లింగమయ్యకు కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ అండ

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా: తెలుగుదేశం పార్టీ గుండాల చేతిలో దారుణ హత్యకు గురైన సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌ కురుబ మజ్జిగ లింగమయ్య కుటుంబానికి  పార్టీ అండగా నిలిచింది. పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. శనివారం రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి నివాసంలో లింగమయ్య భార్య రామాంజనమ్మ, కుమారులు హరి, శ్రీనివాసులుకు పార్టీ నేత‌లు చెక్‌ను అందజేశారు. పార్టీ అన్ని విధాల అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసా క‌ల్పించారు. కార్య‌క్ర‌మంలో వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ శ్రీసత్య సాయి జిల్లా అధ్యక్షురాలు, మాజీమంత్రి ఉషశ్రీచరణ్,  సీనియర్‌ నాయకులు తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top