వ్యక్తి అశోక్ రెడ్డి
  • అలాంటి వ్యక్తిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం అంటగట్టడం సరికాదు
  • అసాంఘిక శక్తులను అణిచివేసే దిశగా అడుగులు వేయాలని ఎస్పీ ని కోరాం
  • పోలీసులు పట్టుకొని వదిలేసిన అశోక్ రెడ్డి వెనుక ఉన్న శక్తి ఎవరు
  • పోలీసులకు పట్టుబడ్డాక 41నోటీసులు ఇచ్చి ఎందుకు వదిలిపెట్టారో పోలీసులు సమాధానం చెప్పాలి
  • అసాంఘిక శక్తుల వెనుకున్న శక్తి ఎవరో బయట పెట్టాలి
  • అలాంటి వారిని మా అధినేత వైయ‌స్ జగన్ ఉపేక్షించలేదు
  • సమీప బంధువు కొండారెడ్డి ని సైతం అరెస్ట్ చేయించిన వ్యక్తి  వైయ‌స్ జగన్ 
  • అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని, వెనుక ఉన్న నేతలపై పోలీసులు కఠినంగా వ్యవహారించాలి 
  • భూ ఆక్రమణలకు, భూ దందాలకు పాల్పడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు
  • మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు
  • బురద జల్లడం కాదు.. ఆరోపణలు నిరూపించాలి
  • అరాచక శక్తి అశోక్ రెడ్డి వెనుకున్న ఆ నేత ఎవరో బయట పెట్టాలి.
  • అరాచకశక్తులను పెంచి పోషిస్తున్నది టీడీపీనే.
  • యువతను సైతం అశోక్ రెడ్డి పావులా వాడుకుంటున్నారు..
  • సమాజానికి చెడు చేసే అశోక్ రెడ్డి లాంటి వ్యక్తులపై ఉక్కు పాదం మోపాల‌ని అంజాద్‌బాషా డిమాండ్ చేశారు.
Back to Top