కేంద్ర కార్యాలయంలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి

తాడేప‌ల్లి:  అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములు జ‌యంతి వేడుక‌లు తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాల‌యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పొట్టి శ్రీ‌రాములు చిత్రపటానికి పార్టీ నేత‌లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పొట్టి శ్రీ‌రాములు రాష్ట్రానికి చేసిన సేవ‌ల‌ను, త్యాగాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు. కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు
 

Back to Top